By: Khagesh | Updated at : 01 May 2025 09:50 PM (IST)
అప్రైజల్ రాకుండానే పెరిగిన జీతాలు- ఈ మ్యాజిక్ గురించి తెలుసా? ( Image Source : Other )
Salary Hike Calculator: ఏప్రిల్ నెల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. ఏప్రిల్ నెల జీతాలు ఖాతాల్లో పడ్డాయి. కానీ చాలా మంది ఓ విషయంలో ఆశ్చర్యపోతున్నారు, ఎందుకంటే అప్రైజల్ లేకుండా వారి ఖాతాల్లో పెరిగిన జీతం వచ్చి పడింది. ఇంకా ఆఫీసులో అప్రైజల్ ప్రక్రియ పూర్తి కావడానికి సమయం పడుతుంది. అలాంటి సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఉద్యోగులు అందరి ఖాతాల్లో ఎక్కవ జీతం ఎలా పడింది?
ఉదాహరణకు సాగర్ ఏప్రిల్ నెలలో వచ్చిన జీతం అధికంగా పడింది. దీన్ని చూసిన సాగర్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆదాయపు పన్ను కారణంగా సాగర్ ఖాతాలో ప్రతి నెలా జీతం తగ్గించి వచ్చేది. ఆ తర్వాత సాగర్ సిఏ వద్దకు వెళ్లి తన ఐటీ రిటర్న్ ఫైల్ చేయించుకున్నాడు. ఆ తర్వాత కట్ అయిన జీతంలో కొంత భాగం తిరిగి వచ్చింది.
అప్రైజల్ లేకుండా పెరిగిన డబ్బు
ఫిబ్రవరిలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను పరిధిని పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన ఆదాయపు పన్నులోని మినహాయింపు కారణంగా ఇప్పుడు చాలా మంది జీతాలు పెరిగాయి. ఇప్పుడు 12 లక్షల 75 వేల వరకు జీతంపై ఎలాంటి పన్ను లేదు. ఐటీ కట్ అయ్యే పరిస్థితి లేనందున పూర్తి జీతం అందుకుంటున్నారు ఉద్యోగులు.
అలాంటి సందర్భంలో సాగర్ సీటీసీ 12 లక్షల 50 వేలు రూపాయలు. అతను ఇప్పుడు ఏప్రిల్ నెల నుంచి ఎటువంటి పొదుపులు చూపించాల్సిన అవసరం లేదు. పన్నులు ఆదా చేయడానికి ముందులాగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఇంటి అద్దె స్లిప్, పిల్లల పాఠశాల ఫీజు, ఇతర రకాల ఖర్చులు, ఇలా విషయాల గురించి ముందుగానే ఆఫీసుకు వివరాలు ఇవ్వవలసి ఉండేది.
ప్రభుత్వం ఇప్పుడు 12 లక్షల రూపాయల వరకు మినహాయింపు ఇచ్చింది. అదనంగా 75 వేల రూపాయల ప్రామాణిక తగ్గింపు ఉంది. ఈ సందర్భంలో వార్షిక ఆదాయం 12 లక్షల 75 వేల రూపాయల వరకు ఉన్నవారి డబ్బు కట్ కాదు.
సీటీసీ అంటే ఏమిటి?
ఏప్రిల్ 1 నుంచి పన్నులకు సంబంధించిన అనేక నిబంధనలు మారాయి. ఆ తర్వాత కొత్త పన్ను పద్ధతిలో చేసిన ప్రామాణిక తగ్గింపు, పన్ను స్లాబ్, ఇతర రకాల మార్పులు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పుడు, అంటే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అలాంటి సందర్భంలో ఈ లెక్క ప్రకారం సాగర్ లాంటి ఇతర వ్యక్తులు కొత్త పన్ను పద్ధతిని ఎంచుకుంటే, వారికి కనీసం 5150 నుంచి 9,150 రూపాయల వరకు చేతిలో జీతం పెరిగింది.
ఇప్పుడు సీటీసీ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం? CTC అంటే కంపెనీ టు కాస్ట్, అంటే కంపెనీ తన ఉద్యోగులపై సంవత్సరంలో ఖర్చు చేసే డబ్బును సీటీసీ అంటారు. ఇందులో బేసిక్ శాలరీ నుంచి HRA, ఇతర భత్యాలు ఉంటాయి. ఇందులో కంపెనీ తరపున PF లేదా EPF గా జమ చేసిన డబ్బు కూడా ఉంటుంది. అంటే సీటీసీ ద్వారా ఉద్యోగుల అసలు జీతాన్ని లెక్కిస్తారు. టేక్‌హోం అంటే నెల చివరిలో మీ ఖాతాలోకి వచ్చేది.
Small Business Ideas : గ్రామాల్లోనే ఉంటూ అధిక ఆదాయం.. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన 7 బిజినెస్ ఐడియాలు
Silver Prices : మొదటిసారిగా 3 లక్షలు దాటిన వెండి! ఇప్పుడు 1 కిలో ధర ఎంత ఉందో తెలుసుకోండి?
SBI ATM Transaction Fees:ఎస్‌బిఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్! ఏటీఎం విత్‌డ్రా ఫీజులు పెంపు! బ్యాలెన్స్ చెక్ చేసినా వాతే!
Aadhaar Card: ఆధార్ కార్డు ఉన్నవారికి 90 వేల రూపాయలు ఇస్తుంది; ఎలాగో తెలుసుకోండి?
Best Business Plan: గ్రామంలో పిండి మరను ఎలా తెరవవచ్చు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది?
BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రమాణ స్వీకారానికి ముందు సందర్శించిన ఆలయాలు ఇవి! వీటి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి
IBPS RRB Clerk Result 2025: ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ క్లర్క్ ప్రిలిమ్స్ 2025 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Movie Ticket Rates : సినిమా టికెట్ ధరల పెంపు - తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Adilabad Waterfalls: ఆదిలాబాద్ జిల్లాలోని ఖండాల జలపాతానికి గుర్తింపు, 100 వీకెండ్ వండర్స్ పోటీలో బహుమతి