అన్వేషించండి

Why Vijayasai Reddy Resign: అదంతా సరే .. అసలు విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు ? తెర వెనుక ఏం జరిగింది?

Andhra : అసలు విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు చేశారన్నది స్సపెన్స్ గా మారింది. కేసుల భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎక్కువ మంది భావిస్తున్నారు.

Why did Vijayasai Reddy resign: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి  రాజీనామా చేశారు. అందరికీ ధ్యాంక్స్ చెప్పారు. తాను ఏ పార్టీలో ఉండనని వ్యవసాయం చేసుకుంటానన్నారు. అంతాత ఓకే కానీ ఇంత హఠాత్తుగా ఆయన ఎందుకు రాజీనామా చేశారన్నది రాజకీయవర్గాలకు సైతం సస్పెన్స్ గా మారింది.  ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం ట్వీట్ లో చెప్పలేదు. 

కాకినాడ పోర్టు డీల్ కారణమా ?                  

విజయసాయిరెడ్డి ఇటీవల కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు. ఇప్పుడు పూర్తిగా రాజీనామాలు ప్రకటించారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. విజయసాయిరెడ్డికి సన్నిహితమైన ఆడిటింగ్ కంపెనీని రంగంలోకి దింపి.. వెయ్యి కోట్లు అవకతవకలకు పాల్పడినట్లుగా మొదట నివేదిక ఇప్పించారు. ఆ నివేదిక చూపించి బెదిరించి పోర్టులో వాటాలను రాయించుకున్నారు. తర్వాత నివేదిక మార్పించి తక్కువ జరిమానా వేశారు. అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోర్టును లాగేసుకున్నట్లుగా స్పష్టంగా ఉందని టీడీపీ నేతలంటున్నారు. సీఐడీతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతోంది. పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డికి చెందిన కంపెనీ. ఈ కేసులు చుట్టుముడుతూండటంతో ఆయన ఆందోళన చెందారని భావిస్తున్నారు. 

టీడీపీ రెడ్ బుక్‌లో విజయసాయిరెడ్డి  పేరు 

మరో వైపు తెలుగుదేశం పార్టీ సిద్దం చేసుకున్న రెడ్ బుక్ లో విజయసాయిరెడ్డి పేరు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో విజయసాయిరెడ్డి చేసిన చాలా వ్యవహారాల తాలూకా రికార్డులను సిద్ధం చేశారని కార్యాచరణ ప్రారంభించగానే ఆయనపై కేసుల ఉచ్చు ప్రారంభమవుతుందని చెప్పుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా చేసి సన్యాసం ప్రకటించారు. అంతే కాదు... చంద్రబాబుతో రాజకీయంగానే విబేధించానని ఆయన చెప్పారు. పవన్ తో స్నేహం ఉందన్నారు. ఈ మాటల్ని బట్టి చూస్తే.. ఇక తన జోలికి రావొద్దని తాను అన్నీ వదిలేశానని చెప్పినట్లుగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. టీడీపీ నేతల్ని వ్యక్తిగతంగా వేధించడంలో. .కోడెల ఆత్మహత్య చేసుకోవడంలో ఆయన పాత్ర ఎక్కువని టీడీపీ నేతలు అంటూంటారు. 

వీటికి విజయసాయిరెడ్డి భయపడతారా ?

అయితే ఇలాంటి వాటికి ఆయన భయపడతారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే పదహారు నెలలకుపైగా జైల్లో ఉన్నారు. కేసులకు భయపడి మొత్తం రాజకీయ సన్యాసం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆయన ఒక్కరిపైనే ప్రభావం ఉండదని తన వియ్యంకుడి కుటుంబంతో పాటు మంచి ఫార్మా కంపెనీగా వృద్ధి చెందిన అరబిందోపై కూడా ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతో ఆయన వెనక్కి తగ్గారని అంటున్నారు. అసలు రాజీనామాలకు కారణాలేమిటో ఆయన ప్రకటిస్తే కానీ స్పష్టత రాదు. ఒక వేళ ప్రకటించినా అసలు నిజమేంటో ఆయనకే తెలుసు. 

Also Read: విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?

 

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం, నవంబర్ 15 నాటికి ఎలక్షన్స్ పూర్తి: సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం, నవంబర్ 15 నాటికి ఎలక్షన్స్ పూర్తి: సీఎం చంద్రబాబు
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
ఏపీ స్థానిక పోరులో బీసీ రిజర్వేషన్ల రాజకీయం- 34% టీడీపీ ఫార్ములాపై వైసీపీ నిలబడుతుందా?
Vijay TVK Win: తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
తమిళనాడు ఉపపోరులో విజయ్ టీవీకే విజయం - ద్రవిడ పార్టీల ఓట్ల చీలికే కాపాడిందా?
Telangana Politics Personal Attacks: తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?
తెలంగాణ రాజకీయం వ్యక్తిగత శత్రుత్వంగా మారుతోందా? - వ్యక్తిత్వాలపై దాడి దేనికి సంకేతం?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
AP Cabinet Decisions: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత..! ఏ క్షణమైనా నోటిఫికేషన్
Ambani vs Elon Musk: భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
భారత ప్రధాని అంబానీ..! స్టార్‌లింక్ జాప్యంపై బీజేపీ, రిలయన్స్‌‌ టార్గెట్‌గా ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
Alias Rukmini Heroine: 'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
'అలియాస్ రుక్మిణి'లో హీరోయిన్ ఈ అమ్మాయే... నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఆఫియా సయ్యద్
Hyderabad Crime News: చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
చెవులు కుట్టించేందుకు వెళితే రెండేళ్ల పాప మృతి- జీడిమెట్లలో విషాదం
Embed widget