Sunrisers Hyderabad Squad: సన్‌రైజర్స్ పూర్తి జట్టు ఇదే, అత్యధిక రేటు ఎవరికంటే?
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే.. రిటైన్ చేసుకున్న వారిలో కేన్ విలియమ్సన్, వేలంలో కొనుగోలు చేసిన వారిలో నికోలస్ పూరన్ అత్యధిక మొత్తం పొందారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మెగావేలంలో మొత్తంగా 20 మందిని కొనుగోలు చేసింది. అంతకు ముందే కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్‌లను రిటైన్ చేసుకుంది. దీంతో మొత్తంగా సన్‌రైజర్స్ స్క్వాడ్ 23 మందికి చేరింది. వేలానికి ముందు రూ.14 కోట్లు చెల్లించి కేన్ విలియమ్సన్‌ను రిటైన్ చేసుకోగా... వేలంలో నికోలస్ పూరన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది సన్‌రైజర్స్ వేలంలో చేసిన అత్యధిక బిడ్డింగ్.
మొదటిరోజు టి. నటరాజన్, వాషింగ్టన్ సుందర్, జగదీష సుచిత్, నికోలస్ పూరన్, భువనేశ్వర్ కుమార్, ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ, కార్తీక్ త్యాగి, రాహుల్ త్రిపాఠి, శ్రేయస్ గోపాల్‌లను రైజర్స్ మేనేజ్‌మెంట్ కొనుగోలు చేసింది. ఇక రెండో రోజు ఎయిడెన్ మార్క్రమ్, మార్కో జాన్సెన్, రొమారియో షెపర్డ్, షాన్ అబాట్, ఆర్.సమర్థ్, శశాంక్ సింగ్, సౌరబ్ దూబే, విషు వినోద్, గ్లెన్ ఫిలిప్స్, ఫరూకీలను కొనుగోలు చేశారు.
రెండో రోజు మొదట్లోనే ఎయిడెన్ మార్క్రమ్‌ను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. మంచి బ్యాటింగ్ లైనప్ కోసం రూ.8.5 కోట్లతో రాహుల్ త్రిపాఠిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత గ్లెన్ ఫిలిప్స్‌ను రూ.1.5 కోట్లతో కొనుగోలు చేశారు. ఆ తర్వాత ప్రియం గర్గ్‌ను కూడా కొనుగోలు చేశారు. తనకు భవిష్యత్తులో కెప్టెన్సీ రోల్ దక్కే అవకాశం కూడా ఉంది.
భువనేశ్వర్ కుమార్‌ను కూడా రూ.4.2 కోట్లతో కొనుగోలు చేశారు. పేస్ దళంలో భువీతో పాటు టి.నటరాజన్ (రూ.4 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు) కూడా ఉన్నారు. జగదీష సుచిత్ (రూ.20 లక్షలు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు)లు కూడా జట్టులో చేరారు.
ఇక ఆల్‌రౌండర్లలో రూ.8.75 కోట్లతో వాషింగ్టన్ సుందర్‌ను కొనుగోలు చేశారు. ఇక అభిషేక్ శర్మను కూడా రూ.6.5 కోట్లతో దక్కించుకున్నారు. ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెపర్డ్‌ను రూ.7.75 కోట్లతో, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షాన్ అబాట్‌ను రూ.2.4 కోట్లకు కొనుగోలు చేశారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు
కేన్ విలియమ్సన్ (రూ.14 కోట్లు), అబ్దుల్ సమద్ (రూ.4 కోట్లు), ఉమ్రన్ మాలిక్ (రూ.4 కోట్లు), వాషింగ్టన్ సుందర్ (రూ.8.75 కోట్లు), రాహుల్ త్రిపాఠి (రూ.8.5 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.6.5 కోట్లు), కార్తీక్ త్యాగి (రూ.4 కోట్లు), శ్రేయస్ గోపాల్ (రూ.75 లక్షలు), జగదీష సుచిత్ (రూ.20 లక్షలు), ఎయిడెన్ మార్క్రమ్ (రూ.2.6 కోట్లు), మార్కో జాన్సెన్ (రూ.4.2 కోట్లు), రొమారియో షెపర్డ్ (రూ.7.75 కోట్లు), షాన్ అబాట్ (రూ.2.4 కోట్లు), ఆర్.సమర్థ్ (రూ.20 లక్షలు), శశాంక్ సింగ్ (రూ.20 లక్షలు), సౌరబ్ దూబే (రూ.20 లక్షలు), విష్ణు వినోద్ (రూ.50 లక్షలు), గ్లెన్ ఫిలిప్స్ (రూ.1.5 కోట్లు), ఫజల్‌హక్ ఫరూకీ (రూ.50 లక్షలు)