Sourav Ganguly Biopic Announced: ప్రిన్స్ గంగూలీ పై బయోపిక్...నిర్మించనున్న లవ్ ఫిల్మ్స్... గంగూలీ పాత్రలో హృతిక్‌రోషన్ నటిస్తాడా?
కోల్‌కతా ప్రిన్స్, దాదా, టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిమానులకు గుడ్ న్యూస్.
కోల్‌కతా ప్రిన్స్, దాదా, టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిమానులకు గుడ్ న్యూస్. త్వరలోనే అతడి జీవిత కథ ఆధారంగా బయోపిక్ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా దాదానే సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అభిమానులకు నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి.
View this post on Instagram
ఈ నేపథ్యంలో గంగూలీ ‘క్రికెటే నా జీవితంగా మారింది. అది నా ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు ఏ సందర్భంలోనూ తలవంచకుండా ముందుకు సాగడాన్ని నేర్పింది. ఈ ప్రయాణం ఆస్వాదించదగింది. లవ్‌ఫిల్మ్స్ చిత్ర నిర్మాణ సంస్థ నా జీవితాన్ని వెండి తెరపైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ దాదా తన సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నాడు. ఇప్పట వరకైతే గంగూలీ పాత్రలో ఎవరు నటిస్తారనేది తెలియదు.
We are thrilled to announce that Luv Films will produce Dada Sourav Ganguly's biopic. We are honoured to be entrusted with this responsibility and look forward to a great innings. 🏏🎥@SGanguly99 @luv_ranjan @gargankur
— Luv Films (@LuvFilms) September 9, 2021
గతంలో దాదా ఓ సందర్భంలో మాట్లాడుతూ... తన బయోపిక్‌లో హృతిక్‌రోషన్ నటిస్తే బాగుంటుందని చెప్పాడు. దాదా తనపై బయోపిక్ రూపొందుతోందని చెప్పగానే అప్పటి వీడియో వైరల్‌గా మారింది. మరి గంగూలీ కోరిక మేరకు హృతిక్ ఆ పాత్రను పోషిస్తాడో లేదో చూడాలి. లేదంటే మరో నటుడు ఈ పాత్రలో చూస్తామో తెలియాలంటూ కొద్ది రోజులు వేచి చూడాల్సిందే
The man originally wanted Hrithik ROshan to play him in his biopic, but that is obviously not gonna happen. https://t.co/0ibx1oTf6g pic.twitter.com/lpmNHxkrrv
— ʍɑղղ (@90eez) September 9, 2021