Game Changer Review Live Updates: రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' రివ్యూ లైవ్ అప్డేట్స్ - సినిమాలో సీన్ టు సీన్ మీ ముందుకు!
Game Changer Review in Telugu: రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'గేమ్ చేంజర్'. ఏపీలో ఒంటిగంట షో మొదలైంది. రీడర్స్ కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో లైవ్ అప్డేట్స్...
LIVE
Background
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎదురు చూపులకు ఇవాళ తెర పడింది. ఈ రోజు 'గేమ్ చేంజర్'తో సోలో హీరోగా ఆరేళ్ల తర్వాత ఆయన వెండితెర మీదకు వచ్చారు. ఆస్కార్ సాధించిన 'త్రిబుల్ ఆర్' తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటించిన ఆ సినిమా ఇవాళ విడుదలైంది. 'త్రిబుల్ ఆర్' తర్వాత 'ఆచార్యు'లో అతిథి పాత్రలోనూ, సల్మాన్ ఖాన్ హిందీ సినిమా 'కిసి కా భాయ్ కిసి కీ జాన్'లో ఓ పాటలో తళుక్కున మెరిశారు. అయితే ఆయన నుంచి ఫుల్ లెంగ్త్ సినిమా కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫాన్స్ అందరికీ 'గేమ్ చేంజర్' ఒక ఫెస్టివల్ మూమెంట్.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన 'గేమ్ చేంజర్' ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు (జనవరి 10న) భారీ ఎత్తున విడుదల అయ్యింది. దర్శకుడు శంకర్ తీసిన తొలి స్ట్రయిట్ తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ రోజు విడుదల చేశారు.
'గేమ్ చేంజర్' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత 'దిల్ రాజు', ఆయన సోదరుడు శిరీష్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశారు. వారి సంస్థలో ఇది 50వ సినిమా. అందుకని, ఖర్చు విషయంలో అస్సలు వెనకడుగు వేయలేదు. సుమారు 500 కోట్ల నిర్మాణ వ్యయంతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ఈ చిత్ర నిర్మాణంలో జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థలు భాగస్వామ్యం వహించాయి. కేవలం ఐదు పాటల చిత్రీకరణకు రూ. 75 కోట్లు ఖర్చు చేసినట్లు 'దిల్' రాజు తెలిపారు.
రాజకీయ నేపథ్యంలో 'గేమ్ చేంజర్' సినిమా రూపొందింది. కలెక్టర్, ఒక మంత్రికి మధ్య తలెత్తిన సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది. ఇందులో మంత్రి బొబ్బిలి మోపిదేవి పాత్రలో దర్శకుడు - నటుడు ఎస్.జె. సూర్య నటించారు. ఇక మరొక కీలక పాత్రలో శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ నటించగా... ఇతర ప్రధాన పాత్రలను జయరాం, సునీల్, నవీన్ చంద్ర, 'వెన్నెల' కిషోర్ తదితరులు పోషించారు.
'గేమ్ చేంజర్' సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేశారు. ఐఏఎస్ అధికారిగా కనిపించనున్న రామ్ నందన్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించగా... ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలలో వచ్చే అప్పన్నకు జంటగా తెలుగు అమ్మాయి అంజలి సందడి చేయనున్నారు. ఈ సినిమాలో నటనకు గాను రామ్ చరణ్ కచ్చితంగా ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకుంటారని అమెరికాలో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో క్రియేటివ్ జీనియస్ సుకుమార్ చెప్పారు. ఆ తర్వాత అదే మాటను దర్శకుడు శంకర్ కూడా చెప్పారు. చరణ్ ఒక్కరికే కాదని అంజలి నటనకు కూడా నేషనల్ అవార్డు రావాలని సంగీత దర్శకుడు తమన్ ఆకాంక్షించారు. ఇంతమంది ఇలా చెబుతున్న ఈ సినిమా ఎలా ఉంది? లైవ్ అప్డేట్స్ ద్వారా తెలుసుకోండి.
'గేమ్ చేంజర్' రివ్యూ చదివారా?
'గేమ్ చేంజర్' సినిమా జనసేనకు ప్లస్ అయ్యేలా తీశారా? అప్పన్న పాత్రను పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో డిజైన్ చేశారా? సినిమా ఎలా ఉంది? శంకర్ ఎలా తీశారు? రివ్యూ చదివి తెలుసుకోండి. రివ్యూ చదివేందుకు కింద లింక్ క్లిక్ చేయండి.
'గేమ్ చేంజర్' రివ్యూ: పవన్ 'జనసేన'కు ప్లస్సే - రామ్ చరణ్, శంకర్ సినిమా ఎలా ఉందంటే?
'గేమ్ చేంజర్' ఆడియన్స్ రివ్యూ
'గేమ్ చేంజర్' చూసిన ఆడియన్స్ ఏం అంటున్నారు? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది? ట్వీట్స్ ఎలా ఉన్నాయి? అనేది తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Also Read: రామ్ చరణ్ హిట్టు కొట్టాడా? ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉందేంటి?
క్లైమాక్స్... రామ్ చరణ్ రోల్ మారింది!
క్లైమాక్స్ ముగిసింది... సినిమా చివరకు వచ్చేసరికి రామ్ చరణ్ క్యారెక్టర్ కొత్త టర్న్ తీసుకుంది. అది ఏమిటో సినిమా చూసి తెలుసుకోండి.
మళ్ళీ ఎన్నికలు... కీలక మలుపులు
మళ్ళీ ఎన్నికల సన్నివేశాలు వచ్చాయి. కథలో కీలక సన్నివేశాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని మలుపులు ఉన్నాయి.
ఎన్నికల తర్వాత లవ్ సీన్... జరగండి సాంగ్
ఎన్నికల తర్వాత రామ్ చరణ్, కియారా అద్వానీ మధ్య లవ్ సీన్ వచ్చింది. ఆ తర్వాత 'జరగండి జరగండి' సాంగ్ వచ్చింది.