అన్వేషించండి
Chilukur Temple: చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగరాజన్‌పై దుండగుల దాడి కేసు, నిందితుల అరెస్ట్
Dhadi: రామరాజ్యం స్థాపన పేరిట ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు

చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడి
Source : X
Dhadi: చిలుకూరు (Chilukuru)బాలాజీ ఆలయం అర్చకుడు సీఎస్.రంగరాజన్(Rangarrajan)పై దాడి జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రంగరాజన్ తండ్రి సౌందర్యరాజన్ మెయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆలయ పూజారిపై దాడి
వీసా బాలాజీగా పేరుగడించిన హైదరాబాద్(Hyderabad)లోని ప్రముఖ దేవాలయం చిలుకూరు బాలాజీ(Balaji) ఆలయంలోని అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆయన కన్నుకు దెబ్బతగిలింది. ఈ ఘటన ఇటీవల చోటుచేసుకోగా...ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.దుండగుల దురాఘతానికి భయపడిపోయి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయిన అర్చకుడు...ఆ తర్వాత తన తండ్రి చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ సౌందరరాజన్(Soundharrajan)తో కలిసి మెయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది.ఇలాంటి దాడులకు భయపడేది లేదని....చిలుకూరు బాలాజీ ఆలయ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఎంవీ సౌందరరాజన్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వీరరాఘవరెడ్డి పనే
ఇక్ష్వాకు వంశం వారసులుగా ప్రకటించుకుని ఓ ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకున్న వీరరాఘవరెడ్డి(Vera Raghavareddy) రామరాజ్యం ఏర్పాటు పేరిట ప్రచారం చేసుకుంటున్నాడు. శుక్రవారం ఉదయం తన సైన్యంతోపాటు మరికొందరితో కలిసి చిలుకూరు బాలాజీ ఆలయానికి వచ్చారు. ఆలయ పూజారి రంగరాజన్‌తో మాట్లాడాలంటూ పిలిచారు. రామరాజ్య స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించడంతో వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వీరరాఘవరెడ్డితోపాటు ఆయన వెంట వచ్చిన వారు దాడి చేయడంతో రంగరాజన్ కన్నుకు తీవ్ర గాయమైంది. ఇంతటితో ఆగకుండా తానేదో గొప్ప పనిచేసినట్లుగా వీరరాఘవరెడ్డి ఈ దాడి ఫొటోలు,వీడియోలు సామాజికమాద్యమాల్లో పెట్టి ప్రచారం చేసుకున్నారు. దీంతో రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ అర్చక సమాఖ్య ఆగ్రహం
చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడిని ఏపీ అర్చక సమాఖ్య తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆలయాల్లో పూజలు చేసే పూజారులపై దాడి చేయడమేంటని వారు అర్చక సమాఖ్య అధ్యక్షుడు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసుల స్వామి కోరారు.
వీసా బాలాజీ
హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల్లో చిలుకూరు బాలాజీ ఆలయం ఒకటి. వీసా బాలాజీగా పేరుగడించిన ఈ పురాతన ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తారు. వారాంతరాల్లో ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతుంటాయి. ఇక్కడ 108 సార్లు ప్రదక్షణ చేస్తే తప్పకుండా వీసా(Visa) దొరుకుతుందన్న నమ్మకంతో ..విదేశాలకు చదువుకోసం,ఉద్యోగం కోసం వెళ్లే వారే పెద్దఎత్తున ఇక్కడికి వచ్చి ఆలయం చుట్టూ 108సార్లు ప్రదక్షణ చేయడం ఆనవాయితీ. అలాగే కోర్కెలు తీరిన తర్వాత మరోసారి వచ్చి ప్రదక్షణలు చేస్తుంటారు. అందుకే ఇక్కడ దేవుడికి వీసా బాలాజీ( Visa Balaji)గా పేరు వచ్చింది. వారాంతరాల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో 108 ప్రదక్షణలకు అనుమతించడం లేదు. సమీపంలోని గండిపేట చెరువు ఉండటంతో పెద్దఎత్తున పర్యాటక ప్రేమికులు, యువతీ, యువకులు ఇక్కడికి వస్తుంటారు. అక్కడి నుంచి సమీపంలోనే ఉన్న బాలాజీని దర్శించుకుంటారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
సినిమా
తెలంగాణ





















