Vizag Beach Erosion: విశాఖ సాగరతీరంపై 'అక్వాన్' తుపాను పంజా.. ఎగసిపడుతున్న రాకాసి అలలు.. కోతకు గురైన ఆర్కే బీచ్
Vizag Beach Erosion: అక్వాన్ తుపాను ప్రభావంతో విశాఖ ఆర్కే బీచ్ లో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. అలలు దాటికి తీర ప్రాంతంలో ఇసుక, మట్టి కోతకు గురవుతున్నాయని.

Vizag Beach Erosion: ‘అక్వాన్’ తుపాను ప్రభావంతో విశాఖపట్నం సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో తీర ప్రాంత ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా విశాఖ బీచ్ రోడ్డులోని సన్‌రైజ్ పోలీస్ గెస్ట్‌హౌస్ ఎదురుగా సముద్రం రాకాసి అలలతో విరుచుకుపడుతోంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు నేరుగా తీర రక్షణ గోడను బలంగా తాకుతుండటంతో బీచ్ రోడ్డు పరిసరాల్లో భయాందోళన నెలకొంది.
అలల ధాటికి కోతకు గురైన తీరం
సముద్రం నుంచి దూసుకొస్తున్న భారీ అలల తాకిడికి తీరానికి ఆనుకుని ఉన్న ఇసుక, మట్టి ప్రాంతం కోతకు గురై సముద్రంలోకి కొట్టుకుపోయింది. పలు చోట్ల భూమి కోతకు గురై కిందకు జారిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో విశాలంగా ఉన్న ఇసుక తిన్నెల విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయి, అడుగున ఉన్న బండరాళ్లు బయటపడుతున్నాయి. అంతేకాకుండా, సాధారణంగా తెల్లగా మెరిసే తీరపు ఇసుకంతా నల్లగా మారిపోయింది. ఒడ్డున ఉన్న ఎర్రమట్టి అలల ధాటికి సముద్రంలో కలవడంతో తీర ప్రాంతంలోని సముద్రపు నీరు ఎరుపు రంగులోకి మారింది. అలల తీవ్రత ఇలాగే కొనసాగితే తీర ప్రాంతం మరింతగా కోతకు గురయ్యే ప్రమాదం ఉందని పర్యాటకులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ప్రమాదకరంగా బీచ్ రోడ్డు
భారీ అలలు, తీవ్రమైన గాలుల ధాటికి తీరంలో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, అలంకరణ దీపాలు, లైటింగ్ పరికరాలు నేలకొరిగాయి. నిత్యం పర్యాటకులు, స్థానికులు వాకింగ్, టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు కిందపడటం అత్యంత ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడను తాకుతూ అలలు రోడ్డుపైకి ఎగసిపడుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















