అన్వేషించండి

Special Buses for Sankranti : సంక్రాంతికి 6,432 స్పెషల్ బస్సులు - మహిళలకు ఫ్రీ జర్నీపై టీజీఎస్ఆర్టీసీ కీలక ప్రకటన

Special Buses for Sankranti : సంక్రాంతిని పురస్కరించుకుని టీజీఎస్ఆర్టీసీ మొత్తం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. టిక్కెట్ ధరల్లోనూ సవరణలు చేసింది.

Special Buses for Sankranti : సంక్రాంతి సమీపిస్తుండడంతో విద్యార్థులు, ఉద్యోగులు సొంతూళ్లకు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - టీజీఎస్ఆర్టీసీ సైతం పండుగను పురస్కరించుకుని స్పెషల్ బస్సులు నడపనుంది. సొంతూళ్లకు క్షేమంగా వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సంక్రాంతి పండుగకు రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ మొత్తం 6,432 ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది. జనవరి 10, 11, 12 తేదీల్లో ప్రయాణీకులు ఎక్కువ జర్నీ చేసే అవకాశమున్నందున.. ఈ రోజుల్లో ఎక్కువ బస్సులను నడపనుంది. పండుగ తర్వాత 19, 20 తేదీల్లోనూ తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ఏర్పాట్లు చేసింది.

హైదరాబాద్ లో ఈ ఏరియాల నుంచి ప్రారంభం కానున్న బస్సులు

తెలంగాణకు సెంటర్ పాయింట్ హైదరాబాద్. చాలా మంది చదువుకునేందుకైనా, ఉద్యోగం కోసమైనా వచ్చేది హైదరాబాద్ కే. కాబట్టి ఇక్కడ్నుంచి ఎక్కువ మొత్తంలో బస్సులు నడిపేలా టీజీఎస్ఆర్టీసీ ప్లాన్ చేసింది. అందులో భాగంగా కేపీహెచ్బీ, గచ్చిబౌలి, జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్ లాంటి పలు ముఖ్య ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణీకులు ఇబ్బందులు కలగకుండా పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ ను అందుబాటులో ఉంచింది.

సంక్రాంతి పండుగకు టిక్కెట్ల ధరల్లో మార్పులు

పండుగలకు నడిపే ప్రత్యేక బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం టిక్కెట్ ధరలను పెంచనున్నారు. ఈ ధరలు ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు 19, 20 తేదీల్లో అమల్లో ఉండనున్నాయి. స్పెషల్ బస్సులు మినహాయిస్తే రెగ్యులర్ బస్సుల్లో మాత్రం సాధారణ ఛార్జీలే ఉంటాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్ని మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చని తెలిపింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం వెబ్ సైట్ www.rgsrtcbus.in లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పింది.

టిక్కెట్ల పెంపుకు జీవో

స్పెషల్ బస్సులకయ్యే డీజిల్ ఖర్చులు, నిర్వహణ కోసం టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో నడిపే బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టిక్కెట్ ధరలను పెంచే వెసులుబాటును ఆర్టీకి ఇచ్చింది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం కేవలం 5 రోజులే టిక్కెట్ ధరలను పెంచినట్టు టీజీఆర్టీసీ స్పష్టం చేసింది.

ఏపీలో సంక్రాంతికి 7,200 ప్రత్యేక బస్సులు

తెలంగాణలో మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ లోనూ సంక్రాంతికి కొత్త బస్సులు నడపనున్నారు. మొత్తం 7,200 ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ బస్సుల్లో ఛార్జీలను ఎప్పటిలాగే వసూలు చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. సాధారణ బస్సుల్లో ఉండే ఛార్జీలే ఈ బస్సుల్లో ఉంటాయని తెలిపింది.

Also Read : Train Ticket Rules: రైళ్లలో పిల్లలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు!, తొందరపడి టిక్కెట్‌ కొనకండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్, 16 మంది మావోయిస్టులు మృతి, ఇద్దరు జవాన్లకు గాయాలు
TDP Foundation Day: తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా, పీకపై కత్తిపెట్టినా ‘జై తెలుగుదేశం’ నినాదం: చంద్రబాబు
Rashmika: ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
ఆ డిజాస్టర్ నుంచి రష్మిక ఎస్కేప్... పాపం మరో హీరోయిన్ బలి... నేషనల్‌ క్రష్‌కు ముందే తెలిసిందా?
Telangana News: రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
రేషన్ కార్డులు లేని వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త, ఉగాది నుంచి కొత్త స్కీమ్ ప్రారంభం
MS Dhoni Trolling:  కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
కెరీర్లో ఇదే లో పాయింట్.. 9వ స్థానంలో బ్యాటింగ్ ఏంది తలా..? రిటైర‌యిపో.. ధోనీపై భ‌గ్గుమ‌న్న ఫ్యాన్స్ 
SBI clerk prelims Results 2025: ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
ఎస్‌బీఐ క్లర్క్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల- డైరెక్ట్ లింక్ ఇదే
Mad Square Day 1 Collections: తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టిన కుర్రాళ్ళు... 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
Myanmar Earthquake Death Toll: మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
మయన్మార్, థాయ్‌లాండ్‌లలో భూకంపాలు, 700 దాటిన మృతుల సంఖ్య- శిథిలాల కింద ఎందరో
Embed widget