weekly horoscope 29 April To 5 May 2024: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!
Weekly Horoscope: ఏప్రిల్ ఆఖరు..మే మొదటి వారం చాలా రాశులవారికి మంచి ఫలితాలున్నాయి. ఈ వారం కొన్ని రాశులు ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. మిగిలిన రాశుల పరిస్థితేంటి...
![weekly horoscope 29 April To 5 May 2024: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు! weekly horoscope 29 april to 5 may 2024 saptahik rashifal for aries taurus gemini leo cancer and other zodiac sign weekly horoscope 29 April To 5 May 2024: మే మొదటివారం ఈ రాశులవారు గుడ్ న్యూస్ వింటారు - ఏప్రిల్ 29 నుంచి మే 05 వారఫలాలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/27/6e9aca596a955950a5579afdb6c1b43d1714197244229217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Weekly horoscope 29 April To 5 May 2024
మేష రాశి
మేష రాశివారికి వారం ప్రారంభంలో కన్నా వారాంతం బాగానే ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ధైర్యంగా ఉంటారు. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బావుంటుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
వృషభ రాశి
ఈ రాశివారికి చంద్రుడు అనుకూలంగా ఉన్నందున వారం ఆరంభంలో ప్రశాంతంగా ఉంటారు కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వారం మధ్యలో పని విషయంలో ఒత్తిడికి గురైనా కానీ మళ్లీ నార్మల్ అవుతారు. కెరీర్ మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు.ల పిల్లల కారణంగా సంతోషం పొందుతారు.
మిథున రాశి
మిథున రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారికి ఆరంభంలో నష్టాలున్నా ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆదాయం పెరుగుతుంది. మీ పనితీరు మరింత మెరుగుపర్చుకుంటారు. ఏ ఏ పనులు పూర్తిచేయాలో ఆ ప్రణాళికలు విజయవంతం అవుతాయి
Also Read: 'మే' నెల ఏ రాశులవారిని ముంచేస్తుంది - ఏ రాశులవారికి కలిసొస్తుంది!
కర్కాటక రాశి
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోండి.ఈ రాశి ఉద్యోగులు వారం మధ్యలో శుభవార్త వింటారు. పదోన్నతి పొందే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారాల్లో ఏదో తెలియని ఆందోళనతో ఉంటారు. వారాంతానికి ప్రశాంతంగా ఉంటారు. చేపట్టిన పనిపై పూర్తిగా దృష్టి సారించండి. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకునేవారు బయటపడతారు.
సింహ రాశి
గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలువస్తాయి. స్నేహితులకు సమయం కేటాయిస్తారు. ఆరోగ్యంపై దృష్టి పెడతారు. ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
కన్యా రాశి
వారం ఆరంభంలో కుటుంబ సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. వారాంతానికి సంతోషం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. పాత ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!
తులా రాశి
ఈ వారం మీకు ఒత్తిడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేరు. ఉద్యోగులు పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తుల అమ్మకం ద్వారా లాభపడతారు.
వృశ్చిక రాశి
వారం ప్రారంభంలో మీ సహోద్యోగుల కారణంగా బాధపడతారు. వారాంతం స్నేహితులతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ వారం కొత్త వ్యక్తులను కలుస్తారు. మీ పనిలో లక్ష్యాలు సాధించడంలో విజయం సాధిస్తారు.
Also Read: చీకటి పడగానే నగర పర్యటన చేస్తూ సంహారానికి పాల్పడే అమ్మవారి గురించి విన్నారా!
ధనుస్సు రాశి
వారం ప్రారంభంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు. వివాదాస్పద విషయాల్లో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు, ఏకాంత ప్రదేశాలకు వెళ్లకండి.
మకర రాశి
ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతారు. చేసే పనిలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. వారాంతానికి కొన్ని సానుకూల వార్తలు వింటారు. వ్యాపారులు అనుకోకుండా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ వారం స్థిరాస్తుల నుంచి లాభం పొందుతారు. కోర్డు కేసుల్లో విజయం సాధిస్తారు.
కుంభ రాశి
విలాసవంతమైన భోజనం చేస్తారు. సేవింగ్స్ పై దృష్టిపెడతారు. స్నేహితులను కలుస్తారు. ఉద్యోగులు పనిలో వేగం పెరుగుతుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. వారం చివర్లో గుడ్ న్యూస్ వింటారు.
Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
మీన రాశి
సంపాదన పెరుగుతుంది. సహోద్యోగులు మీ నిర్ణయాలకు మద్దతిస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)