Spirituality: విభీషణుడు సహా ఇప్పటికీ జీవించి ఉన్న పురాణ పురుషులు వీళ్లే!
త్రేతా యుగానికి చెందిన విభీషణుడు కలియుగంలోనూ ఇంకా బతికే ఉన్నాడా? రామనామ స్మరణలో ఉంటూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడా? విభీషణుడితో పాటూ ఇప్పటికీ నేలపై సంచరిస్తున్న పురాణ పురుషులు ఎవరెవరు?
Saptha Chiranjeevulu : హనుమాన్ సినిమాలో విభీషణుడి క్యారెక్టర్లో సముద్రఖని నటించాడు. ఇందులో విభీషణుడు.. ఆంజనేయుడి పుట్టుక గురించి వివరిస్తాడు, మానవాళికి పొంచి ఉన్న ముప్పునుంచి రక్షించేందుకు దిగిరావాలని ప్రార్థిస్తాడు. ఈ సినిమా చూస్తున్న సమయంలో చాలామందికి...ఇంకా విభీషణుడు బతికే ఉన్నాడా అనే సందేహం వచ్చింది? త్రేతాయుగంలో రావణుడి సోదరుడిగా ఉండే విభీషణుడు కలియుగంలోనూ బతికే ఉన్నాడా? అనుకున్నారు. అయితే విభీషణుడు మాత్రమే కాదు యుగయుగాలుగా ఈ భూమ్మీద బతికే ఉన్నవారు ఏడుగురు ఉన్నారు. వీళ్లనే సప్త చిరంజీవులు అంటారు. చిరంజీవులు అంటే మరణం లేనివారు అని అర్థం...పురాణాల ప్రకారం ఇలాంటి వాళ్లు ఏడుగురున్నారు.
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
ఆంజనేయుడు
హిమాలయాల్లో హనుమాన్ ఉన్నాడని..పాదముద్రలు కనిపించాయని కొందరు, నేరుగా హనుమాన్ ని చూశాం అని ఇంకొందరు అంటారు. ఎవరు చూశారో చూడలేదో కానీ ఆంజనేయుడు ఇప్పటికీ ఉన్నాడన్నది నిజం అనే చెబుతారు. సప్త చిరంజీవుల్లో ఒకడైన ఆంజనేయుడికి.. త్రేతాయుగంలో శ్రీరాముడు స్వర్గాన్ని ప్రసాదించాడట. అయినప్పటికీ నీ నామ స్మరణ కన్నా స్వర్గం ఏముంది..ఎప్పటికీ రామభక్తుడిగానే ఉండిపోతానని వరం కోరుకున్నాడు. అందుకే హనుమాన్ చిరంజీవిగా ఉండిపోయాడు. రామ నామ సంకీర్తన ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమాన్ ఉంటాడని భక్తుల నమ్మకం.
Also Read: ఈ ఆలయంలో ఉండే విగ్రహాల్లో నిధులకు సంబంధించిన రహస్యాలున్నాయా!
విభీషణుడు
రామాయణంలో ప్రముఖంగా చెప్పుకునే క్యారెక్టర్లలో విభీషణుడు ఒకడు. రావణుడి తమ్ముడిగా రాక్షస వంశంలో పుట్టినప్పటికీ ఆయన సర్వజ్ఞుడు. విశ్రావసుడు - కైకసీల సంతానం అయిన విభీషణుడు గొప్ప జ్ఞాని. సీతను అపహరించిన రావణుడికి ఎన్ని విధాలుగా చెప్పినా వినలేదు సరికదా రాజ్యం నుంచి బయటకు పంపించేశాడు.రాముడి చెంతకు చేరిన విభీషణుడు...రాముడి అనుగ్రహంతో చిరంజీవి అయ్యాడు.
వ్వాసమహర్షి
వ్యాసమహర్షి అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించడం వల్ల వేద వ్యాసుడనే పేరొచ్చింది. వేదాలతో పాటూ మహాభారతం, భాగవతం, అష్టాదశపురాణాలు రచించింది వేదవ్యాసుడే. ఆధ్యాత్మిక వారసత్వాన్ని అందించినందునే వ్యాసమహర్షిని ఆది గురువుగా పూజిస్తారు.
Also Read: ఈ రాశుల ఉద్యోగులకు ఆదాయంతో పాటూ బాధ్యతలు కూడా పెరుగుతాయి, ఏప్రిల్ 28 రాశిఫలాలు
అశ్వత్థాముడు
కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడి మరణవార్త విన్న అశ్వత్థాముడికి ఆగ్రహం వచ్చింది. ప్రభువు రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో శిబిరంలో నిద్రపోతున్న ఉప పాండవుల తలలు నరికేసి..వాటిని తీసుకొచ్చి దుర్యోధనుడి దేహం ముందు పడేశాడు. ఆ ఘటన చూసిన అర్జునుడు ఆగ్రహంతో కత్తిదూయగా వద్దని వారిస్తుంది ద్రౌపది. ఆసమయంలో శ్రీ కృష్ణుడు ఇచ్చిన శాపం ఫలితంగానే అశ్వత్థాముడు చిరంజీవిగా మిగిలిపోయాడు. నువ్వు చేసిన పాపపు పనికి ఒళ్లంతా కుళ్లిపోయి, రక్తమాంసాలతో కంపుకొడుతూ చావుకోసం ఎదురు చూస్తూ ఇలాగే ఉండిపోతావనే శాపం ఇచ్చాడు కృష్ణుడు.
బలిచక్రవర్తి
హారణ్య కశిపుడి కొడుకు, శ్రీహరి భక్తుడైన ప్రహ్లాదుడికి మనవడు బలిచక్రవర్తి. స్వర్గాధిపత్యంకోసం దండెత్తిన బలిచక్రవర్తి..ఓ సందర్భంలో శ్రీ మహావిష్ణువును తూలనాడడంతో...ఆ హరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు ప్రహ్లాదుడు. అలా మూడు అడుగుల నేల కోసం వచ్చిన వామనుడు..బలిని పాతాళానికి తొక్కేసిన కథ తెలిసిందే కదా. అయితే బలిని పాతాళానికి పంపించాడు కానీ తనకి చావుని ప్రసాదించలేదు. అలా బలి చిరంజీవి అయ్యాడు..
Also Read: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
కృపాచార్యుడు
శరద్వంతుడు అనే మహర్షి తపస్సు భంగం చేయడానిరి ఇంద్రుడు ఒక అప్సరసను పంపుతాడు. అలా శరద్వంతుడికి ఆ అప్సరసకు జన్మించిన కుమారుడే కృపుడు. కృపుడు శరద్వంతుడి దగ్గర ధనుర్విద్య నేర్చుకున్నాడు. మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షం నిలిచి యుద్ధం చేశాడు . సప్త చిరంజీవుల్లో ఆరోవాడిగా కృపుడిని చెబుతారు.
పరశురాముడు
రేణుకా జమదగ్ని కుమారుడు పరశురాముడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసిన పరశురాముడికి ఈశ్వరుడు బోయవాడి వేషంలో వచ్చి పరీక్షించాడు. అలా శివానుగ్రహంతో భార్ఘవాస్త్రము పొందాడు. విష్ణుమూర్తి దశావతారములలో ఒకటైన ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు. పరుశరాముడు కూడా ఇప్పటికీ బతికే ఉన్నాడని చెబుతారు.
Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!