అన్వేషించండి

IPL Media Rights Tender LIVE: ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐకి వరుస షాకులు!

IPL Media Rights Tender live: ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి! బిడ్డర్లు వరుసగా తప్పుకుంటున్నారు. వేల కోట్లు కురుస్తాయని ధీమాగా ఉన్న బోర్డుకు..

IPL Media Rights Tender live:  ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంలో బీసీసీఐకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి! బిడ్డర్లు వరుసగా తప్పుకుంటున్నారు. వేల కోట్లు కురుస్తాయని ధీమాగా ఉన్న బోర్డుకు ఈ వ్యవహారం మింగుడు పడటం లేదు. ఇప్పటికే అమెజాన్‌, గూగుల్‌ సాంకేతిక బిడ్లు సమర్పించలేదు. ఇప్పుడు జీ సైతం ప్యాకేజ్‌-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. దాంతో డిస్నీ స్టార్‌, రిలయన్స్‌ వయాకామ్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

మరికొన్ని రోజుల్లో సోనీ నెట్‌వర్క్‌లో జీ విలీనం కాబోతోంది. అలాంటప్పుడు వారికి పోటీలో నిలవడంలో అర్థం లేదని జీ భావిస్తున్నట్టు తెలిసింది. దాంతో ప్యాకేజ్‌-ఏ నుంచి తప్పుకుందని సమాచారం. 'జీ ఎందుకు బిడ్‌ వేస్తుంది? వారి భాగస్వామి సోనీతో పోటీకి వస్తారా? తర్వలోనే ఈ రెండు సంస్థలు విలీనం అవుతున్నాయి. అందుకే రేసులో ఉండటం లేదు' అని జీ ప్రమోటర్ల సన్నిహిత వర్గాలు చెప్పినట్టు ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌ రిపోర్టు చేసింది.

మీడియా హక్కుల వేలానికి వచ్చిన బిడ్లను బీసీసీఐ న్యాయ, ఆర్థిక కమిటీలు శుక్రవారం మూల్యాంకనం చేశాయి. సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీలు ఆదివారం బిడ్డింగ్‌ రౌండ్లో పాల్గొంటారు. ఇప్పటి వరకు డిస్నీ స్టార్‌, రిలయన్స్‌, సోనీ నెట్‌వర్క్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ అర్హత సాధించాయని తెలిసింది. టైమ్స్‌ ఇంటర్నెట్‌, రిలయన్స్‌ జియో డిజిటల్‌ హక్కుల్లో పాల్గొంటున్నాయి. సూపర్‌ స్పోర్ట్‌ ప్యాకేజ్‌ డీ బరిలో ఉంది. పోటీదారులు తక్కువమందే ఉన్నారు కాబట్టి రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ హక్కులు దక్కించుకుంటారని అనిపిస్తోంది.

చివరిసారి రూ.16,347 కోట్లకు స్టార్‌ ఐపీఎల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. అన్ని విభాగాలకు కలిపి కాంపోజిట్‌ బిడ్డింగ్‌ వేసింది. అయితే ఈ సారి బీసీసీఐ కనీస ధరను రూ.33,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా ఉమ్మడి బిడ్‌ వేయకుండా ఈ సారి హక్కులను విడదీసి వాటికి విలువ కట్టింది. భారత ఉపఖండంలో ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు ఒక్కో మ్యాచుకు రూ.49 కోట్లు ధర పెట్టింది. మొత్తం 74 మ్యాచులకు రూ.18,130 కోట్లుగా నిర్ణయించింది. ఇండియన్‌ సబ్‌కాంటినెట్‌ డిజిటల్‌ రైట్స్‌కు ఒక్కో మ్యాచుకు రూ.33 కోట్లు, మొత్తంగా ఐదేళ్లకు రూ.12,210 కోట్లు కనీసం నిర్ణయించింది. డిజిటల్‌ నాన్‌ ఎక్స్‌క్లూజివ్‌ ప్యాకేజీ కింద 18 మ్యాచులకు ఒక్కో మ్యాచుకు రూ.16 కోట్ల చొప్పున 74 మ్యాచులకు రూ.1440 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్యాకేజీలో ఆరంభ మ్యాచ్‌, 4 ప్లేఆఫ్‌ మ్యాచులు, 13 ఈవినింగ్‌ డబుల్‌ హెడర్లు ఉంటాయి. సబ్‌కాంటినెట్‌కు ఆవల ఒక్కో మ్యాచుకు రూ.3 కోట్లు మొత్తంగా ఐదేళ్లకు రూ.1110 కోట్లు వసూలు చేయనుంది.

Also Read: ఐపీఎల్‌ ఒక మ్యాచ్‌ విలువ రూ.100 కోట్లు! EPL రికార్డు బద్దలే ఇక!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
Dil Raju Appointed As TFDC Chairman: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABPతిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్‌ ప్రత్యేకత !
Dil Raju Appointed As TFDC Chairman: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్‌ రాజు- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Congress One Year Rule: రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
రేవంత్ పాలనకు ఏడాది - కేసీఆర్‌ను గుర్తులను చెరిపేసే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లేనా ?
Yadadri Accident News: యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం- చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురు మృతి 
యాదాద్రి జిల్లాలో తీవ్ర విషాదం- చెరువులోకి కారు దూసుకెళ్లి ఐదుగురు మృతి 
Pushpa 2 Collection Day 2: రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?
రెండో రోజూ అల్లు అర్జున్ జోరు... బాక్సాఫీస్ బరిలో 400 కోట్లు దాటేసిన 'పుష్ప 2', టోటల్ ఎంతో తెలుసా?
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Embed widget