By: Arun Kumar Veera | Updated at : 09 Jan 2025 12:36 PM (IST)
అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చుని చెక్ చేసుకోవచ్చు ( Image Source : Other )
Standard Glass Lining Technology IPO Allotment Status: హైదరాబాద్ కంపెనీ 'స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్' ఐపీవోకు ప్రైమరీ మార్కెట్‌లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (IPO) అన్ని వర్గాల్లోని పెట్టుబడిదార్ల నుంచి అసాధారణమైన డిమాండ్‌ను రాబట్టింది. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ IPO సబ్‌స్క్రిప్షన్ జనవరి 06న ప్రారంభమై, జనవరి 8న ముగిసింది. ఓవరాల్‌గా 183 రెట్లకు పైగా ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయింది. బిడ్డింగ్ టైమ్ ముగిసింది కాబట్టి, ఇప్పుడు, స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ IPO కేటాయింపు తేదీపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారు. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ IPO షేర్లను ఈ రోజు (09 జనవరి 2025) కేటాయిస్తారు. ఆ షేర్లు జనవరి 13న (సోమవారం నాడు) స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవుతాయని భావిస్తున్నారు.
IPO బిడ్డింగ్‌లో విజయవంతమైన పెట్టుబడిదారులకు, వాళ్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ అవుతాయి. IPO షేర్లు పొందలేకపోయిన ఇన్వెస్టర్లకు డబ్బులు రిఫండ్ అవుతాయి.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ IPO షేర్ల కేటాయింపు స్థితిని (అలాట్‌మెంట్ స్టేటస్) BSE, NSE వెబ్‌సైట్‌ల ద్వారా, లేదా, IPO రిజిస్ట్రార్ అధికారిక పోర్టల్ కేఫిన్ టెక్నాలజీస్ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ IPO అలాట్‌మెంట్ స్టేటస్‌ను BSE వెబ్‌సైట్‌లో ఇలా చెక్ చేయండి:
BSE వెబ్‌సైట్ https://www.bseindia.com/investors/appli_check.aspx ను సందర్శించండి.
'ఇష్యూ టైప్' డ్రాప్‌డౌన్ మెను నుంచి 'ఈక్విటీ'ని ఎంచుకోండి.
'ఇష్యూ నేమ్' డ్రాప్‌డౌన్ మెనులో 'స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్'ని ఎంచుకోండి.
మీ దరఖాస్తు నంబర్ లేదా PANను నమోదు చేయండి.
క్యాప్చాను ఎంటర్ చేయండి, 'ఐయాం నాట్ ఎ రోబోట్' బాక్స్‌లో టిక్ చేయండి. ఆ తర్వాత 'సెర్చ్' బటన్‌పై క్లిక్ చేయండి.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ IPO అలాట్‌మెంట్ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. మీకు IPO షేర్లు వచ్చాయో, లేదో తెలుస్తుంది.
కేఫిన్ టెక్నాలజీస్ వెబ్‌సైట్‌లో స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ IPO అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇలా చెక్ చేయండి:
IPO రిజిస్ట్రార్ వెబ్‌సైట్ https://kosmic.kfintech.com/ipostatus/ ను సందర్శించండి.
'సెలెక్ట్ IPO' డ్రాప్‌డౌన్ మెను నుంచి 'స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్'ను ఎంచుకోండి.
మీ అప్లికేషన్ నంబర్, డీమ్యాట్ అకౌంట్ నంబర్ లేదా PANను ఎంచుకోండి.
మీ ఎంపిక ఆధారంగా సంబంధిత వివరాలను నమోదు చేయండి.
క్యాప్చాను ఎంటర్ చేసి 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.
స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ IPO అలాట్‌మెంట్ స్టేటస్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఇప్పుడు 5 స్టార్ హోటల్‌లో బస పెద్ద విషయమే కాదు - ఈ క్రెడిట్ కార్డ్స్ మీ దగ్గరుంటే చాలు!
No Need For Panic Buying: పుష్కలంగా పెట్రోల్, ఎల్‌పిజి నిల్వలు- భయపడొద్దని ప్రజలకు ఇండియన్ ఆయిల్ కంపెనీ సూచన
Mutual Funds: మిమ్మల్ని కోటీశ్వరులను చేసే మ్యూచువల్ ఫండ్స్ ఇవే!
Gold Price: బంగారం ధర భారీగా తగ్గనుందా? వస్తున్న సంకేతాలు ఏంటీ?
Salary Hike Calculator: అప్రైజల్ రాకుండానే పెరిగిన జీతాలు- ఈ మ్యాజిక్ చూశారా ?
Gold Prices: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? నిజమైన కారణమేంటి?
TDP: నెలకో పథకం అమలు చేసేలా సంక్షేమ క్యాలండర్ - టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయం
Kadapa Mayor: వైఎస్ఆర్‌సీపీకి గట్టి షాక్ - కడప మేయర్‌పై అనర్హతా వేటు - కుర్చీనే వెంటాడిందా ?
Kohli Retirement Reasons!: ఆ కారణంతోనే కోహ్లీ టెస్టులకు సడెన్ రిటైర్మెంట్ ఇచ్చాడా..? విరాట్ నిర్ణయాన్ని తిరస్కరించిన బోర్డు..!!
Brahmos: బ్రహ్మోస్ దెబ్బకు పాకిస్తాన్ కకావికలం - బ్రహ్మాస్త్రాన్ని తమకూ ఇవ్వాలని వెంట పడుతున్న దేశాలు