Vaikunta Ekadasi 2025: వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. అన్నం తింటే ఏమవుతుంది!
Mukkoti Ekadasi 2025: ఏడాదికి వచ్చే 24 ఏకాదశిలు దేనికదే ప్రత్యేకం..వీటిలో ముక్కోటి ఏకాదశి పరమపవిత్రం. ఈ రోజు ఉపవాసం , జాగరణ, శ్రీహరి నామస్మరణ అత్యుత్తమం అని చెబుతారు..ఎందుకంటే...
Vaikunta Ekadasi 2025: రాత్రి సమయం అయిన దక్షిణాయనం పూర్తిచేసుకుని దేవతలకు పగటి సమయం అయిన ఉత్తరాయణం (Uttarayana 2025 ) ప్రారంభం అవుతోంది. ఈ సందర్భంగా నిద్రనుంచి మేల్కొనే శ్రీమన్నారాయణుడిని ఉత్తరద్వారనుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయని, సకల బాధల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.
శ్రీ మహావిష్ణువు.. మధుకైటవులు అనే రాక్షసులకు ముక్తిని ప్రసాదించి వారికి ఉత్తరద్వార దర్శనం ( Uttara Dwara Darshanam ) కల్పించింది ఈరోజే. ఇదే రోజు మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ మురాసరుడు నివశించే ప్రదేశం అన్నం..అందుకే ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని, అన్నం అస్సలు తినకూడదని పండితులు చెబుతారు.
సప్త చిరంజీవుల్లో ఒకరైన వ్యాసమహర్షి (The Seven Immortals Of Indian Mythology ) రచించిన భవిష్యోత్తర పురాణం ప్రకారం...ధనుర్మాసంలో సూర్యుడు తన దిశను మార్చుకునే ముందు వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 10న ముక్కోటి ఏకాదశి వచ్చింది.
Also Read: వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ శ్లోకాలతో తెలియజేయండి!
ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం అత్యంత ప్రధానం..ఈ రోజు తెల్లవారుజామున ( Brahma Muhurta time) మూడు గంటల నుంచి వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈ రోజు యథాశక్తి విష్ణువును పూజించి.. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఆలయాల్లో స్వామివారికి తులసిమాలలు సమర్పించాలి.
వైకుంఠ ఏకాదశిరోజు చేసే ఉపవాసం 24 ఏకాదశిలకు చేసే ఉపవాసంతో సమానం అని శాస్త్రం చెబుతోంది. అనారోగ్య సమస్యలు ఉన్నవారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. దశమి రోజు నుంచి ఉపవాస నియమాలు పాటించి..ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటారు. రోజంతా భగవంతుడి ధ్యానంలో ఉంటారు. సంధ్యాసమయంలో పూజ పూర్తిచేసి రాత్రంతా జాగరణ చేయాలి. జాగరణ చేసేటప్పుడు హరినామస్మరణ చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుంది. ఆ తర్వాత ద్వాదశి రోజు ఉదయం యధాశక్తి పూజ చేసి, దానం చేసి...ద్వాదశి ఘడియలు ముగియకముందే ఉపవాసాన్ని విరమించాలి
Also Read: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలు.. భారీగా పెరిగిన రద్దీ, భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం!
ఏకాదశి అంటే 11 ...అంటే ఇందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు...వీటిని అదుపులో ఉంచుకుని వాటిపై నియంత్రణ సాధించడమే ఈ వ్రతం ఆంతర్యం..
ఉపవాసం అంటే అన్నపానీయాలకు, సుఖాలకు దూరంగా భగవంతుడిని నామస్మరణలోనే గడిపేయడం
జాగారం అంటే ప్రాపంచిక విషయాలు విడిచిపెట్టి విష్ణుసేవలో ఉండడం
ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్ఠలతో ఆచరించేవారికి జ్ఞానం కలుగుతుంది. ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే మిగిలిన రోజుల కన్నా రెట్టింపు పలితం ఉంటుందంటారు పండితులు.
ఈ రోజు విష్ణు సహస్రనామం (Sree Vishnu Sahasra Nama Stotram) పఠించినా..విన్నా పుణ్యఫలం.
Also Read: వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోన్న దక్షిణ అయోధ్య.. భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు!
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైకనాథం
మీకు, మీ కుటుంబ సభ్యులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు