Ravana Dead Body Still Preserved: ఆ గుహలో రావణుడి అస్తిపoజరం - అక్కడే నిధి , నాగబంధం!
Ravana Dead Body: రామాయణం యుద్ధంలో రాముడు...రావణుడిని వధించి సీతను తీసుకెళ్లాడు రాముడు. అయితే రావణుడి చితి ఇప్పటికీ మండుతూనే ఉందని ఓ కథనం..రావణుడి శవం ఓ గుహలో భద్రపరిచారని మరో కథనం..ఇందులో ఏది నిజం?
Ravana Dead Body Still Preserved: రామాయణం అంటే రాముడితో పాటూ అందులో ప్రతి పాత్ర గురించి చర్చించుకుంటారు. ముఖ్యంగా దసరా, శ్రీరామనవమి సమయంలో రావణుడి గురించి కూడా తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. రావణుడి గురించి వివిధ రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి..వాటిలో ముఖ్యంగా దశకంఠుడి మృతదేహం చుట్టూ చాలా కథలు చెబుతారు..
Also Read: రామయ్య ఆకాశం సీతమ్మ పుడమి - ఇద్దరి కళ్యాణం ప్రకృతికి పులకరింత!
గుహలో రావణుడి అస్తి పంజరం!
పురాణాల ప్రకారం రామ-రావణ యుద్ధం తర్వాత..రావణుడి అంతిమ సంస్కారాలు చేయమని విభీషణుడికి అప్పగించాడు రాముడు. కానీ సింహాసనం అధిష్టించే కంగారులో ఉన్న విభీషణుడు ఆ పని చేయకుండా వదిలిపెట్టేశాడు. రావణుడి స్నేహితుడైన నాగరాజు ఆ మృతదేహాన్ని పాతాళానికి తీసుకెళ్లి..తిరిగి ప్రాణం పోసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. ఆ తర్వాత ఆ మృతదేహం పాడవకుండా ఎన్నో లేపనాలు పూసి దానిని తిరిగి తీసుకొచ్చి శ్రీలంకలో రాగాల అడవులలో ఓ గుహలో భద్రపరిచాడు. శ్రీలంకలోని అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం రామాయణానికి సంబంధించిన 50 ప్రదేశాలను కనిపెట్టింది. రామాయణంలో కూడా ఈ ప్రదేశాల ప్రస్తావన ఉంది. వీటిలో ఒకటి శ్రీలంకలోని రాగల అడవి...దాని మధ్యలో ఉన్న ఎత్తైన పర్వతంపై ఉన్న గుహలో రావణుడి మృతదేహాన్ని భద్రపరిచారని చెబుతారు. అంతర్జాతీయ రామాయణ పరిశోధనా కేంద్రం ప్రకారం 18 అడుగుల పొడవు ఉన్న ఆ అస్తిపంజరం రావణుడిదే అంటున్నారు. పైగా రావణుడు...శివుడి కోసం తపస్సు చేసిన గుహ కూడా ఇదేనని...అందుకే ఆ గుహలోనే రావణుడి దేహాన్ని భద్రపరిచారని చెబుతారు.
Also Read: చెప్పుడు మాటలు విని తర్వాత పశ్చాత్తాప పడితే ఏ లాభం - అయోధ్యకాండలో ఆసక్తికర విషయాలివే!
శవపేటిక కింద నిధి
రావణుడి మరణం తర్వాత వేల సంవత్సరాలు గడిచినా ఆ దేహం పాడవకుండా లేపనాలు పూసినట్టు చెబుతారు. రావణుడి శవపేటిక కింద అమూల్యమైన నిధి ఉందని...అందుకే అక్కడ నాగబంధం ఉందట. పైగా రావణుడి మరణం క్షణికమైనది తిరిగి వస్తాడని నాగవంశీయుల నమ్మకం...అందుకే రావణుడి మృతదేహానికి కాపలా కాస్తున్నారని అంటారు.
రావణ కాష్టం సంగతేంటి!
రావణుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా...ఆయన సతీమణి మండోదరి దీక్ష చేపట్టేది..అందుకే రావణుడికి అపజయం అనేదే లేదు. రామ రావణ యుద్ధం సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుంది కానీ...ఆ దీక్ష భగ్నం చేయకపోతే రావణసంహారం జరగదని భావించిన దేవతలు ఆ బాధ్యత ఆంజనేయుడికి అప్పగించారు. హనుమంతుడి ప్రయత్నంతో మండోదరి దీక్ష భగ్నమైంది...ఆ తర్వాత రావణ సంహారం జరిగింది. అసలు విషయం గ్రహించిన మహాపతివ్రత మండోదరి దేవతలను శపించబోయిందట...అప్పుడు ఆమెను శాంతింపజేసిన దేవతలు మండోదరి శాశ్వత సుమంగళిగా ఉండే వరాన్ని ప్రసాదించారు. అదెలా సాధ్యం అంటే...చితి ఆరిపోయిన తర్వాత , అస్తికలు, భస్మం పుణ్యనదుల్లో కలిపి, పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్టు కాదు. అందుకే రావణుడి చితి నిరంతరం వెలుగుతూనే ఉండేలా దేవతలు ఆమెకు వరమిచ్చారు. అప్పటినుంచీ 'రావణకాష్ఠం రగులుతూనే ఉంటుంది' అనే ప్రయోగం వాడుకలోకి వచ్చింది.
అయితే రావణుడి చితి ఇప్పటికీ వెలుతూనే ఉందన్నదే నిజమని...గుహలో అస్తిపంజరం ఉందనే ప్రచారం పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నంలో భాగమని అంటున్నారు. మరి ఏది వాస్తవమో - ఏది అవాస్తవమో విశ్వశించేవారిపై ఆధారపడి ఉంటుంది...