Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Caste census: కులగణనను రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. దీని ద్వారా ఆయన రాజకీయ లక్ష్యాలను సాధించాలని అనుకుంటున్నారు
Revanth Reddy took caste very seriously: తెలంగాణ రాజకీయాల్లో కులగణన గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరమైన సమస్యలు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేసీఆర్ నిర్వహించిన సకలజనుల సర్వే కన్నా భిన్నంగా ఈ కులగణన చేపట్టబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి ఈ గణన చేపడతారు. దీని ద్వారా ఏ కులం వారు ఎంత మంది ఉన్నారన్నదానిపై స్పష్టత వస్తుంది. రాహుల్ గాందీ ఈ కులగణనపై దేశవ్యాప్తంగా సంవిధాన్ సమ్మాన్ సభలు నిర్వహిస్తున్నారు. రాహుల్ ఆలోచనల్ని రేవంత్ ఫాలో అవుతున్నారు.
రాజకీయంగా కాంగ్రెస్‌కు ఎంతో లాభం
కులగణనను రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక ప్రయత్నాలు చేస్తున్నారు. చట్టపరంగా కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేMejg. ఐదో తేదీన రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. కులగణనపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. బీసీలు ఎంత మంది ఉన్నారో లెక్కించి వారికి జనాభా దామాషా పద్దతిలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కులగణన చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి అగ్రవర్ణాల్లో మద్దతు తక్కువే. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. బీసీలు కూడా మద్దతుగా నిలిస్తే పూర్వ వైభవం వస్తుందని అనుకుంటున్నారు. రాహుల్ ఆలోచనల్ని తెలంగాణలో రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాజకీయంగా మైనస్‌లు కూడా ఉన్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నా… వాటిని పరిష్కరించుకుందామని ముందుకెళ్తున్నారు.
Also Read: KTR Letter: తెలంగాణ సమాజాన్ని మోసం చేసినందుకు క్షమాపణలు చెప్పండి- రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
కులగణన అనేది చట్టబద్దంగా కాదని పూర్తిగా రాజకీయం కోసం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి . గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇలా కులగణన చేయించారు. ఆ ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. కానీ న్యాయస్థానం కొట్టేసింది. బీజేపీ మాత్రం కులగణనకు వ్యతిరేకంగా ఉంది. కులగణన వద్ంటోంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కులగణన వాదన వినిపిస్తున్నారు. బీసీ వర్గాలను దగ్గర తీయడానికి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇలాంటి విషయాల్లో మరింత దూకుడుగా ఉంటారు. అందకే ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం కులగణన చేస్తామని అంటున్నారు. అయితే ఆ కులగణన ఫలితాలను ఎలా ఉపయోగించుకుంటారన్నది కీలకం.
కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికల
కులగణన ఆధారంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రేవంత్ ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. జనాబా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం ప్రస్తుతానికి సాధ్యం కాదు. కానీ స్థానిక ఎన్నికల్లో మాత్రం ఆ దామాషా ప్రకారం ఆయా కులాలకు కాంగ్రెస్ సీట్లు కేటాయించడం ద్వారా తాము చిత్తశుద్దితో ఉన్నామని నిరూపించుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే చట్టాలు మార్చి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని భరోసా ఇచ్చే అవకాశం ఉంది. ఇది రాజకీయంగా కాంగ్రెస్‌కు మేలు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.