అన్వేషించండి

Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయినా లబ్ధిపొందొచ్చని వివరించారు.

Telangana News: తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు అమలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు అమలు చేయబోయే ఇందిరమ్మ ఇళ్ల పథకం మరో ఎత్తు. ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందుకే నిబంధనల్లో కాస్త సడలింపులు ఇస్తోంది. 

రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు

రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడానికి సిద్ధమవుతున్న మంత్రి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మాట్లాడిన గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ గుడ్ న్యూస్ చెప్పారు. రేషన్ కార్డు లేకపోయిన పేదలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. అయితే మొదటి విడతకు మాత్రమే ఇది పరిమితం అవుతుందని తెలిపారు మంత్రి. 

రెండో విడత నుంచి రేషన్ కార్డు ఉండాల్సిందే

ప్రస్తుతం జరుగుతున్న కుటుంబ సర్వే పూర్తి అయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేస్తామని మంత్రి తెలిపారు. ప్రస్తుతానికి అందరికీ రేషన్ కార్డులు లేనందున ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో దీన్ని చేర్చడం లేదన్నారు. తర్వాత విడుత నుంచి మాత్రం రేషన్ కార్డు కంపల్సరీ చేయబోతున్నట్టు స్పష్టం చేశారు. 

ఆరు నుంచి ప్రత్యేక యాప్ ద్వార లబ్ధిదారుల ఎంపిక

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ఎప్పుడే ప్రారంభించిన ప్రభుత్వం తొలి విడతలో ఇంటి స్థలం ఉండి గృహాలు లేని వారిపై ఫోకస్ పెట్టింది. వీళ్లకు ఇళ్లు కట్టించే ఇచ్చే బాధ్యత భుజాన వేసుకుంది. రెండో విడతలో స్థలం కూడా లేని వారికి ఇళ్లు కట్టించి ఇస్తారు. నవంబర్ ఆరు నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమవుతుంది. దీని కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఒకసారి సమాచారం సేకరించిన తర్వాత దాని ఆధారంగా గ్రామసభలు ఏర్పాటు చేసి అర్హులను నిర్ణయిస్తారు. 

గ్రామసభల్లో లబ్ధిదారుల తుది జాబితా  

నవంబర్‌ 15వ తేదీ నుంచి 20 మధ్య ఈ గ్రామసభలు జరగనున్నాయి. గ్రామస్థలు సమక్షంలో అర్హులు ఖరారైన తర్వాత వారికి స్థలం కేటాయిస్తారు. కేంద్రం చెప్పిన నిబంధనల ప్రకారం 80 గంజాల వరకు స్థలం ఇస్తారు. ఆయా గ్రామాల్లో స్థలం అందుబాటులో ఉంటే సరేసరి లేకుంటే కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇస్తారు. 

Also Read: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?

రాయితీపై నిర్మాణ సామగ్రి ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలకు అవకాశం లేకుండా ఉండేందుకు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పర్యవేక్షణకు అధికారులను ప్రభుత్వం నియమించనుంది. ఈ నిర్మాణాలకు ఉచితంగా ఇసుక, రాయితీపై మిగతా నిర్మాణ సామగ్రి సప్లై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఐదేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం 

నియోజకవర్గానికి తొలి దశలో 3,500 ఇళ్లు కేటాయించి అవి నిర్మాణాల పూర్తి అయిన తర్వాత రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇలా ఐదేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

Also Read: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget