Tirumala: తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలు.. భారీగా పెరిగిన రద్దీ, భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం!
Tirumala: జనవరి 10 వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇప్పటి నుంచీ భారీగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తులకోసం టీటీడీ కీలక సూచనలు చేసింది
Tirumala Vaikuntha Ekadasi 2025: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి 19 వరకూ పది రోజుల పాటూ వైకుంఠ ద్వార దర్శనాలుంటాయి. ఇందులో భాగంగా జనవరి 07న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరుడి ఆలయంలో ఏడాదికి నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఏటా వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం పర్వదినాలకు ముందు ఆలయ శుద్ధి కార్యక్రమం జరుపుతారు. ఈ కార్యక్రమంలో TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు, TTD ఈవో జే శ్యామలరావు, అడిషనల్ EO సీహెచ్ వెంకయ్య చౌదరి, TTD పాలకమండలి సభ్యులు, TTD అధికారులు పాల్గొన్నారు.
Also Read: వైకుంఠ ఏకాదశికి సిద్ధమవుతోన్న దక్షిణ అయోధ్య.. భద్రాద్రిలో ఉత్తర ద్వార దర్శన ఏర్పాట్లు!
భక్తుల ఆరోగ్యం కోసం
వైకుంఠ ఏకాదశి ( Tirumala Vaikuntha Ekadasi )పర్వదినం సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తులకు భరోసా కల్పించడమే తమ లక్ష్యం అన్నారు అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి. భక్తులకు ఆహారాన్ని అందించడంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని తిరుమలలోని హోటళ్ల యజమానులకు పలు సూచనలు చేశారు. ఈ మేరకు తిరుమల ఆస్థాన మండపంలో హోటళ్ల యజమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అదనపు ఈవో పలు సూచనలు చేశారు. అన్ని హోటళ్లు ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆవరణలో పరిశుభ్రత పాటించాలని , తిరుమల ఖ్యాతిని నిలబెట్టేలా వ్యవహరించాలని సూచించారు. షాపుల ఓనర్స్ కి SOP జాబితాను సిద్ధం చేయాలని, చెక్‌లిస్ట్ ఇవ్వాలని, ఏవైనా కొరత ఉంటే వాటిని సరిదిద్దేందుకు సమయం ఇవ్వాలని సంబంధింత అధికారులను ఆదేశించారు. ఇకపై కన్సల్టెంట్‌ను ఏర్పాటు చేసి..రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌లు రెగ్యులర్ గా తనిఖీలు చేస్తారని చెప్పారు వెంకయ్య చౌదరి.
Also Read: వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్లలేనివారు.. హైదరాబాద్ ఈ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి!
తిరుమలలో భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలలో భారీగా రద్దీ పెరిగింది. చలి వణికిస్తున్నా భక్తులు శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. జనవరి 07మంగవారం రోజు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవాం ఉదయానికి 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. లడ్డూ తయారీ కేంద్రాల వద్ద, అన్న ప్రసాదం కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ అధికంగా ఉందన్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న భక్తులకోసం కంపార్ట్ మెంట్స్ లో వైద్యులను అందుబాటులో ఉంచినట్టు చెప్పారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా లక్షలమంది భక్తులు శ్రీనివాసుడిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు.
ఓం నమో వెంకటేశాయ నమః
Also Read: కోటి పుణ్యాలకు సాటి వైకుంఠ ఏకాదశి - 2025లో ఎప్పుడొచ్చిందంటే!