అన్వేషించండి

Konda Surekha and Seethakka: సమ్మక్క, సారక్కలాగ ఉంటాం, కానీ మేం కలుసుకోవడం కష్టమే: విభేదాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క క్లారిటీ

Seethakka And Konda Surekha Visits Medaram | తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు స్పష్టం చేశారు. సమ్మక్క సారక్కలాగ ఉంటామన్నారు సీతక్క, కొండా సురేఖ.

Konda Surekha and Seethakka visits Medaram | వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఇద్దరు మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్కలు తమ విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఓ కార్యక్రమంలో భాగంగా తమ మధ్య విభేదాలు ఉన్నాయనే అపోహలను తొలగించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కొండా సురేఖ ఒకే వేదిక మీద ఉన్న సభలో తమపై వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. సీతక్క, కొండా సురేఖ విబేధాలు లేవని సమ్మక్క సారలమ్మల లాగా తాము కలిసి మెలిసి ఉంటామని.. అభివృద్ధిలో భాగం పంచుకుంటామని కొండా సురేఖ అన్నారు. 

మహిళా మంత్రుల మధ్య విభేదాలపై క్లారిటీ
ములుగు జిల్లా మల్లంపల్లి మండల కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో సీతక్క, కొండ సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. మహిళా మంత్రుల మధ్య విభేదాలంటూ మీడియాలో వస్తున్న ప్రచారం అవాస్తవమని కొండా సురేఖ అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలగా సమ్మక్క సారక్కలాగా కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడతామని సురేఖ అన్నారు. సీతక్క, సురేఖ లు ఒకటిగా ఉంటామని.. మా వెంట ప్రజలు, కార్యకర్తలు అండదండలుగా ఉండాలని సురేఖ అన్నారు. సీతక్క ఏజెన్సీలో, నేను నగరంలో పర్యటిస్తాం కాబట్టి ఇద్దరం కలుసుకోవడం కష్టమని ఆమె అన్నారు. పరస్పర అవగాహనతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే గతంలో సైతం ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరగడంపై కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. కానీ ఇద్దరి మధ్య విభేదాలు లేనిది పదే పదే సీతక్క, సురేఖ లు ఒక్కటే అనే చెప్పుకోవాల్సిన అవసరం ఏముందని విమర్శలు లేక పోకపోలేదు.

Konda Surekha and Seethakka: సమ్మక్క, సారక్కలాగ ఉంటాం, కానీ మేం కలుసుకోవడం కష్టమే: విభేదాలపై మంత్రులు కొండా సురేఖ, సీతక్క క్లారిటీ

సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న మంత్రులు. 

ఫిబ్రవరి 12 నుంచి 15 తేదీ వరకు జరిగే మిని మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు సూచించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మ వనదేవతలను మంత్రులు సీతక్క, కొండా సురేఖ, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్  దర్శించుకున్నారు. గిరిజన పూజారులు, ఎండోమెంట్ అధికారులు సన్నాయి, డోలువాయిద్యాలతో మంత్రులకు  ఘనస్వాగతం పలికారు.

వనదేవతల దర్శనం అనంతరం ఐటీడీఏ క్యాంపు ఆఫిస్ లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే మినీ మేడారం జాతర నిర్వాహణపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత మినీ మేడారంలో 15 లక్షల మంది భక్తులు వనదేవత లను దర్శించుకున్నారని, ఈ సారి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని, జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు.

Also Read: Revanth Reddy: పీఎంఏవై కింద తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇళ్లు, మెట్రో ఫేజ్-IIను జేవీగా చేప‌ట్టాలి: కేంద్రాన్ని కోరిన రేవంత్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 5th T20 Highlights : తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
తిలక్, హార్దిక్ తుపాను, వరుణ్ చక్రవర్తి వ్యూహంలో సౌతాఫ్రికా విలవిల- అహ్మదాబాద్‌లో భారత్ విజయం!
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Embed widget