Ind vs ZIM- 1st Innings Highlights: శుభ్ మన్ గిల్ సెంచరీ.. జింబాబ్వే ముందు 290 పరుగుల లక్ష్యం
IND vs ZIM, 3rd ODI, Harare Sports Club: జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. 289 పరుగులు చేసిన భారత్.. జింబాబ్వే ఎదుట 290 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 289 పరుగులు సాధించింది. భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ (50)అర్ధశతకంతో మెరవగా.. శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లతో మెరిశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. 15వ ఓవర్లో రాహుల్.. బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత శిఖర్ కు గిల్ జతకలిశాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 84 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ స్కోరు బోర్డును నడిపించాడు.
Shubman Gill scored a splendid 130 and is our Top Performer from the first innings 👏
— BCCI (@BCCI) August 22, 2022
A look at his batting summary here 👇👇#TeamIndia #ZIMvIND pic.twitter.com/Znz52wQjMo
శతక భాగస్వామ్యం
తొలుత ఆచితూచి ఆడిన ఈ జంట.. వీలు చిక్కినప్పుడిల్లా బౌండరీలు బాదారు. 35వ ఓవర్లో గిల్ తన అర్ధశతకాన్నిపూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. మరోవైపు కిషన్ 42వ ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వెంటనే రనౌట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా ఒక పరుగుకే ఔటయ్యాడు.
గిల్ సెంచరీ
అయితే వికెట్లు పడుతున్నా గిల్ సమయోచితంగా ఆడుతూ 44వ ఓవర్లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. హుడా తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ వరుసగా రెండు సిక్సులు కొట్టి పెవిలియన్ చేరాడు. శతకం తర్వాత జోరు పెంచిన గిల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్కోరు పెంచే క్రమంలో 49వ ఓవర్లో 130 పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి భారత్ 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు సాధించాడు. విక్టర్, ల్యూక్ చెరో వికెట్ పడగొట్టారు.
Innings Break!
— BCCI (@BCCI) August 22, 2022
A brilliant 130 from @ShubmanGill as #TeamIndia post a total of 289/8 on the board.
Scorecard - https://t.co/ZwXNOvRwhA #ZIMvIND pic.twitter.com/sKPx9NzWwi