Kiara Advani: క్రేజీ సీక్వెల్‌కు గుడ్ బై చెప్పిన కియారా... 'వార్ 2', 'టాక్సిక్' తరువాత ఆమె చేయబోయే పని ఇదే
Kiara Advani : త్వరలోనే తల్లి కాబోతున్న కియారా అద్వానీ ఇప్పటికే ఒప్పుకున్న ఒక క్రేజీ సీక్వెల్ కు గుడ్ బై చెప్పేసిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. 'వార్ 2', 'టాక్సిక్' సినిమా తరువాత ఆమె ఏం చేస్తుందంటే ?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన ఈ అమ్మడు తాను త్వరలోనే తల్లి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ మీడియాలో కియారా పలు సినిమాలకు దూరం కాబోతుందన్న వార్తలు విన్పిస్తున్నాయి. ఇన్నాళ్లు స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తూ వస్తున్న కియారా అద్వానీ, ఇప్పుడు మూవీస్ కు బ్రేక్ ఇచ్చి, పర్సనల్ లైఫ్ పై దృష్టి పెట్టాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది.
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న కియారా ?
ఫర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న 'డాన్ 3' మూవీ నుంచి కియారా అద్వానీ తప్పుకుందని సమాచారం. ఈ క్రమంలోనే చిత్ర నిర్మాతలు ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం కొత్త హీరోయిన్ వేటలో పడ్డారు. ఇక ఇప్పటికే కియారా యాక్సెప్ట్ చేసిన 'వార్ 2' షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే 'టాక్సిక్' కూడా షూటింగ్ దశలో ఉంది. అందుకే ఈ సినిమాల షూటింగ్లను పూర్తి చేసి, ఆ తర్వాత కంప్లీట్ గా రెస్ట్ తీసుకుంటుందని తెలుస్తోంది. మరోవైపు 2026లో స్టార్ట్ కాబోతున్న మోస్ట్ అవైటింగ్ బాలీవుడ్ సినిమాలు 'శక్తి శాలిని', 'ధూమ్ 4'లలో ఆమె హీరోయిన్ గా నటిస్తుందని రూమర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఈ సినిమాలు సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి అప్పట్లోపు ఆమె ఫస్ట్ బేబీకి జన్మనిచ్చి, ఆ తర్వాత షూటింగ్లో అడుగు పెడుతుందని అంటున్నారు. మరి పిల్లలు పుట్టాక కియారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
కాగా 2023 ఫిబ్రవరిలో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 'షేర్షా' అనే సినిమాలో ఫస్ట్ టైం కలిసి నటించారు. ఈ మూవీ నుంచి ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏర్పడి, అది పెళ్లికి దారి తీసింది. ఇక ఇద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నామని ఇటీవలే అనౌన్స్ చేయడంతో, సెలబ్రిటీల నుంచి అభిమానుల దాకా ఈ జంటను అభినందనలతో ముంచెత్తారు.
కొత్త 'డాన్'... తప్పుకున్న షారుఖ్
కాగా 2023లో షారుక్ ఖాన్ 'డాన్ 3' సినిమాలో నటిస్తున్నట్టు వచ్చిన వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. 1978లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'డాన్' ఫ్రాంచైజీకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. 2006, 2011లో రిలీజ్ అయిన రెండు పార్ట్స్ లోనూ షారుక్ ఖాన్ భాగమయ్యారు. ఇక ఇప్పుడు తెరకెక్కబోతున్న ఐకానిక్ డాన్ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'డాన్ 3' సినిమాలో షారుక్ ఖాన్ బదులు రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇక ఫర్హాన్ అక్తర్ ఈ మూవీని కాకుండా, '120 బహుదూర్' అనే మరో ప్రాజెక్ట్ ను కూడా పట్టాలెక్కిస్తున్నారు. '120 బహుదూర్' అనే ఈ వార్ డ్రామా 2025 చివర నాటికి తెరపైకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: నయనతార రూల్ మార్చేశారా.? - కొత్త సినిమా ప్రారంభంలో నయన్, ఆమేనా అంటూ నెటిజన్లు షాక్





















