Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హ్యాపీ న్యూస్ -హైడ్రాకు కొత్త బాధ్యతలు
Indiramma Housing Scheme:ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక ఇవ్వాలని ఆదేశించిన సీఎం హైడ్రాకు కొత్త బాధ్యతలు అప్పగించారు. ఇసుక అక్రమాల తుక్కురేగ్గొట్టాలని సూచించారు.

Free Snd For Indiramma Housing Scheme: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారికి ఉచితంగా ఇసుకు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు.
బ్లాక్ చేస్తే బాక్స్ పగలాల్సిందే
ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎప్పుడూ ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఉపేక్షించవద్దని వారిపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. ఎక్కడెక్కడ ఇసుక రీచ్‌లు ఉన్నాయో అక్కడ తనిఖీలు చేపట్టాలన్నారు. తప్పు జరుగుతున్నట్టు అనుమానం ఉంటే వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
పూర్తి బాధ్యత కలెక్టర్స్, ఎస్పీలకు
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది ప్రసక్తే ఉండకూడదని అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చారు సీఎం. అసలు ఇసుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది.... ఏం చేస్తున్నారని ఎటు తీసుకెళ్తున్నారో పర్యవేక్షించేందుకు కూడా ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. జిల్లాలవారీగా కలెక్టర్లు, ఎస్పీలకు ఈ ఇసుకపై పూర్తి బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నారు.
Also Read: వ్యక్తిపై కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి- రంగరాజన్‌పై దాడిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
హైడ్రాకు కొత్త బాధ్యతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాకు కొత్త బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ బాధ్యతను హైడ్రాకు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై రేపటి నుంచి ఇసుక లారీలు, అక్రమ రీచ్‌లపై హైడ్రా పడే ఛాన్స్ ఉంది.
రీచ్‌ల వద్ద కెమెరాలు
ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్ఫోర్సెమెంట్ నిఘా మరింత పెంచాలని సీఎం రేవంత్ తెలిపారు. ప్రతీ ఇసుక రీచ్ వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్‌తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలి పేర్కొన్నారు.
ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు
ఇసుక బుక్ చేసిన 48 గంటల్లోగా వినియోగదారుడికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏరియాలవారీగా సమీప ఇసుక రీచ్‌ల నుంచి వినియోగదారుడికి ఇసుక చేరేలా సిస్టం ఉండాలన్న సీఎం... వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేయాలన్నారు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. నిర్ణీత ధరకు మాత్రమే ఇసుక అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించచారు.
ఇసుక రవాణా చేసే వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలన్నారు సీఎం. ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో పలు మార్పులను సూచించిన సీఎం... ఆఫీస్ టైమింగ్స్‌లో బుకింగ్ చేసుకునేలా బుకింగ్ వేళల్లో మార్పు చేయాలన్నారు. అక్రమరవాణాకు సహకరించే అధికారులపై వేటుతప్పదన్న ముఖ్యమంత్రి... ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానన్నారు. పారదర్శకంగా అక్రమాలకు తావులేకుండా పర్మినెంట్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించాలన్నారు.
Also Read: రంగరాజన్‌కు రేవంత్ ఫోన్ - దాడి రాజకీయానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సీఎం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

