IND vs SL New Schedule: భారత్, శ్రీలంక షెడ్యూల్‌లో మార్పులు - యాక్షన్ ఒకరోజు ముందే!
భారత్, శ్రీలంకల మధ్య జరగనున్న సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. ముందుగా టెస్టులకు బదులు టీ20లు ప్రారంభం కానున్నాయి.
భారత్, శ్రీలంకల మధ్య కొద్దిరోజుల్లో క్రికెట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సిరీస్ షెడ్యూలును బీసీసీఐ సవరించింది. ముందుగా ఈ సిరీస్ టెస్టులతో ప్రారంభం కావాల్సి ఉండగా... ఇప్పుడు టీ20లతో ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 24వ తేదీన లక్నోలో మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 26వ తేదీన, మూడో టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 27వ తేదీన జరగనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లనూ ధర్మశాల స్టేడియంలో బీసీసీఐ నిర్వహించనుంది.
టీ20 సిరీస్ ముగిసిన అనంతరం మార్చి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మొదటి టెస్టు మొహాలీలో జరగనుంది. ఈ సిరీస్‌లో రెండో టెస్టు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇది డే అండ్ నైట్ టెస్టు కావడం విశేషం. మొహాలీలో జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్ విరాట్ కోహ్లీకి వందో టెస్టు కానుంది. ఈ సిరీస్‌కు సంబంధించి జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌తో రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారతాడని ప్రచారం జరుగుతోంది.
Also Read: గంభీర్ వ్యూహాలకు ఫిదా! లక్నోను నిజంగానే 'సూపర్ జెయింట్' చేశాడు!
Also Read: సన్‌రైజర్స్ పూర్తి జట్టు ఇదే, అత్యధిక రేటు ఎవరికంటే?
🚨 NEWS 🚨: BCCI announces a change in schedule for the upcoming @Paytm Sri Lanka Tour of India. #INDvSL #TeamIndia
— BCCI (@BCCI) February 15, 2022
More Details 🔽
View this post on Instagram