Tirupati Stampede Issue: తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన అధికారుల బదిలీ, సస్పెన్షన్లు - జ్యూడీషియల్ ఎంక్వైరీ - చంద్రబాబు కీలక నిర్ణయాలు
Tirupati : తిరుపతి ఎస్పీని బదిలీ చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. అసలు తొక్కిసలాటకు కారణమని ఆరోపమలు ఎదుర్కొంటున్న డీఎస్పీ రమణకుమార్‌ను సస్పెండ్ చేశారు.
Chandrababu announced the transfer of Tirupati SP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తిరుపతి SP సుబ్బారాయుడు, జాయింట్ కమీషనర్ గౌతమి ల పై బదిలీ వేటు వేశారు. DSP రమణ కుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వీరంతా తమ బాధ్యతను విస్మరించారని చంద్రబాబు మండిపడ్డారు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ ను కూడ బదిలీ చేస్తున్నట్లుగా చంద్రబాబు ప్రకటించారు. అలాగే ఈ ఘటన మొత్తంపై జ్యూడిషియల్ విచారణకు ఆదేశించినట్లుగా తెలిపారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీ పూర్తి అయిన తర్వాత మిగతా వారిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
జ్యూడిషియల్ విచారణతో నిజాలు వెలుగులోకి !
తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో తొక్కిసలాట ఘటనపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడిన శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. తిరుమలలో ఉద్యోగులు సేవా భావంతో పనిచేయాలి.. ఎవరూ పెత్తందారీలుగా వ్యవహారించకూడదన్నారు. గత ప్రభుత్వం వైకుంఠ ద్వార దర్శనాన్ని పదిరోజులకు పెంచిందని.. ఎవరి అభిప్రాయాలతో ఇలా చేశారో తెలియదన్నారు. టోకెన్ల జారీ కోసం ఎంపిక చేసిన ప్రదేశం సరైనది కాదని.. ప్రతి దాంట్లో తాను ఇన్వాల్వ్ కాను.. తాను ఎవరికి బాధ్యతలు అప్పగించానో వారు బాధ్యతతో పనిచేయాల్సి ఉందన్నారు.
Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటనలో అసలు తప్పెవరిది? - సీఎం చంద్రబాబుకు నివేదిక, ఏ సమయంలో ఏం జరిగిందంటే?
తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుపతిలో రాజకీయాలు చేసేందుకు అవకాశం లేదన్నారు. దైవసేవలో రాజకీయాలు ఉండకూడదన్నారు. క్యూలైన్లలో ఎన్నిగంటలైనా ఉంటామని భక్తులు చెబుతున్నారన్నారు. మృతుల్లో విశాఖకు చెందిన ముగ్గురు ఉన్నారు. విశాఖకు చెందిన లావణ్య, శాంతి, రజని తొక్కిసలాట ఘటనలో మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు టీటీడీ నిధుల నుంచి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు. తీవ్ర గాయాలైన ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం, మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 33 మంది క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం చేయిస్తామని ప్రకటించారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుడండా కఠిన చర్యలు
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని.. తిరుమల పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తొక్కిసలాట ఘటనతో మనసు కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అధఇకారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ఘటనలో ఏం జరిగిందన్నదానిపై విచారణకు ఆదేశించడంతో .. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి చిక్కులు తప్పవన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Also Read: తిరుపతి తొక్కిసలాట ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు - అధికారులపై తీవ్ర ఆగ్రహం