Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ
Andhra Pradesh Liquor Rates:ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పది రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీర్, 99 రూపాయల క్వార్టర్ మాత్రం పెరగడం లేదని చెప్పింది.

Andhra Pradesh Liquor Rates: ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం జరుగుతున్నట్టు మద్యం ధరలు భారీగా పెరగలేదని ఎక్సైజ్ కమిషనర్ ప్రకటించారు. బాటిల్‌పై కేవలం పది రూపాయలు మాత్రమే పెంచుతున్నట్టు పేర్కొన్నట్టు. ప్రచారం జరుగుతున్నట్టు 20 రూపాయలు మాత్రం పెరగడం లేదని తెలిపారు. ప్రధాన మీడియా సహా వివిధ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ఖండించారు. మద్యం బాటిళ్ల ధర పెంపు గురించి వస్తున్న సమాచారంపై స్పష్టత ఇచ్చారు.
బాటిల్ అసలు ధర పెంపు కేవలం ₹10 మాత్రమే అని తెలిపారు నిషాంత్. బ్రాండ్ లేదా క్వార్టర్ లేదా హాఫ్ లేదా ఫుల్ బాటిల్ అనేదానితో సంబంధం లేకుండా ఈ పెంపు ఉంటుందని పేర్కొన్నారు. కొంతమంది ₹15 లేదా ₹20 పెరిగిందని తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారని సరికాదని అన్నారు. అందులో నిజం లేదని వెల్లడించారు. ప్రజలు వాస్తవాలను తెలుసుకొని అపోహలకు గురి కాకూడదని సూచించారు. తాజా ధరల వివరాలను అన్ని షాపుల్లో ప్రదర్శించాలని దుకాణదారులకు ఆదేశించారు. బీరు, రూ 99 మద్యం సీసాలపై ఎటువంటి పెంపు లేదన్నారు.
ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం మార్జిన్‌ను 14.5 నుంచి 20 శాతానికి పెంచింది. ఇప్పుడు ప్రతి బాటిల్‌పై మరో పది రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గత అక్టోబర్‌లో ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు తక్కువగానే ఉన్నాయి.
ఇప్పటికే మద్యం షాపులు కేటాయించిన ప్రభుత్వం ఈ మధ్య కాలంలో గీతకార్మికులకు కొన్ని షాపులు రిజర్వ్ చేసింది. ఈ మధ్య వాటికి దరఖాస్తులను ఆహ్వానించింది. వచ్చిన దరఖాస్తుల్లో సోమవారం లాటరీ ద్వారా వారికి కేటాయింపు ప్రక్రియను చేపట్టింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

