News
News
X

IPL 2021, KKR vs RR: రాజస్థాన్‌పై గెలిస్తే బిందాస్‌! లేదంటే కోల్‌కతాకు తప్పదు విలవిల!

కోల్‌కతా 13 మ్యాచుల్లో 6 గెలిచింది. 12 పాయింట్లు, +0.294 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయాయి. కాబట్టి కేకేఆర్‌ తీవ్రంగా పోటీపడుతోంది.

FOLLOW US: 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆఖరి సమరానికి సిద్ధమైంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో చివరి లీగులో తలపడుతోంది. ఈ మ్యాచులో సంజు శాంసన్‌ సేనను ఓడిస్తే కేకేఆర్‌ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు అవకాశం ఉంది. లేదంటే ముంబయి గెలుపోటములపై ఆధారపడాల్సిందే. అందుకే కోల్‌కతాకు ఈ మ్యాచ్ చావోరేవో లాంటిదే.

Also Read: పేసర్ ఉమ్రాన్‌ మాలిక్‌ తండ్రి భావోద్వేగం.. టీమ్‌ఇండియాకు ఆడాలని ఆకాంక్ష!

గెలిస్తే ఓకే
కోల్‌కతా 13 మ్యాచుల్లో 6 గెలిచింది. 12 పాయింట్లు, +0.294 రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోయాయి. కాబట్టి నాలుగో స్థానం కోసం కేకేఆర్‌ తీవ్రంగా పోటీపడుతోంది. రాజస్థాన్‌పై గెలిస్తే 14 పాయింట్లతో నిశ్చింతంగా ఉండొచ్చు. ఒకవేళ ఓడిపోతే ముంబయితో ప్రమాదం తప్పకపోవచ్చు. ఆ జట్టు 12 పాయింట్లు, -0.048 రన్‌రేట్‌తో ఐదో స్థానంలో ఉంది. శుక్రవారం సన్‌రైజర్స్‌తో తలపడనుంది. అందులో ఓడిపోతే కేకేఆర్‌కు ఇబ్బంది ఉండకపోవచ్చు. ఒకవేళ గెలిస్తే మాత్రం ఇక్కడితో ఆగిపోక తప్పదు. అందుకే రాజస్థాన్‌పై గెలుపు ఆ జట్టుకు కీలకం.

Also Read: ఆఖరి లీగ్‌ పోరుకు సిద్ధం! చెన్నైపై గెలిచి గౌరవంగా వెళ్లాలనుకుంటున్న పంజాబ్‌

News Reels

రసెల్‌, లాకీ వస్తున్నారు
ఆండ్రీ రసెల్‌, లాకీ ఫెర్గూసన్‌ ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి జట్టులోకి వస్తుండటం కోల్‌కతాకు శుభసూచకం. వెంకటేశ్‌ అయ్యర్‌, శుభ్‌మన్‌ ఫామ్‌లోనే ఉన్నారు. మిడిలార్డర్‌ కొంత బలహీనంగా ఉన్నా.. నితీశ్ రాణా వికెట్లు పడకుండా అడ్డుకుంటున్నాడు. రాహుల్‌ త్రిపాఠి మరింత బాధ్యత తీసుకోవాల్సి ఉంది. మోర్గాన్‌, డీకే ఫామ్‌లోకి రావాలి. బౌలింగ్‌ పరంగా కేకేఆర్‌కు ఇబ్బందుల్లేవు. లాకీ, రసెల్‌, నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ఆకట్టుకుంటున్నారు. నితీశ్‌ రాణా మూడువేలకు ఐదు పరుగుల దూరంలో ఉన్నాడు.

Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!

సంజు సేన ప్రమాదకారే!
రాజస్థాన్‌ రాయల్స్‌ ఎప్పటికీ ప్రమాదకారే. ఎవిన్‌ లూయిస్‌, యశస్వీ జైశ్వాల్‌ పవర్‌ప్లేలో రెచ్చిపోతున్నారు. సంజు శాంసన్‌ యాంకర్‌ రోల్‌ ప్లే చేస్తున్నాడు. శివమ్‌ దూబె సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారీ షాట్లు ఆడగలడు. గ్లెన్ ఫిలిప్స్‌, రాహుల్‌ తెవాతియా, డేవిడ్‌ మిల్లర్‌ తమ స్థాయి ఇన్నింగ్సులు ఆడలేదు. చేతన్‌ సకారియా,  ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌తో పేస్‌ బౌలింగ్‌ బలంగా ఉంది. శ్రేయస్‌ గోపాల్‌ను మినహాయిస్తే స్పెషలిస్టు స్పిన్నర్లు వారికి లేకపోవడం ఇబ్బంది కరం. ఈ మ్యాచు గెలిస్తే 12 పాయింట్లతో లీగ్‌ను ముగించొచ్చు. ఒకవేళ ముంబయి, కోల్‌కతా ఓడిపోతే.. రన్‌రేట్‌ మెరుగ్గా ఉంటే ప్లేఆఫ్స్‌ అవకాశాలను కొట్టిపారేయలేం. కానీ ఇదంతా సులువేం కాదు.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 07 Oct 2021 02:44 PM (IST) Tags: IPL IPL 2021 Sanju Samson Kolkata Knight Riders Eion Morgan Rajastan Royals KKR vs RR

సంబంధిత కథనాలు

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Poland Vs Saudi Arabia: ప్రపంచకప్‌లో సౌదీకి తొలి ఓటమి - రౌండ్ ఆఫ్ 16 రేసులో పోలండ్!

Gujarat Election 2022: భార్య తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా భారత ఆల్ రౌండర్

Gujarat Election 2022: భార్య తరఫున ఎన్నికల ప్రచారం చేస్తూ బిజీగా భారత ఆల్ రౌండర్

FIFA WC 2022: ట్యునీషియాపై ఆస్ట్రేలియా విక్టరీ - మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే!

FIFA WC 2022: ట్యునీషియాపై ఆస్ట్రేలియా విక్టరీ - మ్యాచ్‌లో నమోదైన రికార్డులు ఇవే!

భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రేపే - కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ - ఎక్కడ చూడాలంటే?

భారత్, న్యూజిలాండ్ రెండో వన్డే రేపే - కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ - ఎక్కడ చూడాలంటే?

Viral Video: హామిల్టన్ చేరుకున్న టీమిండియా - అర్ష్ దీప్ భాంగ్రా డ్యాన్స్ చూశారా!

Viral Video: హామిల్టన్ చేరుకున్న టీమిండియా - అర్ష్ దీప్ భాంగ్రా డ్యాన్స్ చూశారా!

టాప్ స్టోరీస్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి