Champions Trophy 2025: బుమ్రా నుంచి మిచెల్ స్టార్క్ వరకు ఛాంపియన్ ట్రోఫీ నుంచి తప్పుకున్న ఆటగాళ్ల జాబితా ఇదే!
Champions Trophy 2025: మరో వారం రోజుల్లో ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభంకానుంది. పాకిస్తాన్‌లో జరిగే ICC ఈవెంట్‌కు బుమ్రాతోపాటు చాలా మంది కీలకమైన ఆటగాళ్లు మిస్ అవుతున్నారు.

Champions Trophy 2025: ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్, దుబాయ్ వేదికలపై జరగనున్న ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ICC ఈవెంట్‌లో పాల్గొంటున్న జట్లన్ని తమ ఫైనల్‌టీమ్‌లను ప్రకటించాయి. చాలా కాలంగా క్రికెట్ ఆడుతూ ఉన్న కీలకమైన క్రికెటర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. విజయాన్ని మార్చే దమ్మున్న ఆటగాళ్లు లేకుండానే ఆయా జట్లు టోర్నీలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్న ఆటగాళ్లు వీళ్లే
1. జస్ప్రీత్ బుమ్రా (ఇండియా)
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) సమయంలో తగిలిన గాయం కారణంగా భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి దూరమయ్యాడు. యార్కర్లు, స్వింగర్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసి మ్యాచ్ స్వభావం మార్చే సత్తా ఉన్న బుమ్రా లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే.
2. ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)
2023 వన్డే ప్రపంచ కప్‌కు జట్టును నడిపించిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా BGT సిరీస్ తర్వాత చీలమండ గాయంతో బాధపడుతున్నాడు. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. కమిన్స్ లేకపోవడంతో ఆస్ట్రేలియా టీమ్‌కు స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
3. మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా వెన్నుముఖ సమస్యతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉంటున్నాడు. ఇదే కారణంతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆడలేదు. ఈయన లోటును కూపర్ కొన్నోలీని నియమించారు.
4. జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా)
ఆస్ట్రేలియా పేస్‌లో కీలకమైన ఆటగాడు జోష్ హాజిల్‌వుడ్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మూడో టెస్ట్‌లో గాయపడ్డారు. తుంటి గాయంతో జట్టు నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జై రిచర్డ్‌సన్‌ను ఆడారు. హాజిల్‌వుడ్ కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేయలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆయన స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను నియమించారు.
5. మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
ఐసిసి ఈవెంట్‌కు దూరమైన ఆస్ట్రేలియా ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాడు. ఇప్పుడు ఆ జట్టు జట్టు బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస, సీన్ అబాట్‌పై ఆధారపడుతుంది.
6. అన్రిచ్ నార్ట్జే (దక్షిణాఫ్రికా)
ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నార్ట్జే కూడా గాయాల కారణంగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాడు. ఇది దక్షిణాఫ్రికాకు పెద్ద దెబ్బ. డిసెంబర్ 2024లో వన్డేల్లో అరంగేట్రం చేసిన ఆల్ రౌండర్ కార్బిన్ బాష్‌ను నార్ట్జే స్థానంలో ఎంపిక చేశారు.
Also Read: క్రికెట్ అంటే పిల్లలాట కాదు.. బాధ్యతగా ఉండాలి.. ఇంగ్లాండ్ బ్యాటర్ పై దిగ్గజ క్రికెటర్ ఫైర్
7. జాకబ్ బెథెల్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్ యువ బ్యాటింగ్ ఆల్ రౌండర్ జాకబ్ బెథెల్ కూడా గాయంతో ఛాంపియన్ ట్రోఫీకి దూరమయ్యాడు. ఇటీవల నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో హామ్ స్ట్రింగ్ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఆటడం లేదు. వీళ్ల స్థానంలో ఎవరు ఆడుతారో ఇంత వరకు చెప్పలేదు. కానీ బెథెల్ స్థానంలో వికెట్ కీపర్-బ్యాటర్ టామ్ బాంటన్ ఆడే అవకాశం ఉంది.
8. సైమ్ అయూబ్ (పాకిస్తాన్)
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ సందర్భంగా గాయాల పాలయ్యాడు పాకిస్తాన్ యువ ఓపెనర్ సైమ్ అయూబ్. ఇతను కూడా ICC ఈవెంట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. అయూబ్ గైర్హాజరుతో ఫఖర్ జమాన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది.
9. అల్లా గజన్‌ఫర్ (ఆఫ్ఘనిస్తాన్)
వెన్నెముక గాయంకారణంగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన అల్లా గజన్‌ఫర్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి తప్పుకున్నాడు. కనీసం నాలుగు నెలల పాటు రెస్ట్ కావాలని వైద్యుల సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు అతను IPL 2025 పాల్గొనడం కూడా అనుమానమే.
Also Read: RCB కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్ -అభినందించిన కోహ్లీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

