YSRCP MLC Resigns: వైసీపీకి మరో బిగ్ షాక్, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానం రాజీనామా
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియ ఖానం వైసీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

MLC Zakia Khanam resigned to YSRCP | అమరావతి: వైఎస్ఆర్ సీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో ఇదివరకే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు ఇదివరకే పార్టీని వీడారు. తాజాగా వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం వైఎస్ఆర్సిపి కి రాజీనామా చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పదవికి సైతం ఆమె రాజీనామా చేశారు, ఈ మేరకు మండలి చైర్మన్ కు లేఖ సైతం రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా తన రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు ఆమె పంపినట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో 2020 జూలైలో ఎమ్మెల్సీగా జాతీయ ప్రాణం ను గవర్నర్ నామినేట్ చేశారని తెలిసింది.
రాయలసీమలోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన జకియాఖానం గత కొంతకాలం నుంచి వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. ఇదివరకే ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, జయ మంగళ వెంకటరమణ రాజీనామా చేశారు. తాజాగా జకియా ఖానం సైతం రిజైన్ చేయడంతో రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్య ఆరుకు చేరింది.






















