అన్వేషించండి

KTR on Governor Speech: రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

BRS stand on Governor Speech | తెలంగాణ అసెంబ్లీలో జరిగింది గవర్నర్ ప్రసంగం కాదని, గాంధీ భవన్‌లో రాసిచ్చే ప్రెస్ నోట్ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ తో పాటు రాష్ట్ర ప్రజల్ని మోసం చేశారన్నారు.

 

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌ ప్రసంగంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్‌తో కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పించడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పులను గవర్నర్ పెద్ద మనిషిగా అసెంబ్లీలో ప్రస్తావిస్తారని ఆశపడిన బీఆర్ఎస్ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు నిరాశ చెందారని కేటీఆర్ అన్నారు. గవర్నర్ తన హోదా, స్థాయిని మరిచి ప్రసంగంలో అన్ని అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు. రాష్ట్రంలో రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్‌ ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వడం లేదని నినాదాలు చేశారు. సంపూర్ణ రుణ మాఫీ చేయాలని, రైతులకు పంట బోనస్‌ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. బీఆర్‌ఎస్‌ సభ్యుల ఆందోళన, నిరసన మధ్యే గవర్నర్‌ ప్రసంగం కొనసాగింది.

బీసీ కులగణనపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కేసీఆర్ హయాంలో 56 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు ఎందుకు తగ్గిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ తల్లిని సెక్రటేరియట్ లో పెట్టి తెలంగాణ తల్లి అంటున్నారు. రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ లో పెట్టారు. మూడేళ్ల తరువాత మేం అధికారంలోకి వచ్చాక రాహుల్ గాంధీ తల్లి, తండ్రిని ప్యాక్ చేసి గాంధీ భవన్‌కు పంపిస్తాం’ అని కేటీఆర్ అన్నారు.  

ఇంతకీ గవర్నర్ స్పీచ్ లో ఏమన్నారంటే..

దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి తెలంగాణలో అవుతుందని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులకు రూ. 500 పంట బోనస్‌ ఇస్తోందని, మహాలక్ష్మీ స్కీమ్‌ గేమ్ ఛేంజర్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పేర్కొన్నారు. పేదింటి వారికి రూ. 500 కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తున్నామని, ఇప్పటికే రూ. 25 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం. ఇది తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని గవర్నర్ జిష్ణదేవ్ వర్మ తెలిపారు.

కేసీఆర్ మీద కక్షతో మేడిగడ్డను నాశనం చేస్తున్నారు

అసెంబ్లీలో ఈరోజు గవర్నర్ ప్రసంగం కాదు, గాంధీభవన్ లో రాసే ప్రెస్ నోట్‌లా ఉంది. పెద్దాయన గవర్నర్ నోటి నుంచి ఎన్నో అబద్ధాలు చెప్పించారు. రాష్ట్రంలో 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలు ఎండిపోకుండా కాపాడం లాంటి బాధ్యతాయుత మాట ఒక్కటీ గవర్నర్ నోటి నుంచి రాలేదు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా 30, 35 శాతానికి మించి రుణమాఫీ జరగలేదు. రేవంత్ నియోజకవర్గం అయినా, మా నియోజకవర్గాలైనా ఓకే.. వెళ్లి లెక్కలు పరిశీలిద్దామని ఛాలెంజ్ చేస్తే ముందుకొచ్చే ధైర్యం చేయలేదు. తాగునీటి సంక్షోభం పెరిగినా, మేడిగడ్డను కేసీఆర్ మీద కక్షతో రిపేయిర్ చేపించకుండా ఎండేలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 20 శాతం కమీషన్ ఇవ్వకపోతే బిల్లులు ఇస్తలేరని సెక్రటేరియట్ పై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు, సర్పంచులను వేధించి డబ్బులు వసూలు చేసి ఢిల్లీకి నోట్ల మూటలు పంపుతున్నారు. గురుకులాలు, హాస్టళ్లలో 80 మంది వరకు పిల్లలు చనిపోతే ఎలాంటి చర్యలు చేపట్టని చేతకాని సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం’ అని కేటీఆర్ మండిపడ్డారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget