అన్వేషించండి

Mudragada: చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి

ముద్రగడ్డ పద్మనాభరెడ్డి అలియాస్ పద్మనాభం  మరో ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాత స్నేహాన్ని గుర్తుచేశారు. అప్పటిలా ఉందామని ప్రపోజల్ పెట్టారు.

ఒకప్పటి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. ఇప్పటి పద్మనాభరెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో లెటర్ రాశారు. అప్పుడప్పుడు ఉత్తరాల ద్వారా తన ఆవేదనను.. ఆవేశాన్ని, హెచ్చరికలను తెలిపే ఆయన ఈసారి చంద్రబాబుకు ఓ ప్రపోజల్ పెట్టారు. పార్టీలు వేరైనా పాతరోజుల్లాగా కలిసి ఉందామని హుందాగా రాజకీయాలు చేద్దామని ప్రతిపాదించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు రాజకీయాలు హుందాగా నడిపారని ఇప్పటిలా వ్యక్తిగత దాడులకు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడలేదన్నారు. మళ్లీ అప్పటి రాజకీయాలు చేయాలని సూచించారు.

నేనూ మీ మిత్రుడినే

చంద్రబాబు గురువారం కిర్లంపూడి నుంచి  తాజాగా లేఖ పంపిన ముద్రగడ తనని తాను చంద్రబాబుకు పాత మిత్రుడనని పరిచయం చేసుకున్నారు. 1999 నుంచి ఐదేళ్ల పాటు చంద్రబాబుతో కలిసి పనిచేశానని అందుకే పాత మిత్రుడంటున్నానని చెప్పుకున్నారు. అప్పట్లో చంద్రబాబు ధోరణి ఇలా ఉండేది కాదని.. రెడ్ బుక్ రాజ్యాంగం అప్పట్లో అమల్లో లేదని .. పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించలేదనీ చెప్పారు. ఇప్పడు రెడ్ బుక్ పేరుతో ప్రతీ నిమిషం కేసులు పెట్టి వేధించే కార్యక్రమం తీసుకోవడం తనకు బాధగా ఉందన్నారు.  “మీ కుమారుడు లోకేష్ చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని” చంద్రబాబుకు సలహా ఇచ్చారు.

జగన్ వస్తారు.. విశ్వరూపం చూపిస్తారు.

అమావాస్య తర్వాత పౌర్ణమి.. పౌర్ణమి తర్వాత అమావాస్య ఎలా వస్తాయో అలాగే జగన్ కూడా అధికారంలోకి రావడం ఖాయమని.. ఇప్పుడు చేస్తున్న దానికి ప్రతీకారంగా ఆయన కూడా ఇలాగే నడుచుకుని విశ్వరూపం చూపిస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రశాంతంగా ఉన్నా.. దెబ్బతిన్న వారు ఊరుకోరని వాళ్లు కసి, కక్ష తీర్చుకునేందుకు జగన్ పై ఒత్తిడి చేస్తారని కాబట్టి జరిగే ప్రమాదాన్ని గుర్తించి సంయమనం పాటించాలని సూచించారు.

వైఎస్సార్, తాను, చంద్రబాబు ఒకేసారి రాజకీయాల్లోకి ప్రవేశించామన్న  ముద్రగడ అప్పటి స్నేహాలు ఎంతుబాగుండేవో అని గుర్తు చేసుకున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget