Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Infosys: ఇన్‌ఫోసిస్ ఉద్యోగులు ఆఫీసుకు వస్తే డేంజర్ అంటూ ఈమెయిల్స్ అందుకున్నారు. దీనికి కారణం హెచ్‌ఎంపీవీ వైరస్ కాదు.. ఓ టైగర్.
Tiger in Infosys Campus: మైసూరులో ఇన్‌ఫోసిస్‌కు అతి పెద్ద క్యాంపస్ ఉంది. అక్కడ వేల మంది ఉద్యోగులు పని చేస్తూ ఉంటారు. వారందరికీ హటాత్తుగా ఓ మెయిల్ వచ్చింది. ఎవరూ ఆఫీసుకు రావాల్సిన పని లేదుని అందరూ వర్క్ ఫ్రం హోం చేయాలని అందులో ఆదేశాలు ఇచ్చారు. వస్తే ప్రమాదంలో పడతారని హెచ్చరించారు. రాకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించే మెయిల్స్ వచ్చాయి కానీ ఇలా .. ఆఫీసుకు వస్తే ప్రమాదంలో పడతామని హెచ్చరించే మెయిల్స్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు రావొద్దంటున్నారో తెలిసిన తర్వాత .. ఉద్యోగం తీసేస్తామని చెప్పినా సరే రాబోమని అంటున్నారు. ఎందుకంటే వారి క్యాంపస్‌లోకి పులి వచ్చింది.
ఇన్ఫోసిస్ ఆఫీస్ క్యాంపస్ లోకి పులి వచ్చినట్లుగా తెలియడంతో అందరికీ వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. ఎవరూ పొరపాటున కూడా ఆఫీసుకు రావొద్దని అర్జంట్ మెయిల్ పంపారు. ఈ మెయిల్స్ చూసుకోకుండా ఎవరైనా ఆఫీసు దగ్గరకు వస్తే వెనక్కు పంపేస్తున్నారు. ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రం హోంకు పూర్తి వ్యతిరేకం. అయినా పులి కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వక తప్పలేదు.
మైసూరులోని ఇన్ ఫోసిస్ క్యాంపస్ రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలో ఉంటుంది. ఫారెస్ట్ నుంచి ఓ పులి క్యాంపస్ లోకి వచ్చేసింది. దాన్ని గమనించడంతో వెంటనే అలర్ట్ అయ్యారు. ఫారెస్ట్ సిబ్బందికి ఇతర అధికారులకు సమాచారం ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ దొరకలేదు. అందుకే వర్క్ ఫ్రం హోం ఇచ్చేశారు. చాలా రోజులుగా పులి తిరుగుతోంది కానీ పట్టుకోలేకపోతున్నారు. పట్టుకునే వరకూ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయనున్నారు. మళ్లీ చెప్పే వరకూ ఆఫీసుకు వెళ్లేందుకు ఉద్యోగులు కూడా భయపడే అవకాశం ఉంది.
Like their employer striking billion $ deals, Mysore #Infosys employees struck a million $ 5 Yrs deal with this #Leopard to force their office to switch over to WFH. pic.twitter.com/JYY8vcbtKk
— BULLSeYe (@keshavsp13) January 8, 2025
2011లో కూడా ఓ సారి ఇన్ ఫోసిస్ మైసూర్ ఆఫీసులోకి పులి వచ్చింది. అప్పట్లో అందరూ పరుగులు తీశారు. ఎలాగోలా పట్టుకున్నారు. ఇప్పుడు ఈ పులి దొరుకుందో లేదో అన్న టెన్షన్ ఉద్యోగులకు పట్టుకుంది. ఆఫీసులో పులి అనేది కొత్త కాన్సెప్ట్. ఈ ఐడియాతో సస్పెన్స్ ధ్రిల్లర్ సినిమా తీస్తే సూపర్ హిట్ అయిపోతుందని సోషల్ మీడియాలో ఐటీ ఉద్యోగులు జోకులు వేసుకుంటున్నారు.