అన్వేషించండి

Kadapa Mayor: వైఎస్ఆర్‌సీపీకి గట్టి షాక్ - కడప మేయర్‌పై అనర్హతా వేటు - కుర్చీనే వెంటాడిందా ?

Mayor Suresh Babu: కడప మేయర్ ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలో ఉండి నిబంధనలకు విరుద్ధంగా కుటుంబసభ్యులకు కాంట్రాక్టులు ఇచ్చినట్లుగా తేలడంతో ఆయనను పదవి నుంచి తొలగించారు.

Kadapa Mayor Suresh Babu Remove: కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కె. సురేష్ బాబు ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  కె. సురేష్ బాబు 2021లో కడప మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. సురేష్ బాబు తన సన్నిహిత బంధువులు నడుపుతున్న  *వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం, 1955  లోని నిబంధనలను ఉల్లంఘనగా నిరూపణ అయింది.  

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి  ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు కుటుంబ సభ్యుల సంస్థకు కాంట్రాక్టులు కేటాయించడం ద్వారా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.   కడప మున్సిపల్ కమిషనర్  వర్ధిని కన్స్ట్రక్షన్స్‌కు కాంట్రాక్టుల కేటాయింపుపై విచారణ చేశారు.  సురేష్ బాబుకు నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  మరో షోకాజ్ నోటీసు జారీ చేసింది.  విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్వహించిన విచారణ నివేదిక ఆధారంగా  కాంట్రాక్టులలో అక్రమాలు జరిగాయని నిర్దారించారు.   
 
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై సురేష్ బాబు  హైకోర్టుకు వెళ్లారు.  సురేష్ బాబు తన తరఫు న్యాయవాది  ఎన్నికైన తర్వాత అనర్హత కోసం సెక్షన్ 23-D కింద జిల్లా కోర్టుకు రిఫర్ చేయాలని వాదించారు.  సెక్షన్ 679-B కింద షోకాజ్ నోటీసు జారీ చేయడం అధికార పరిధి లేనిదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వాదనను తిరస్కరించింది, సెక్షన్ 679-B కింద రాష్ట్ర ప్రభుత్వానికి మేయర్‌ను తొలగించే అధికారం స్వతంత్రంగా ఉందని స్పష్టం చేసింది.   సురేష్ బాబును 15 రోజుల్లో వివరణ సమర్పించాలని ఆదేశించింది. గడువు ముగిసిన తర్వాత విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా, సురేష్ బాబు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించిన ప్రభుత్వం, అతన్ని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడం వల్లనే కుర్చీ పోగొట్టుకున్నారా ?

అయితే మేయర్ ను పదవి నుంచి తొలగించడాన్ని వైసీపీ తప్పు పట్టింది. కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ వేయలేదన్న కోపంతోనే ...మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తప్పించారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కడప ఎమ్మెల్యేకు కౌన్సిల్ సమావేశాల్లో.. మేయర్ పక్కనే సీటు వేసేవారు.అయితే ఈ సారి కడప నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి గెలిచారు. కడప కార్పొరేషన్ లో మొత్తం .. వైసీపీసభ్యులే ఉన్నారు. కొంత మంది పార్టీ ఫిరాయించారు. అయినా బలం వారిదే. అధికార పార్టీ ఎమ్మెల్యేకు  కౌన్సిల్ లో కుర్చి వేసేది లేదని మేయర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై దుమారం రేగింది. చివరికి ఎమ్మెల్యే...  మేయర్ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం.. విచారణ జరిపి పదవి నుంచి తీసేయడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ వైసీపీ నుంచే మేయర్ ను ఎన్నుకునే అవకాశం ఉంది.  ఇప్పటికి కడప కార్పొరేటర్లలో ఎక్కువ మంది వైసీపీ వారే.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Konaseema Cyclone Arnab Loss: ఆర్నాబ్ తుఫాన్ బీభత్సం - ఏపీకి రూ. 4,600 కోట్ల నష్టం.. కోనసీమలో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన
ఆర్నాబ్ తుఫాన్ బీభత్సం - ఏపీకి రూ. 4,600 కోట్ల నష్టం.. కోనసీమలో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన
CM Chandrababu Aerial Survey: ‘అర్నబ్’ తుపాన్ ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే.. నష్టపోయిన వరిచేలు, అరటి, కొబ్బరి తోటలు పరిశీలిన
‘అర్నబ్’ తుపాన్ ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరవు.. సాగునీటి నిర్వహణలో చంద్రబాబు భేష్ - కేటీఆర్
AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - 48 ప్రతిపాదనలకు ఆమోదం.. తుపాను బాధితులకు భరోసా!
Hyderabad Ration Rice Scam: హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
హైదరాబాద్‌లో రేషన్ బియ్యం స్కామ్ గుట్టురట్టు.. రీసైక్లింగ్ చేసి బ్రాండెడ్ పేరుతో విక్రయం
Andaman Sea Low Pressure: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం - నవంబర్ 1, 2న భారీ వర్షాలు - తుఫాన్ ముప్పు?
AP Cyclone Arnab Relief: తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
తుఫాన్ విధ్వంసం - వేగంగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ - బాధితులకు సత్వర సాయంపై సీఎం కీలక ఆదేశాలు!
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
Karnataka MLC Election Results 2026: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం - అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా?
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Embed widget