Dhanashree verma: నా మౌనాన్ని చేతకానితనం అనుకోవద్దు - ట్రోల్స్‌పై భారత క్రికెటర్ భార్య ఫైర్
Dhanasree Varma: గత కొంతకాలంగా ధనశ్రీపై ట్రోల్స్ జరుగుతున్నాయి. భార్యలతో విడిపోయి దూరంగా ఉంటున్న మిగతా క్రికెటర్ల జాబితాలో చాహల్‌ను చేర్చి కొందరు ధనశ్రీని ట్రోల్ చేస్తున్నారు.
Yuzvendra Chahal News: టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్‌తో విడాకుల వార్తలపై అతని భార్య ధనశ్రీ వర్మ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను తెలిపింది. గత కొన్ని రోజులుగా తనపై అకారణ ద్వేషంతో ట్రోల్స్ జరుగుతున్నాయని, తన క్యారెక్టర్ అసాసినేషన్‌కు పాల్పడుతున్నారని వాపోయింది. నిజాలు తెలియకుండా, ఇలా అబద్ధపు కథనాలు ఎంతవరకు కరెక్టని వాదించింది. తను మౌనంగా ఉన్నానంటే అంగీకరించినట్లు కాదని, తన వైపు నిజం ఉందని ఏదో ఒక రోజు అందరికి తెలుస్తుందని వ్యాఖ్యానించింది. తను ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని, ఒకరిపై నిందలేయడం ఈజీ అని, కానీ వారి అభ్యున్నతికి పాటుపడటం చాలా కష్టమని విమర్శించింది. మొత్తానికి విడాకులపై సూటిగా స్పందించకుండా, నర్మగర్భంగా స్పందించడంపై చాహల్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. చాహల్‌కు ఎందుకు దూరంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అయితే దీనిపై ఆమె సమాధానం ఇవ్వలేదు. గత వారం చాహల్ పెట్టిన పోస్టుకు సమాధానం అన్న రీతిలో పోస్టు చేసింది.
నిందలేసిన చాహల్..
అంతకుముందు సోషల్ మీడియాలో చాహల్ ఒక పోస్టును పంచుకున్నాడు. ఎవరినో సూటిగా ప్రశ్నిస్తూ.. అందరూ విజయాన్ని మాత్రమే చూస్తుంటారని, కానీ ఆ విజయాన్ని సాధించడంతో సదరు వ్యక్తి ఎంతగా కష్టాలు పడ్డారో, ఎన్ని త్యాగాలు చేశారో గుర్తించరని వ్యాఖ్యానించాడు. అలాగే తన ఆటతో అటు తండ్రిని, తల్లిని గర్వపడేలా చేశానని, ఇది ఎల్లకాలం కొనసాగుతుందని పోస్ట్ చేశాడు. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి పోస్టు చేశారో తెలియకపోయినా, నేరుగా ధనశ్రీని ఉద్దేశించే పోస్టు చేసి ఉంటారని కామెంట్లు వస్తున్నాయి. 2020 లాక్ డౌన్ సందర్భంగా ధనశ్రీతో చాహల్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె కొరియాగ్రాఫర్, డెంటిస్ట్. హిందీ షో జలక్ దిక్లాజాతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పరిచయం ప్రేమగా మారడంతో వారిద్దరూ 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నారు.
చాహల్‌కు మద్ధతుగా..
ఇక సోషల్ మీడియాలో భార్యాభర్తలిద్దరూ అన్ ఫాలో చేసుకున్నారు. తన అకౌంట్‌లో ధనశ్రీతో దిగిన ఫోటోలను చాహల్ డిలీట్ చేయగా, ధనశ్రీ మాత్రం కొన్ని ఫొటోలను ఉంచింది. అప్పుడప్పుడు చాహల్ కు మద్ధతుగా పోస్టులు చేస్తూ ఉంటుంది. అయితే వీరిద్దరు ఇలా విడిగా ఉండటానికి కారణాలు తెలియడం లేదు. విడాకుల కోసం కూడా అప్లై చేసుకున్నారని, త్వరలోనే దీనిపై సమాచారం వస్తుందని సన్నిహితులు చెబుతున్నారు. అయితే రిలేషన్ షిప్‌లో చాహల్ అన్ హేపీగా ఉన్నాడని, అలాగే ఇలాంటి మెసేజ్ పెట్టాడని అతని అభిమానులు వాదిస్తున్నారు. ఏదేమైనా చాహల్ వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగడం లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఇరువురు భార్యాభార్తలు విడివిడిగా ఉంటుండంతో పాటు రూమర్లపై స్పందించకపోవడంతో ఈ విషయం ఇంకా జటిలంగా మారింది. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తే బాగుంటుందని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం చాహల్ భారత జట్టులో రెగ్యులర్‌గా ఆడటం లేదు. దాదాపు రెండున్నర ఏళ్ల నుంచి తను జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కేవలం దేశవాళీల్లో మాత్రమే ఆడుతున్నాడు. మరోవైపు తన సహ కొరియోగ్రాఫర్ తో ధనశ్రీ సన్నిహితంగా దిగిన ఫొటోలను చూసి చాహల్ అభిమానులు మండిపడుతున్నారు. చాహల్ ను ధనశ్రీ మోసం చేసిందని భారీగా ట్రోల్ చేశారు. దానికి కౌంటర్ గా ధనశ్రీ పై పోస్టును పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read: ICC Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీని పాక్ నుంచి తరలిస్తారా? - పీసీబీ ధోరణిపై ఐసీసీ గుర్రు.