Sookshmadarshini OTT Release Date: పక్కింట్లోకి తొంగిచూసే హీరోయిన్... మంట పెట్టిన పరాయి మగాడు... ఈ వారమే ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్
Sookshmadarshini OTT Platform: 'అంటే సుందరానికి'తో తెలుగు పరిశ్రమకు పరిచయమైన మలయాళ హీరోయిన్, 'పుష్ప' విలన్ ఫహద్ ఫజల్ భార్య నజ్రియా నజీమ్ నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా ఈ వారమే ఓటీటీలో విడుదల కానుంది.
నజ్రియా నజీమ్ (Nazriya Nazim) మలయాళ హీరోయిన్. అయితే ఈవిడ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నాచురల్ స్టార్ నాని సరసన 'అంటే సుందరానికి' సినిమాలో నటించింది. తమిళ డబ్బింగ్ 'రాజా రాణి' కూడా తెలుగులో మంచి విజయం సాధించింది. 'పుష్ప' సినిమాలో విలన్ బన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నజ్రియా భర్త ఫహాద్ ఫాజిల్ నటించిన సంగతి తెలిసిందే. ఆవిడ నటించిన లేటెస్ట్ మలయాళ సినిమా 'సూక్ష్మ దర్శిని'. ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
జనవరి 11వ తేదీ నుంచి ఓటీటీలోకి!
Sookshmadarshini OTT Streaming Date: నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రలో రూపొందిన మలయాళ సినిమా 'సూక్ష్మ దర్శిని'. ఇందులో బసిల్ జోసఫ్ హీరో (Basil Joseph). దర్శకుడిగా 'మిన్నల్ మురళి' వంటి విజయంతో పాటు మలయాళ డబ్బింగ్ సినిమాలు 'జయ జయ జయ జయ హే'తో కథానాయకుడిగానూ తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.
బసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన 'సూక్ష్మ దర్శిని' గత ఏడాది నవంబర్ 22న మలయాళంలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేశారు. ఐదు భాషలలో ఈ నెల 11న అంటే శనివారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
View this post on Instagram
'సూక్ష్మ దర్శిని' కథ ఏమిటి? నజ్రియా రోల్ ఏమిటి?
'సూక్ష్మ దర్శిని' సినిమాలో ఒక సాధారణ గృహిణి పాత్రలో నజ్రియా నజీమ్ నటించారు. ఆవిడ క్యారెక్టర్ పేరు ప్రియదర్శిని. ఆమె ఒక కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ పూర్తి అవుతుంది. రెండో రౌండ్ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో... నజ్రియా పక్కింట్లోకి తల్లితో పాటు బసిల్ జోసెఫ్ దిగుతాడు. అతని క్యారెక్టర్ పేరు మాన్యువల్.
మాన్యువల్ ప్రవర్తన పట్ల ప్రియదర్శిని అనుమానం వ్యక్తం చేస్తుంది. పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తుంది. ప్రియదర్శిని పెళ్లి రోజున వాళ్ళ ఇంటికి వచ్చిన మాన్యువల్ కావాలని ఐరన్ బాక్స్ ద్వారా ఫైర్ అయ్యేలా చేస్తాడు. ఇంట్లో మంట పెడతాడు. ఆ సమయంలోనే మాన్యువల్ తల్లి కనిపించకుండా పోతుంది. ఆవిడ రైల్వే స్టేషన్‌లో దొరుకుతుంది. తన తల్లికి అల్జీమర్స్ ఉందని మాన్యువల్ చెబుతాడు. అయితే ప్రతి రోజూ తన పనులు తాను చేసుకునే ఆ తల్లిని చూసి ప్రియదర్శిని అనుమాన పడుతుంది. మాన్యువల్ చేసే పనులు ప్రియదర్శనిలో మరింత అనుమానం పెంచుతాయి. చివరకు ఏమైంది? అనేది సినిమా. బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమాకు ఐఎండిబిలో 8.1 రేటింగ్ వచ్చింది.
Also Read: 'ప్రేమలు' హీరో కొత్త సినిమా, సేమ్ డైరెక్టర్‌తో - ఎప్పుడు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?