Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Jagan: జగన్ లీవ్ లెటర్ ఇస్తే అనర్హతా వేటు ఉండదని స్పీకర్ అయ్యన్న చెప్పారు. అయితే ఇప్పటి వరకూ అలాంటి లేఖ ఏమీ అందలేదన్నారు.

Andhra politics: ఆంధ్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా మూడు వారాల పాటు నిర్వహించాలని అనుకుంటున్నారు.ఈ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యేది లేదని ప్రకటించారు. సభకు వెళ్లక పోతే మీపై అనర్హతా వేటు వేస్తారంటున్నారని కొద్ది రోజుల కిందట తాడేపల్లి నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఓ మీడియా ప్రతినిధి జగన్ ను ప్రశ్నించారు. వారికి బుద్ది పుట్టింది చేసుకోని అని జగన్ తేలికగా తీసుకున్నారు. అంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే అసెంబ్లీకి మాత్రం హాజరయ్యేది లేదని జగన్ తీర్మానించుకున్నారని అనుకోవచ్చు.
ఇదే అంశంపై ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని.. కంటిన్యూగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరు అయితే సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేశారు. ,నిబంధన ఉంది దాన్ని అమలు చేయటం సభ బాధ్యత అన్నారు. 60 రోజులు రాకపోతే సభలో పెట్టాలి ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. అంటే ఒక వేళ జగన్మోహన్ రెడ్డి లీవ్ లెటర్ పంపిస్తే అనర్హతా వేటుకు అవకాశం ఉండదు. లీవ్ లెటర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నదానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ.. ఆ లెటర్ అంటూ వస్తే అప్పుడు అనర్హత వేటు గురించి ప్రొసీజర్ ప్రారంభించాల్సిన అవసరం ఉండదని ఆయన చెప్పినట్లుగా అర్థం చేసుకోవచ్చు.
రాజకీయ పరంగా చూస్తే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ జగన్ పై అనర్హతా వేటుకు సిద్ధంగా ఉన్నారని వారి మాటల్ని బట్టి అర్థమైపోతుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. కనీసం లీవ్ లెటర్ కూడా పంపరని ఆయన మనస్థత్వం గురించి తెలిసిన వైసీపీ నేతలు చెుబతూంటారు. తాను ఫలానా కారణంతో రావడం లేదని స్పీకర్ కు లెటర్ పంపితే అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ.. ఇప్పటి వరకూ అయితే ఎలాంటి లేఖలు పంపలేదు. తాను సభలో ఏకైక ప్రతిపక్ష నాయకుడ్ననని తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకే రావడం లేదని.. తాను హైకోర్టులో పిటిషన్ వేసినా.. దానికి స్పీకర్ సమాధానం ఇవ్వడం లేదని ఆయనకు లేఖ రాసే అవకాశాలు ఉన్నాయి. దాన్నేకారణంగా చూపి తాను అసెంబ్లీకి రావడం లేదని చెప్పే అవకాశాలున్నాయంటున్నారు.
అయితే అసెంబ్లీకి హాజరు కాని కారణంగా స్పీకర్ అనర్హతా వేటు వేస్తే ఒక్క జగన్ పై కాదు.. అందరు ఎమ్మెల్యేలపై వేయాల్సి వస్తుంది. అది రాజకీయంగా సంచలనం అవుతుంది. ప్రతిపక్షం మొత్తం ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయడం దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే మొదటి సారి అవుతుంది. అలాంటి రిస్క్ టీడీపీ ప్రభుత్వం చేసే అవకాశం ఉండదని అంటున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేల్లో కొంత మందిని సభకు వచ్చేలా చేసి.. జగన్ ఒక్కరిపై అనర్హతా వేటు వేసే వ్యూహాన్ని కూడా టీడీపీ అమలు చేసే చాన్స్ ఉందంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

