Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారు!
Delhi BJP CM: న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ ఢిల్లీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

Delhi BJP CM Parvesh Verma: 26 ఏళ్ల తర్వాత ఢిల్లీ అసెంబ్లీలో ఘన విజయం సాధించిన బీజేపీ... ముఖ్యమంత్రి ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఏబీపీకి అందుతున్న కీలక సమాచారం ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేశ్ వర్మ ప్రమాణం చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ పేరుపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య ఇప్పటికే ఒక ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ కొత్త చరిత్ర సృష్టించారు. జెయింట్ కిల్లర్ అయిన పర్వేశ్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు.
కేజ్రీవాల్‌ను ఓడించినందుకు గిఫ్ట్
ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏకాభిప్రాయంతో బిజెపి నాయకత్వం పర్వేశ్ వర్మ పేరును ఖరారు చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించినందుకు ఈ బహుమతి ఇవ్వబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఢిల్లీ రాజకీయాల్లో 'జెయింట్ కిల్లర్'
ఢిల్లీ రాజకీయాల్లో పర్వేశ్ వర్మ పేరు 'జెయింట్ కిల్లర్'గా మారింది. యమునా నది సమస్యను ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో అన్ని వైపుల నుంచి కేజ్రీవాల్‌ను దిగ్బంధించి విజయం సాధించారు. ప్రచారంలో ఊపిరి సలపనీయకుండా ఎదురు దాడి చేసి ప్రజలను మెప్పించారు.
ముందు నుంచే నియోజకవర్గంపై పట్టు పెంచుకున్నారు. కేజ్రీవాల్ లోటుుపాట్లు తెలుసుకొని వాటిపై ఎక్కువ ప్రచారం చేశారు పర్వేశ్ వర్మ. ఆప్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు ఖరారు కాక ముందు నుంచే తానే అభ్యర్థిని అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. అదే పర్వేశ్ వర్మకు బాగా కలిసి వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు వరకు తీసుకెళ్తోంది.
ఫలితాల తర్వాత అమిత్ షాతో ప్రత్యేక భేటీ
ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన మొదటి వ్యక్తి పర్వేశ్ వర్మ. పార్టీ అగ్ర నాయకత్వం తనపై నమ్మకం ఉంచిందని గ్రహించిన అమిత్‌షాను కలిసి కృతజ్ఞత చెప్పారు. సీఎం అభ్యర్థిపై పోటీకి ఓకే చెప్పడం వల్లే ఇదంతా సాధ్యమైందని ఆయన నమ్మకం. అంత విశ్వాసం పెట్టుకున్నందుకు కలిసి ధన్యవాదాలు చెప్పారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కేజ్రీవాల్‌పై పోటీ చేసిన పర్వేశ్ వర్మకు 30088 ఓట్లు వచ్చాయి. ఇది 48.82 శాతం. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్‌కు 25999 ఓట్లు వచ్చాయి. ఇది 42.18 శాతంగా ఉంది. ఆయనకు 29878 ఈవీఎం ఓట్లు రాగా, 210 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. అరవింద్ కేజ్రీవాల్‌కు 25865 ఈవీఎం ఓట్లు, 134 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కేజ్రీవాల్‌పై 4089 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
Also Read: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం, సంతోషంగా లేని ఎన్డీయే మిత్రపక్షాలు - రీజన్ ఏంటి?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

