అన్వేషించండి

Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Chittoor Crime News | ప్రశాంతంగా ఉండే చిత్తూరు జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. ఓ వ్యాపారి ఇంట్లోకి చొరబడిన దొంగలు గాల్లోకి కాల్పులు జరిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.

చిత్తూరు: చిత్తూరులోని గాంధీరోడ్డులో కాల్పులు కలకలం రేపాయి. లక్ష్మీ  సినిమా హల్ సమీపంలో ఉన్న పుష్ప కిట్ వరల్డ్ షాపింగ్ మాల్ యజమాని  ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడ్డారు. దుండుగులు రెండు తుపాకులతో కాల్పులు సైతం జరిపి ఇంట్లో వారిని బెదిరించే ప్రయత్నం చేశారు. అయితే యజమాని అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. యజమాని నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. 
షాపింగ్ మాల్ యజమాని ఇంట్లో కాల్పులు జరిపిన ఘటనలో నలుగుర్ని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వ్యానులో నిందితుల్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకులు, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ   మణికంఠ చెందోలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.


Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

పీఎస్‌కు నిందితుల తరలింపు

ప్రశాంతంగా ఉండే చిత్తూరులో కాల్పులు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. వ్యాపారి ఇంట్లోకి చొరబడిన నిందితులు గాల్లోకి కాల్పులు జరిపి వారిని బెదిరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అప్రమత్తమైన ఇంటి యజమాని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు బెటాలియన్ తో దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మరోవైపు కాల్పులు జరిగిన ఇంట్లోకి చాకచక్యంగా ప్రవేశించిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.  చోరీ చేయడానికి వచ్చారా, లేక హత్య చేసే కుట్ర జరిగిందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఆ నలుగుర్ని పీఎస్ కు తరలించారు.


Chittoor Gun Fire: చిత్తూరులో కాల్పుల కలకలం- నలుగురి అరెస్ట్, 2 తుపాకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

సకాలంలో పోలీసులు, స్పెషల్ టీమ్ రావడంతో తప్పిన ప్రమాదం

కాల్పులు జరిగాయని తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల వారు సైతం గాంధీరోడ్డులోని లక్ష్మి సినిహా హాల్ వద్ద ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. కాసేపు అక్కడ సినిమా సీన్ లాంటి రియల్ సీన్లు కనిపించాయి. పోలీసులు, స్పెషల్ ఫోర్స్ బలగాలు సకాలంలో అక్కడికి చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలుస్తోంది. కాల్పులు జరిగిన చుట్టుపక్కల ఇండ్ల వారిని సైతం పోలీసులు వివరాలు ఆరా తీశారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, ఆయుధాలతో తిరుగుతున్నారని తెలిసినా తమకు సమాచారం అందివ్వాలని చిత్తూరు ఎస్పీ ప్రజలకు సూచించారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Vijayawada Road Accident: విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు దుర్మరణం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Embed widget