Viral News: ఒరే ఆజాము ఎంత గ్యాంగ్‌స్టర్‌వి అయితే మాత్రం గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజు ఇలా చేయాలా ? - అదిత్యనాథ్ ఒక చూపు చూస్తే ...
Kanpur: కాన్పూర్‌లోఓ గ్యాంగ్ స్టర్ తన గర్ల్ ఫ్రెండ్ పుట్టిన రోజును భిన్నంగా సెలబ్రేట్ చేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతనికి మూడినట్లేనని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

Kanpur Gangster Celebrates GF Birthday Near DCP Office: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో డీసీపీ ఆఫీసు ముందు పన్నెండు స్కార్పియోలు విన్యాసాలు చేశాయి. అందులో ఓ యువతి స్టైల్ గా కూర్చుని ఉంది. దేనికీ నంబర్ ప్లేట్స్ లేవు. అరగంట సేపు హంగామా చేసి అ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
ఈ దృశ్యాలు చూసిన తర్వాత అందరూ ఆ స్కార్పియోలు ఎవరివో ఓ అంచనాకు వచ్చారు. కాన్పూర్‌లో ముఫ్పై ఏళ్ల ఓ గ్యాంగ్ స్టర్ ఉన్నారు. అతనిపై 30కిపైగా తీవ్రమైన కేసులు ఉన్నాయి. అన్ని కేసులు ఉన్నా సరే పోలీసుల్ని చాలెంజ్ చేస్తున్నారు. అతను ఇటీవల ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అ ఆమ్మాయి ముందు గొప్పలు పోవడానికి రెచ్చిపోతున్నట్లుగా గుర్తించారు.
#कानपुर
— Simer Chawla (@Simerchawla20) January 7, 2025
12 गाडियों के काफिले में गर्लफ्रेंड का बर्थडे मनाने निकला गैंगस्टर
काली फिल्म,बिना नंबर प्लेट,गाड़ियों की कतार यह सब किसी #VIP का प्रोटोकॉल नहीं बल्कि एक गैंगस्टर का वीडियो है जो हूटर बजाते हुए डीसीपी साउथ ऑफिस के पीछे पहुंचा
जमकर स्टंट करे,वीडियो बनाई और सोशल मीडिया… pic.twitter.com/oi6D6NbzMp
అయితే యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యంగా ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి పిల్ల గ్యాంగ్ స్టర్లు నిక్కర్లు తడుపుకుని పరారయ్యారు. ఎదుకంటే సీనియర్ గ్యాంగస్టర్లందర్నీ ఎన్ కౌంటర్ చేసేశారు. కొంత మంది ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం అయింది. అయితే నేర సామ్రాజ్యంల తమదైన ముద్ర వేసి రాజకీయ పలుకుబడితో ఎలాగోలా నెట్టుకు రావాలని అనుకునేవారు మాత్రం అక్కడక్కడా ఉన్నారు.
उचित कार्यवाही होनी चाहिए इन सभी लोगों पर। कानपुर पुलिस को ऐसे लोगों को छोड़ना नहीं चाहिए। संदेश गलत दे रहे हैं। खाकी का खौफ़ नहीं रहा ऐसे लोगों पर खौफ दिखना चाहिए, मुकदमों में अंदर कर देना चाहिए।
— Amit Kumar (@Amitkum26018256) January 7, 2025
Also Read: Aadhaar Card Sim Limit: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉండవచ్చు? - ఎక్కువ ఉంటే ఏం అవుతుంది?





















