YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్ కామెంట్స్
YS Jagan News: తిరుమల తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైసీపీ అధినే జగన్ పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు.
Tirumala News: వైకుంఠ ద్వార దర్శనం లాంటి పవిత్రమైన రోజున భారీగా భక్తులు తిరుమల వస్తారని తెలిసి కూడా చర్యలు తీసుకోవడంలో టీటీడీ నుంచి ప్రభుత్వం వరకు అంతా విఫలమయ్యారని మండిపడ్డారు జగన్. తన సొంత జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి సరైన జాగ్రత్తలు తీసుకోవడం రాలేదని విమర్శించారు. తిరుమలలో లక్షల మంది భద్రతను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆరుగురు చనిపోయారని ఇంకా యాభై నుంచి అరవై మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.
వచ్చిన భక్తులకు కనీసం మంచి నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు జగన్. ప్రచారంపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. కుప్పంలో చంద్రబాబు పర్యటన కారణంగా అక్కడకు పోలీసులు వెళ్లిపోయారని అందుకే ఇక్కడ భక్తులను ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అందుకే ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, ఈవో, ఏఈవో అంతా బాధ్యులేనని అన్నారు. ఎలాంటి తప్పుడు జరగపోయినా లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఈఘటనను కూడా చాలా చిన్నదిగా చూపే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు
గత ఐదేళ్లలో తమ హయాంలో ఇలాంటి ఘటన ఒక్కటంటే ఒక్కటి కూడా జరగలేదని జగన్ గుర్తు చేశారు. ఇలాంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు చేపట్టాల్సిన కనీస రివ్యూలుగానీ, చర్యలు గానీ తీసుకోలేదని అన్నారు. వారిని ఏదో పార్క్‌లో రోడ్లపై వదిలేశారని అన్నారు. తప్పులన్నీ తమవైపు ఉంచుకొని ఏదో చిన్న చిన్న అధికారులదే తప్పు అనేలా సీన్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు.
తొక్కిసలాట చాలా ప్రదేశాల్లో జరిగినప్పుడు కనీసం అంబులెన్స్‌లు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు జగన్. మరికొందరు క్షతగాత్రులు తమ సొంత వాహనాల్లో ఆసుపత్రికి వచ్చామన్నారు. శ్రీరంగంలో చేపట్టినట్టు ఇక్కడ చర్యలు తీసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించారు. చంద్రబాబుకు శాస్త్రం తెలియదన్నారు. అంతేకాకుండా ఆయనకు దేవుడిపై భయం కానీ, భక్తి కానీ లేదని ఆరోపించారు. అందుకే తిరుమల ప్రతిష్టను దిగజార్చే ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. దేవుడిపై భక్తి ఉన్న వాళ్లు ఆ పని ఎవరైనా చేస్తారా. అని ప్రశ్నించారు. ఇప్పుడు ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఇలానే ఉంటాయా అని నిలదీశారు. అందుకే ఈ ఘటనలో కూడా ప్రథమ ముద్దాయి చంద్రబాబే అన్నారు.
ఈ పాపం చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. భక్తులకు క్షమాపణలు చెప్పే సిన్సియారీటీ లేదని అన్నారు. చేసిన తప్పును ఇంకొకరిపై మోపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో పుష్కరాల దుర్ఘటన టైంలో కూడా ఇలానే చేశారని అన్నారు. షూటింగ్ కోసం గేట్లు ఎత్తకుండా ఉంచి జనం బాగా రావాలని ప్రయత్నించి 29 మంది మృతి కారణమయ్యారన్నారు.
ఆసుపత్రికి తనను రాకుండా చేసేందుకు కాన్వాయ్‌ను ట్రాఫిక్‌లో అడ్డగించారని జగన్ ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చి అక్కడ నిజాలు ప్రజలకు తెలియజేస్తానో అనే భయంతో ఈ పని చేశారని అన్నారు. తాను వచ్చే సరికి కొందరి రోగులను కూడా తరలించారని ఆరోపించారు. తాము వెళ్లబోమని భీష్మించి కూర్చున్న వాళ్లనే వదిలేశారని అన్నారు. ఈ పాపంలో అధికారులు భాగమయ్యారని విమర్శించారు. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడని ఎస్పీ దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరికీ మొట్టికాయలు వేస్తారని శాపనార్థాలు పెట్టారు.