Jr NTR : తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్... ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
Jr NTR : తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కన్పించిన తారక్ చేతికి రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్ పెట్టుకున్నారు. దీని ధర ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ వాచ్ కాస్ట్, వివరాలు ఇవే...

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ముంబై విమానాశ్రయంలో క్లాసీ లుక్ లో దర్శనమిచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన పెట్టుకున్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ధర ఏకంగా కోట్లలోనే ఉంటుందని సమాచారం.
ఎన్టీఆర్ చేతికి రిచర్డ్ మిల్లే లిమిటెడ్ ఎడిషన్ వాచ్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ముంబై విమానాశ్రయంలో స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానుల దృష్టిని ఆకర్షించారు. ఎన్టీఆర్ క్లాసీ క్యాజువల్ బట్టలు ధరించి ముంబై ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ టైమ్ లో తారక దగ్గర ఉన్న అన్ని వస్తువుల కంటే ఆయన పెట్టుకున్న అల్ట్రా లగ్జరీ వాచ్ పై పడింది మూవీ లవర్స్ దృష్టి. దీంతో ఆ వాచ్ కు ఉన్న స్పెషాలిటీ ఏంటి? ధర ఎంత ? అనే విషయాలను ఆరా తీయడం మొదలుపెట్టారు.
ఎన్టీఆర్ ధరించిన ఈ అద్భుతమైన వాచ్ రిచర్డ్ మిల్లె అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కు సంబంధించింది. ఈ వాచ్ పూర్తి పేరు రిచర్డ్ మిల్లె 40-01 టూర్ బిల్లాన్ మెక్ లారెన్ స్పీడ్ టైయిల్. ఇక దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ రిచర్డ్ మిల్లె లిమిటెడ్ ఎడిషన్ వాచ్ ధర రూ. 7.47 కోట్లు. ఈ విషయం తెలిసిన సినీ ప్రియులు ఆ వాచ్ కు ఎన్టీఆర్ ఖర్చు పెట్టిన డబ్బుతో ఓ మిడిల్ క్లాస్ లైఫ్ సెట్టు అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. గతంలోనూ ఎన్టీఆర్ ఈ వాచ్ పెట్టుకుని కనిపించారు. ముంబైలో 'వార్ 2' షూటింగ్ టైంలో, అలాగే ఎన్టీఆర్ -ప్రశాంత్ నీల్ మూవీ లాంచ్ ఈవెంట్ లోనూ ఇదే వాచ్ పెట్టుకున్నారు ఎన్టీఆర్.
Also Read: క్లీన్ కామెడీ, నో అసభ్యత, డబుల్ ఫన్... 'రాబిన్‌హుడ్'కు నితిన్ ఫస్ట్ రివ్యూ
View this post on Instagram
ఎన్టీఆర్ కార్ల కలెక్షన్
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ దగ్గర ఎన్నో కాస్ట్లీ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వాచ్ కలెక్షన్ ఉంది. అలాగే ఆయన దగ్గర లాంబోర్గిని ఉరస్, మెర్సిడెజ్ బెంజ్, రేంజ్ రోవర్ ఓగ్, బీఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ నుంచి పోర్స్చే వరకు ఖరీదైన కార్ల కలెక్షన్ కూడా ఉంది.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే... గత ఏడాది 'దేవర' మూవీ తో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు తారక్. ఇప్పుడు హృతిక్ రోషన్ తో కలిసి 'వార్ 2' మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందబోతున్న మరో పాన్ ఇండియా మూవీ సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు తారక్. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ షూటింగ్ షురూ చేశారు. ఎన్టీఆర్ లేని పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఒక్కసారి ఎన్టీఆర్ సెట్ లో జాయిన్ అయితే ఆయనపై కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలవుతుంది. మరోవైపు 'వార్ 2' షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో హృతిక్ రోషన్ గాయపడడంతో ఈ మూవీ షూటింగ్ ఆగినట్టు సమాచారం.





















