చాణక్య నీతి: చాణక్యుడు చెప్పిన స్త్రీ గూఢచారులు వీరే!
చాణక్యుడికి రాజకీయాల గురించి మాత్రమే కాదు సమాజంలోని ప్రతి విషయం గురించి లోతైన జ్ఞానం, అంతర్దృష్టి ఉంది . అందుకే ఇప్పటికీ ఎందరో పాలుకులు, నాయకులు వీటిని అనుసరిస్తుంటారు
ముఖ్యంగా పరిపాలనా వ్యవస్థలో గూఢచారి వ్యవస్థకు చాలా ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు చాణక్యుడు.
గూఢచారుల నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ప్రభువు తన పరిపాలనా విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.
చాణక్యడు చెప్పిన గూఢచార వ్యవస్థలో స్త్రీలకు కూడా స్థానముంది
ఓ పేద బ్రాహ్మణ వితంతు స్త్రీగా ఓ ఇంటిలో ప్రవేశించి కావాల్సిన విషయాలు రాబట్టే స్త్రీని 'పరివ్రాజిక' అంటారు
ఇంటింటా అడుక్కునే స్త్రీగా- ఇంట్లో పనిమనిషిగా వంటమనిషిగా ఉంటూ వివరాలు రాబట్టే స్త్రీని 'సూద' అంటారు
మాంసాహారం వండడంలో నిపుణురాలిగా ఇళ్లలో చేరి సమాచారం సేకరించే స్త్రీని 'అరాలిక'
స్నానపానాదులు చేయించేవారిగా వచ్చి పోతూ సమాచార సేకరణ చేపడితే 'స్నాపాశ' అంటారు
ఇంకా మూగవారిగా, గుడ్డివారిగా, చెవిటివారుగా, కుంటివారుగా నటించే గూఢచారులు కొందరుంటారు
కొందరు గూఢచారులకు ఒకరితో మరొకరికి పరిచయం ఉంటే ఇంకొందరికి ఉండదు. అయినా అందరూ తమకు నిర్ధేశించిన పనిచేసుకుపోతుంటారు.