Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
TRAI Blocks Sim Cards: ప్రభుత్వ టెలికాం శాఖ ఫేక్ కాల్స్ చేస్తున్న సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 1.77 కోట్ల సిమ్ కార్డులను ట్రాయ్ బ్లాక్ చేసింది.
Fake Calls: ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ టెలికాం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రభుత్వ టెలికాం శాఖ 1.77 కోట్ల మొబైల్ నంబర్లను నిలిపివేసింది. ఫేక్ కాల్స్ చేయడానికి వీటిని ఉపయోగించారు. దేశంలోని 122 కోట్ల మంది టెలికాం వినియోగదారులను ఇటువంటి కాల్స్ నుంచి రక్షించేందుకు ట్రాయ్ సహకారంతో టెలికాం విభాగం ఈ చర్య తీసుకుంది. ఇద్దరూ కలిసి ఫేక్ కాల్స్‌పై చర్యలను మరింత ముమ్మరం చేశారు. ట్రాయ్ గత నెలలో ఒక కొత్త విధానాన్ని రూపొందించింది. తద్వారా ఇప్పుడు టెలికాం ఆపరేటర్లు తామే స్వంతంగా మార్కెటింగ్, ఫేక్ కాల్‌లను ఆపవచ్చు. దీనికి ఇకపై వైట్‌లిస్ట్ అవసరం లేదు.
టెలికాం డిపార్ట్‌మెంట్ తెలుపుతున్న దాని ప్రకారం ప్రతిరోజూ దాదాపు 1.35 కోట్ల ఫేక్ కాల్స్‌ను విజయవంతంగా నిలిపివేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫేక్ కాల్స్ చేస్తున్న 1.77 కోట్ల మొబైల్ నంబర్లను డిపార్ట్‌మెంట్ నిలిపి వేసింది. ప్రజల ఫిర్యాదులపై చర్యలు చేపట్టి కేవలం ఐదు రోజుల్లోనే దాదాపు ఏడు కోట్ల కాల్స్‌ను నిలిపివేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని టెలికాం శాఖ పేర్కొంది.
Also Read: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?
ఫేక్ కాల్స్‌కు చెక్ పెట్టడం కోసమే...
టెలికాం డిపార్ట్‌మెంట్ ఫేక్ కాలర్‌లను ఆపడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా వారు లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. ఫేక్ కాల్స్‌ను అరికట్టేందుకు టెలికాం శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇక నుంచి కాలర్లకు వైట్‌లిస్ట్ చేసిన టెలిమార్కెటింగ్ కాల్స్ మాత్రమే వస్తాయి.
11 లక్షల ఖాతాలు ఫ్రీజ్
తాజాగా దాదాపు 11 లక్షల ఖాతాలను బ్యాంకులు, పేమెంట్ వాలెట్లు స్తంభింపజేసినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో మరిన్ని సిమ్ కార్డులు బ్లాక్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ)తో కలిసి పనిచేస్తున్న నాలుగు టెలికాం సర్వీస్ ఆపరేటర్లు (టీఎస్‌పీలు) 45 లక్షల నకిలీ అంతర్జాతీయ కాల్‌లను టెలికాం నెట్‌వర్క్‌కు చేరకుండా నిరోధించారు.
Also Read: రూ.10 వేలలోపు 128 జీబీ ఫోన్ - వివో వై18టీ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి?
With this, we conclude #SATRC25. Sincere thanks to all dignitaries, regulators, and industry leaders. United in vision, the path ahead for telecom innovation, inclusivity, and progress is limitless. Together, we move towards a brighter future via @TRAI pic.twitter.com/4WpxAoP742
— TRAI (@TRAI) November 13, 2024
Mr. Masanori Kondo, Secretary General of the Asia-Pacific Telecommunity, delivers thoughtful closing remarks at #SATRC25, highlighting the significance of regional collaboration and the collective efforts driving digital transformation across South Asia. #TogetherFurther #TRAI pic.twitter.com/haaAJ6BdcB
— TRAI (@TRAI) November 13, 2024