Burn Belly Fat : ఉదయాన్నే ఈ సింపుల్ పనులు చేస్తే పొట్ట ఈజీగా తగ్గిపోతుందట.. ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్స్ పక్కా
Belly Fat Reducing Tips : మార్నింగ్ రొటీన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. అయితే మీకు బెల్లీ ఫ్యాట్ (పొట్ట) ఉంటే.. కొన్ని హాబీలోను మీ రొటీన్లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.
Morning Habits to Help Burn Belly Fat : పొట్ట ఎక్కువగా ఉంటే.. కంఫర్టబుల్‌గా ఉండలేరు. నచ్చిన డ్రెస్ వేసుకోలేరు. పైగా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా బెల్లీ ఫ్యాట్ తగ్గట్లేదు అనుకునేవారు కొన్ని అలవాట్లను తమ రొటీన్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. వాటిని రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం వల్ల పొట్ట తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెప్తున్నారు. ఇంతకీ రొటీన్లో చేర్చుకోవాల్సిన అలవాట్లు ఏంటి? వాటివల్ల బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
సాల్ట్ వాటర్‌తో
మీ ఉదయాన్ని ఓ గ్లాసు నీటితో ప్రారంభించాలట. దానిలో కాస్త ఉప్పు కూడా వేసుకుంటే మరీ మంచిదని చెప్తున్నారు. ఇలా రోజూ చేయడం వల్ల మెటబాలీజం పెరుగుతుంది. జీవక్రియ ఎక్కువగా ఉన్నప్పుడు క్యాలరీలు సూపర్‌ఫాస్ట్‌గా బర్న్ అవుతాయి. దీనివల్ల కొవ్వు తగ్గుతుంది. అంతేకాకుండా జీర్ణక్రియ మెరుగవుతుంది. మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో హెల్ప్ చేస్తుందట ఈ అలవాటు.
ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం కాదు.. ఉదయాన్నే హెల్తీ ఫుడ్‌ని శరీరానికి అందించాలి. రోజు ప్రారంభమైన తర్వాత శరీరానికిచ్చే మొదటి మీల్ ఎప్పుడూ హెల్తీగా ఉంటే మంచిది. దానికోసం మీరు ప్రోటీన్ ఎక్కువగా ఉండే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. గుడ్లు, యోగర్ట్, ప్రోటీన్ షేక్ వంటివి బెస్ట్ ఆప్షన్. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. అలాగే కండరాలు దృఢంగా మారుతాయి. వయసు ప్రభావం వల్ల మీ కండరశక్తి తగ్గుతుంటే.. దానిని బిల్డ్ చేయడంలో ప్రోటీన్ బాగా హెల్ప్ చేస్తుంది. ఇది శరీరంలో కొవ్వు శాతాన్ని తగ్గించి.. మజిల్ని బిల్డ్ చేస్తుంది.
వ్యాయామం
మీకు జిమ్‌కి సమయం కుదరడం లేదు అనుకున్నప్పుడు మీ మార్నింగ్‌ని ఓ 20 నిమిషాలు ముందుకు తీసుకెళ్లండి. ఇంట్లోనే వ్యాయామం చేస్తే.. శరీరం యాక్టివ్ అవుతుంది. తేలికపాటి వ్యాయామాలు చేసినా.. ఫ్యూచర్లో మంచి ఫలితాలు చూస్తారు. మెటబాలీజం పెరుగుతుంది. కేలరీలు తగ్గుతాయి. ఫ్యాట్‌లాస్ అవుతుంది.
డైట్ ప్లానింగ్..
మీరు తినే ఫుడ్‌పై ఎంత ఫోకస్ పెడితే అంత మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. ఏ ఫుడ్ తింటే మీ హెల్త్‌కి మంచిది. వేటిలో పోషకాలు ఉంటాయి. ఏ ఫుడ్స్ తింటే అన్‌హెల్తీ ఫుడ్స్‌పై క్రేవింగ్స్ తగ్గుతాయి వంటి విషయాలు నోటిస్ చేసి.. దాని ప్రకారం మీ డైట్‌ని ఫిక్స్ చేసుకోండి. బ్యాలెన్స్డ్ డైట్ ఆరోగ్యానికి మంచిది. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మీకు ఈ విషయంలో డౌట్ ఉంటే ఆరోగ్య నిపుణులు లేదా డైటీషియన్తో మీ అలవాట్లను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి డైట్ ప్లాన్ చేయించుకోండి.
జిమ్‌కి వెళ్లినా.. వాకింగ్‌కి వెళ్లినా.. ఏమి చేసినా మిమ్మల్ని మీరు ఎంత ఎంగేజింగ్‌గా ఉంచుకుంటే మీరు అంత త్వరగా పొట్టకొవ్వును తగ్గించుకోగలుగుతారు. హెల్తీగా ఉండగలుగుతారు. మరి ఈ సింపుల్, హెల్తీ అలవాట్లను మీ రొటీన్లో చేర్చుకుని బెస్ట్ రిజల్ట్స్ మీరే చూడండి.
Also Read : చికెన్ రైస్ బౌల్ రెసిపీ.. ఫిట్నెస్, బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్