TSPSC Group 1 Exam: తెలంగాణలో గ్రూప్1 మెయిన్స్ పరీక్ష ప్రారంభం- అభ్యర్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పిన రేవంత్ రెడ్డి
Telangana News: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు.
Telangana CM Revanth Reddy Best Wishes To Group 1 Candidates: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఎన్నో వాయిదా మరెన్నో వివాదం మధ్య అసలు పరీక్ష ఇప్పట్లో అవుతుందా లేదా అన్న మీమాంస మధ్య అక్టోబర్ 21 మధ్యాహ్నం రెండు గంటల నుంచి పరీక్ష ప్రారంభమైంది. ఈ పరీక్ష ప్రారంభానికి ముందే సుప్రీంకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందరికీ బిగ్ రిలీఫ్ వచ్చిట్టు అయింది. ఎలాంటి ఆందోళన లేకండా ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పరీక్ష రాస్తున్న వారికి సీఎం శుభాకాంక్షలు చెప్పారు. విజయం సాధించాలని ఆకాంక్షించారు.
"ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు శుభాకాంక్షలు. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి. ఈ పరీక్షల్లో మీరు విజయం సాధించి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని…మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను." అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న…
— Revanth Reddy (@revanth_anumula) October 21, 2024
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు …
హాజరవుతున్న అభ్యర్థులకు …
నా శుభాకాంక్షలు.
ఎటువంటి ఆందోళన చెందకుండా…
పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయండి.
ఈ పరీక్షల్లో మీరు …
విజయం సాధించి…
తెలంగాణ పునర్ నిర్మాణంలో…
భాగస్వాములు కావాలని…
మనస్ఫూర్తిగా…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ బీఆర్‌ఎస్ హయాంలో వచ్చింది. అయితే ప్రిలిమ్స్ అయిన తర్వాత అనేక ఆరోపణలతో మొదటిసారి పరీక్ష రద్దు అయింది. కొన్ని నెలల పాటు గ్యాప్ ఇచ్చి మరోసారి ఎగ్జామ్ నిర్వహించారు. అప్పుడు కూడా పరీక్ష ప్రిలిమ్స్ దాటి ముందుకు సాగలేదు.
ఈ నోటిఫికేషన్ లైవ్‌లో ఉండగానే ప్రభుత్వ మారిపోయింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ వేసింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసింది. ఈ ప్రభుత్వం 563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 29 వివాదాస్పదమైంది. ఓవైపు ఈ వివాదం కొనసాగుతుండగానే కొందరు అభ్యర్థులు చదువుకోవడానికి పరీక్షను వాయిదా వేయమంటే ప్రభుత్వ వాయిదా వేసి ప్రిలిమ్స్ నిర్వహించింది.
ఆ ఫలితాలు వచ్చినప్పటికీ రిజర్వేషన్లతోపాటు కీ లో తప్పులను సోషల్ మీడియాలో తిప్పారు. దీనిపై కోర్టుల్లో కేసులు వేశారు. వీటిపై విచారణ సాగుతుండగానే మెయిన్స్‌కు డేట్స్ ప్రకటించింది. హాల్‌టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో పెట్టేసింది టీఎస్‌పీఎస్‌సీ. దీంతో వివాదంలో రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకున్నాయి. కోర్టుల్లో పిటిషన్ వేసిన అభ్యర్థులుక చుక్కెదురైంది. ఇంతలో ప్రభుత్వం కూడా అక్టోబర్ 21న పరీక్ష నిర్వహించేందుకే మొగ్గు చూపి ఏర్పాట్లు చేసింది.
అనుకున్నట్టుగానే విజయవంతంగా ఇవాళ్టి నుంచి మెయిన్స్ పరీక్షలు ప్రారంభించేసింది. ఇవాళ్టి నుంచి ఏడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. సాయంత్రం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు రాయనున్నారు అభ్యర్థులు. ముందు జాగ్రత్త చర్యగా అభ్యర్థులను 12.30 నుంచి 1.30 మధ్యకాలంలోనే పరీక్ష కేంద్రంలోకి అనుతిస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతి ఇవ్వడం లేదు.
ఇలా పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు కొందరు నిరాశతో వెనుదిరిగారు. బేగంపేటలో ఓ అభ్యర్థి ఆలస్యంగా వచ్చాడని పరీక్ష రాసేందుకు అధికారులు అంగీకరించలేదు. బయటే ఉంచేశారు అయితే ఆ వ్యక్తి పరీక్ష కేంద్రం గోడ దూకి లోపలికి వెళ్లేందుకు యత్నించాడు. వెంటనే పట్టకున్న పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష కోసం 46 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 563 పోస్టులు కోసం పాతికవేల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. జనరల్ ఇంగ్లిష్ తప్ప మిగతా పరీక్షలు నచ్చిన భాషలో రాసుకోవచ్చు. అన్నీ కూడా ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది.
గ్రూప్-1 మెయిన్స్ 2024 ఏ రోజు ఏ పరీక్ష అంటే...
21.10.2024: జనరల్ ఇంగ్లిష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
22.10.2024: పేపర్-1 (జనరల్ ఎస్సే)
23.10.2024: పేపర్-2 (హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ)
24.10.2024: పేపర్-3 (ఇండియన్ సొసైటీ, కానస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్)
25.10.2024: పేపర్-4 (ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్)
26.10.2024: పేపర్-5 (సైన్స్ & టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్)
27.10.2024: పేపర్-6 (తెలంగాణ ఉద్యమం, రాష్ట్రావతరణ)