అన్వేషించండి

Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీపై గురి పెట్టిన స్టార్ పేసర్.. దేశవాళీల్లో అదరగొడుతున్న వెటరన్ బౌలర్

Champions Trophy 2025:మహ్మద్ షమీకి అంతర్జాతీయంగా అపారమైన అనుభవం ఉంది. ఈ బౌలర్ అన్ని ఫార్మాట్లలో కలిపి 188 మ్యాచ్ ల్లో 448 వికెట్లు తీశాడు. వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నాడు. 

Shami Injury Updates: కీలకమైన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ కు గుడ్ న్యూస్. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా విజయ్ హజారే వన్డే ట్రోఫీలో అతను బెంగాల్ తరపున పూర్తి కోటా బౌలింగ్ చేయగలిగాడు. గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న షమీ.. ఈ మ్యాచ్ లో పది ఓవర్లు వేయడంతోపాటు మూడు కీలక వికెట్లు తీసి తను ఐసీసీ టోర్నీ రేసులో ఉన్నానని చాటాడు. గురువారం హర్యానాతో ప్రి క్వార్టర్స్ మ్యాచ్ లో భాగంగా బెంగాల్ తరపున షమీ అదరగొట్టాడు. పూర్తి కోటా బౌలింగ్ చేసి తాను మెగాటోర్నీలో ఆడేందుకు సిద్ధమని సెలెక్షన్ కమిటీకి సంకేతాలు పంపాడు. 

వన్డే ప్రపంచకప్ నుంచి జట్టుకు దూరం..
చివరగా జాతీయ జట్టు తరపున షమీ.. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడాడు. ఆ తర్వాత చీలమండ గాయంతో చాలాకాలం ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కోలుకుని, దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో తొమ్మిది మ్యాచ్ లు ఆడాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ -గావస్కర్ ట్రోఫీకి ఎంపకవుతాడని ఆశలు రేకెత్తించినా, మోకాల్లో వాపు రావడంతో తనను పక్కన పెట్టారు. మళ్లీ తన ఫిట్నెస్ పై కఠోర శ్రమ చేసిన షమీ.. తాజాగా దేశవాళీల్లో ఆడుతూ పునరాగమనం కోసం చాలా కష్టపడుతున్నాడు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఇప్పటికీ మూడు మ్యాచ్ లు ఆడాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో కేవలం ఎనిమిది ఓవర్లే బౌలింగ్ చేసిన షమీ.. ఈ మ్యాచ్ లో పది ఓవర్ల కోటా పూర్తి చేసుకున్నాడు. కొంచెం పరుగులిచ్చినా, కీలకమైన మూడు వికెట్లు తీసి తను జెన్యూన్ వికెట్ టేకర్ అని నిరూపించుకున్నాడు. 

షమీ లేని లోటు..
ఇటీవల ఎక్స్ పీరియన్స్డ్ బౌలర్ లేని లోటును భారత్ బాగా ఫేస్ చేసింది. ముఖ్యంగా బీజీటీలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా మరో పేసర్ సహకారం అందించలేదు. అదే అనుభవం కలిగిన షమీ ఉన్నట్లయితే కథ మరోలా ఉండేదని చాలామంది మాజీలు, విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. ఏదేమైనా ఐసీసీ కీలక టోర్నీకి ముందు తను ఫామ్లోకి రావడం, అలాగే పూర్తి ఫిట్ నెస్ నిరూపించుకోవడం శుభపరిణామమని చెప్పవచ్చు. ఇక బీజీటీలో గాయపడిన బుమ్రా కోలుకోకపోతే పేస్ బౌలింగ్ భారాన్ని షమీనే మోసే అవకాశం ఉంటుంది. ఇక ఈ టోర్నీ కోసం జట్టును ప్రకటించేందుకు ఇంకా మూడు  రోజుల గడువు మాత్రమే ఉంది. ఈనెల 12 నాటికి జట్టును ప్రకటించాలని ఐసీసీ డెడ్ లైన్ నిర్ణయించింది. అయితే వచ్చేనెల 13 వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. వచ్చేనెల 19 నుంచి ఈ టోర్నీ పాకిస్థాన్ లో జరుగుతుంది. తన తొలి మ్యాచ్ ను దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్.. వచ్చేనెల 20న ఆడుతుంది. 

Also Read: Dhanashree verma: నా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దు - ట్రోల్స్‌పై భారత క్రికెటర్ భార్య ఫైర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Stampede Explained | తిరుపతి తొక్కిసలాట పాపం ఎవరిది.? | ABP DesamTirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Tamil 8: చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
Mudragada: చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Embed widget