అన్వేషించండి

Jio Vs Airtel: ఒక్క రూపాయి తేడాతో 28 జీబీ డేటా, 22 ఓటీటీ యాప్స్ - ఈ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లలో ఏది బెస్ట్?

Jio vs Airtel Best Prepaid Plan: ప్రస్తుతం జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు రూ.500 లోపు రెండు మంచి ప్లాన్లు అందిస్తున్నాయి. మరి ఈ రెండు ప్లాన్లలో ఏది బెస్ట్ ప్లాన్? ఎందులో ఎక్కువ లాభాలు లభిస్తాయి?

Jio vs Airtel Plan Under Rs 500: ప్రస్తుతం మనదేశంలో రీఛార్జ్ ప్లాన్‌లు చాలా ఖరీదైనవిగా మారాయి. భారతదేశపు రెండు పెద్ద టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్ ఈ సంవత్సరం జూలై నెల నుంచి తమ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను చాలా వరకు పెంచాయి. ఇది వినియోగదారుల బడ్జెట్‌ను చాలా వరకు ప్రభావితం చేస్తోంది.

ఈ కారణంగా వినియోగదారులు చాలా ఆలోచించి రీఛార్జ్ ప్లాన్‌లను కొనుగోలు చేస్తున్నారు. దీని కారణంగా వీలైనంత ఎక్కువ ఇంటర్నెట్ డేటాను, ఇతర ప్రయోజనాలను తక్కువ ధరతో పొందగలరు. ఈ కథనంలో జియో, ఎయిర్‌టెల్‌కు సంబంధించిన రెండు ప్లాన్ల గురించి తెలుసుకుందాం. ఈ రెండు ప్లాన్ల ధర మధ్య తేడా కేవలం ఒక్క రూపాయి మాత్రమే కానీ ప్రయోజనాల పరంగా వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.

జియో రూ. 448 ప్లాన్ (Jio Rs 448 Plan)
జియో అందిస్తున్న ఈ రూ. 448 ప్లాన్ వాలిడిటీ 28 రోజుల వరకు ఉంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు ప్రతిరోజూ 2 జీబీ డేటాను పొందుతారు. అంటే మొత్తంగా 56 జీబీ డేటాను పొందవచ్చు. ఇది కాకుండా అపరిమిత కాలింగ్, రోజువారీ 100 ఎస్ఎంఎస్, 12 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ ప్లాన్‌తో ఉచితంగా లభిస్తాయి. ఇందులో సోనీ లివ్, జీ5, జియో సినిమా ప్రీమియం వంటి ఓటీటీ యాప్‌లు ఉన్నాయి. ఇది కాకుండా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి సర్వీసులు కూడా ఉచితంగా లభిస్తాయి.

Also Read: వాట్సాప్‌లో వీటిని షేర్ చేస్తే ఇక జైలుకే - రూల్స్‌ను టైట్ చేసిన గవర్నమెంట్!

ఎయిర్‌టెల్ రూ. 449 ప్లాన్ (Airtel Rs 449 Plan)
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ. 449గా ఉంది. అంటే ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర పైన పేర్కొన్న జియో రీఛార్జ్ ప్లాన్‌ కంటే కేవలం ఒక రూపాయి మాత్రమే ఎక్కువ. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో, వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. ఈ సమయంలో వినియోగదారులు రోజుకు 2 జీబీకి బదులుగా 3 జీబీ మొబైల్ డేటాను పొందుతారు. ఈ విధంగా మొత్తం 28 రోజుల్లో మొత్తం 84 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం, 22 ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తాయి. ఇందులో సోనీ లివ్, సన్‌నెక్స్ట్, హొయ్‌చొయ్ మొదలైన ఓటీటీ యాప్‌లు ఉన్నాయి.

రెండు ప్లాన్ల మధ్య తేడా ఏంటి?
జియో, ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ల మధ్య తేడా గురించి చెప్పాలంటే ఎయిర్‌టెల్ వినియోగదారులు రోజుకు 1 జీబీ అదనపు డేటాను పొందుతారు. అంటే కేవలం ఒక్క రూపాయి ఎక్కువ ఖర్చు చేయడం ద్వారా మొత్తం 28 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఇది కాకుండా ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు జియో కంటే 10 ఎక్కువ ఓటీటీ యాప్స్ ఉచిత సభ్యత్వాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ సందర్భంలో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్ జియో ప్లాన్ కంటే మెరుగ్గా కనిపిస్తుంది.

Also Read: అందరికీ ఫేవరెట్‌గా మారుతున్న యాపిల్ - ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా ఐఫోన్ 15!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget