By: Arun Kumar Veera | Updated at : 06 Feb 2025 12:28 PM (IST)
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269SS, సెక్షన్ 269T ( Image Source : Other )
IT Notices Under Section 269SS & Section 269T: చాలా కుటుంబాల్లో, భర్తకు నెల జీతం రాగానే, ఇంటి ఖర్చులు & ఇతత చిన్నపాటి అవసరాల కోసం భార్య చేతికి డబ్బులు ఇస్తుంటారు. ఇలా ఇచ్చే డబ్బు పరిధికి మించితే మీకు ఆదాయ పన్ను విభాగం నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇంటి ఖర్చులకు ఇచ్చే డబ్బు విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు పాటించుకుంటే చిక్కుల్లో పడతారు.
ఇంటి ఖర్చుల నిమిత్తం ఇచ్చే డబ్బును ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ లేదా చెక్ లేదా డ్రాఫ్ట్ వంటి రూపాల్లో భార్య అకౌంట్‌కు పంపడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. డిజిటల్ మోడ్‌లో చెల్లింపు జరుగుతుంది కాబట్టి ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది, ఏ ఇబ్బందీ రాదు. కానీ.. డబ్బు చేతికి ఇవ్వడమే చిక్కులు తెస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269SS, సెక్షన్ 269T ప్రకారం, ఒక స్థాయి దాటిన నగదు లావాదేవీలు పన్ను పరిధిలోకి వస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరం. రూ. 20,000 కంటే ఎక్కువ నగదు బదిలీ చేయకుండా ఉండటం ఉత్తమం. రూ. 20,000 కంటే ఎక్కువ మొత్తాలు పంపించాల్సి వస్తే RTGS, NEFT లేదా బ్యాంక్ చెక్ వంటివి ఉపయోగించాలి.
సెక్షన్ 269SS అంటే ఏంటి?
సెక్షన్ 269SS ప్రకారం.. అకౌంట్ పేయీ చెక్ లేదా అకౌంట్ పేయీ బ్యాంక్ డ్రాఫ్ట్ లేదా బ్యాంక్ అకౌంట్ ద్వారా లేదా ఇతర నిర్దిష్ట పద్ధతిలో ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ వాడకం ద్వారానే మరొక వ్యక్తి నుంచి క్యాష్ అడ్వాన్స్ లేదా రుణం లేదా డిపాజిట్ లేదా ఏదైనా ఇతర మొత్తాన్ని అంగీకరించకూడదు. సింపుల్‌గా చెప్పాలంటే.. రూ. 20,000 కంటే ఎక్కువ మొత్తాన్ని క్యాష్ అడ్వాన్స్ లేదా రుణం లేదా డిపాజిట్ రూపంలో స్వీకరించడం నిషేధం. రూ. 20,000 దాటిన ప్రతి నగదు స్వీకరణ డిజిటల్ మోడ్‌లోనే జరగాలి.
సెక్షన్ 269SS ఉల్లంఘనకు జరిమానా
రుణం లేదా డిపాజిట్ లేదా చెల్లించిన మొత్తంపై 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే, ఏదైనా లావాదేవీకి సమంజసమైన కారణం ఉందని & పన్ను ఎగ్గొట్టాలన్న దురుద్దేశం లేదని ఆ వ్యక్తి నిరూపించగలిగితే, అతను/ఆమెకు జరిమానా విధించకపోవచ్చు.
సెక్షన్ 269T అంటే ఏమిటి?
ఏ వ్యక్తి అయినా రుణం లేదా డిపాజిట్ లేదా ఇతర మొత్తాన్ని అకౌంట్ పేయీ చెక్ లేదా అకౌంట్ పేయీ బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా లేదా బ్యాంక్ ఖాతా ద్వారా కాకుండా తిరిగి చెల్లించడం నిషేధం. ఈ సెక్షన్ ప్రకారం, రూ. 20,000 కంటే ఎక్కువ మొత్తాన్ని క్యాష్ అడ్వాన్స్ లేదా రుణం లేదా డిపాజిట్ రూపంలో చెల్లించకూడదు. రూ. 20,000 దాటిన ప్రతి మొత్తాన్నీ బ్యాంకింగ్ మార్గాల ద్వారా మాత్రమే చెల్లించాలి.
సెక్షన్ 269T ఉల్లంఘనకు జరిమానా
రుణం లేదా డిపాజిట్ లేదా స్వీకరించిన మొత్తంపై 100% వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా, డబ్బు స్వీకరణలో ఎలాంటి దురుద్దేశం లేదని నిరూపించగలిగితే, అతను/ఆమెకు జరిమానా నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
సెక్షన్ 269SS, సెక్షన్ 269T కింద మినహాయింపులు
ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లేదా కేంద్ర, రాష్ట్ర కార్పొరేషన్ల నుంచి స్వీకరించే డబ్బు రూ.20,000 దాటినా సెక్షన్ 269SS, సెక్షన్ 269T నుంచి మినహాయింపులు ఉంటాయి.
సాధారణంగా, ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన డబ్బుకు ఐటీ నోటీస్ రాదు. అయినప్పటికీ, పరిమితి దాటకుండా ఉండడం మంచిది.
మీరు మీ భార్యకు ఇంటి ఖర్చులకు కాకుండా ఇతర పొదుపుల కోసం నగదును గిఫ్ట్‌గా ఇస్తే ఐటీ నోటీస్ రాకుండా చూసుకోవచ్చు.
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269SS & సెక్షన్ 269Tను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. నగదు లావాదేవీలు నియంత్రించి, నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ సెక్షన్లను తీసుకొచ్చారు.
మరో ఆసక్తికర కథనం: EMI భారం నుంచి ఉపశమనం, వడ్డీ రేట్లు తగ్గొచ్చు - హింట్ ఇచ్చిన ఆర్థిక మంత్రి
Plane Ticket Offer: విమాన ప్రయాణంపై బంపర్ ఆఫర్ - కేవలం 11 రూపాయలకే ఫ్లైట్ టికెట్
Tata Capital IPO: టాటా క్యాపిటల్ IPOకి లైన్ క్లియర్ - ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే?
House Prices In Hyderabad: హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు - దేశ రాజధానితో పోలిస్తే భాగ్యనగరం చాలా బెటర్
Gold-Silver Prices Today 26 Feb: ఊపిరి పీల్చుకోండి, తగ్గిన గోల్డ్-సిల్వర్ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ELI Scheme Update: EPFO మెంబర్లకు భారీ శుభవార్త - ఉద్యోగులకు మరో నెల టైమ్ ఇచ్చిన సర్కారు
MLC Elections 2025:ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం-సాయంత్రం 4 వరకు పోలింగ్
Posani Krishna Murali Arrest: సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం
Telangana schools Holiday: ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్..తెలంగాణలో పాఠశాలలకు ఇవాళ సెలవు
MLC Election Voting Procedure : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి? ఈ జాగ్రత్తలు పాటించకుంటే నష్టమే!
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy