అన్వేషించండి

Bumrah Injury: గుడ్ న్యూస్, బుమ్రా తిరిగొచ్చేందుకు బీసీసీఐ డేరింగ్ స్టెప్ - కివీస్ ఫేమస్ డాక్టర్‌తో చికిత్స

Jasprit Bumrah: ఆస్ట్రేలియాతో జరిగిన 5 టెస్టుల సిరీస్‌లో బుమ్ర విశేషంగా రాణించాడు. 32 వికెట్లతో అనేక రికార్డులు తిరగరాశాడు. చివరి టెస్టులో అతడు గాయపడటం, భారత విజయావకాశాల్ని దెబ్బతీసింది.

BCCI Vs Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల తొలివారంలో జరిగిన సిడ్నీ టెస్టులో తను గాయపడ్డాడు. ఆ కారణంగా రెండో ఇన్నింగ్స్‌లో అతను బౌలింగ్ కూడా వేయలేకపోయాడు. ప్రస్తుతం బుమ్రాకు అయిన గాయం గ్రేడ్ 1 అని తెలుస్తోంది. దీనికి రెండు నుంచి మూడు వారాల విశ్రాంతి అవసరమని సమాచారం. అయితే బుమ్రా గాయానికి చికిత్స అందించేందుకు బీసీసీఐ డేరింగ్ స్టెప్ తీసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన ప్రముఖ ఆర్తోపెడిక్ సర్జన్ డా. రోవాన్ షౌటెన్‌ను సంప్రదించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే సంప్రదింపుల ప్రక్రియ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. వెన్నునొప్పికి సంబంధించి రోవాన్‌కు మంచి అనుభవమున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయమై సెలెక్టర్లకు కూడా సూచన అందించినట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించే డేట్ దగ్గర పడింది. ఈ టోర్నీలో బుమ్రా ఆడాలని బోర్డు కోరుకుంటోంది. అతను వేగంగా కోలుకునేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. 

ఫిట్ నెస్ నిరూపించుకుంటేనే..
ఒకవేళ ట్రోఫీ నాటికి బుమ్రా కోలుకుంటేనే అతడిని తుదిజట్టులోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి చూచాయగా అతడి పేరును ఎంపిక చేసినప్పటికీ, గాయం నుంచి కోలుకుని వంద శాతం ఫిట్‌గా ఉంటేనే టోర్నీకి అనుమతించాలని బోర్డు భావిస్తోంది. అలాగే అతను ఫిట్‌గా ఉంటే లిమిటెడ్ ఓవర్ల వైస్ కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని చూస్తోంది. ఇటీవల ఆసీస్ టూర్లో అతను కెప్టెన్సీతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. స్ఫూర్తిదాయక ఆటతీరుతో తొలి టెస్టులో 295 పరుగులతో ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించాడు. అలాగే ఐదో టెస్టులోనూ కెప్టెన్సీ వహించిన బుమ్రా.. జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించాడు. బుమ్రా సారథ్యంలోని రెండు టెస్టుల్లోనే భారత్ డామినేషన్ చూపించింది. రెండు టెస్టుల్లోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకోగా, మిగతా మూడు టెస్టుల్లో ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకునేందుకు ఆపసోపాలు పడింది. 

కెప్టెన్సీ వద్దు.. 
అయితే కెప్టెన్సీలో అద్భుతాలు చేసిన బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగించకూడదని భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయ పడుతున్నాడు. బుమ్రా అద్భుతమైన బౌలరని, అతడిని కేవలం బౌలింగ్‌కు మాత్రమే పరిమితం చేద్దామని వాదిస్తున్నాడు. కెప్టెన్సీ అంటే అనేక రకాల ఒత్తిడి ఉంటుందని, ఈ క్రమంలో గాయాల బారిన పడి బుమ్రా కెరీర్ ప్రమాదంలో పడే అవకాశముందని పేర్కొన్నాడు.నిజానికి బుమ్రా రనప్ చాలా చిన్నగా ఉంటుందని, ఐదారు అడుగులు పరుగెత్తుకుంటూ వచ్చి, ఒకేసారి పేస్‌తో బౌలింగ్ చేస్తాడని, ఈ రకమైన శైలితో గాయాల బారిన పడే అవకాశముందని కైఫ్ పేర్కొన్నాడు. 

ఇక దానికి తోడు కెప్టెన్సీ కూడా బుమ్రాకు అప్పగిస్తే వ్యూహాల ఒత్తిడిలో పడి అతను గాయాల బారిన పడే అవకాశముందని, బీసీసీఐ అలాంటి పొరపాటు చేయకూడదని వ్యాఖ్యానించాడు. వచ్చే జూన్లో ఇంగ్లాండ్ టూర్లో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతారని, మధ్యలోనే బుమ్రా గాయపడిలే ఎలా అని అందుకే ఇప్పటి నుంచే వేరే ప్లేయర్లని కెప్టెన్‌గా ఎంపిక చేసుకోవాలని సూచించాడు. వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ఐపీఎల్‌లో సారథ్య అనుభవం ఉందని గుర్తు చేశాడు. ఇక ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆల్రెడీ జట్టుకు టెస్టులో నాయకత్వం వహించాడని తను కూడా సరిపోతాడని పేర్కొన్నాడు. సిసలైన పేసర్ బుమ్రాను.. కెప్టెన్సీ పేరుతో అనవసరంగా టీమ్ మేనేజ్మంట్ ప్రయోగాలు చేయకూడదని, తనను బౌలింగ్‌పైనే కాన్సట్రేషన్ చేసేలా చూడాలని పేర్కొన్నాడు. ఏదేమైనా దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Also Read:  BGT Update: ఆ లోపాలే బీజీటీలో భారత్ కొంపముంచాయా..? మేనేజ్మెంట్ మిస్టేక్స్ తో పదేళ్ల తర్వాత ఆసీస్ ఒడిలోకి ట్రోఫీ..! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
Embed widget