అన్వేషించండి

 ICC Champions Trophy Aus Vs Eng Result Update: ఇంగ్లాండ్ కు 'ఇంగ్లీస్' స్ట్రోక్.. అజేయ సెంచ‌రీతో స‌త్తా చాటిన జోష్ ఇంగ్లీస్.. 5 వికెట్ల‌తో ఆసీస్ ఘ‌న విజ‌యం

గ‌త‌వారం లంక చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ కు గురైన ఆసీస్ .. ఐసీసీ టోర్నీలో త‌న పాత విశ్వ‌రూపాన్ని చూపించింది. కీల‌క‌ ఆట‌గాళ్లు దూర‌మైన‌ప్ప‌టికీ టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఛేద‌నతో రికార్డుల‌కెక్కింది. 

ICC Champions Trophy 2025 Live Updates: జోష్ ఇంగ్లీష్ ( 86 బంతుల్లో 120 నాటౌట్, 8 ఫోర్లు, 6 సిక్సర్లు), అలెక్స్ కేరీ (63 బంతుల్లో 69, 6 ఫోర్లు) అద్భుతంగా పోరాడ‌టంతో ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా రికార్డు చేజింగ్ సాధించింది. శ‌నివారం లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల‌తో ఆసీస్ గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 351 ప‌రుగులు చేసింది. టోర్నీ చ‌రిత్ర‌లో ఇదే తొలి ఇన్నింగ్స్ అత్య‌ధిక స్కోరు కావ‌డం విశేషం. ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ భారీ సెంచ‌రీ (143 బంతుల్లో 165, 17 ఫోర్లు, 3 సిక్స‌ర్లు)తో సత్తా చాటాడు. బౌల‌ర్ల‌లో కొత్త బౌల‌ర్ బెన్ డ్వార్షియ‌స్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ను 47.3 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 356 ప‌రుగులు చేసి పూర్తి చేసింది. గ‌త‌వారం శ్రీ‌లంక చేతిలో 2-0తో క్లీన్ స్వీప్ కు గురైన ఆసీస్ .. ఐసీసీ టోర్నీలో త‌న పాత విశ్వ‌రూపాన్ని చూపించింది. చాలామంది కీల‌క‌మైన ఆట‌గాళ్లు దూర‌మైన‌ప్ప‌టికీ టోర్నీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ఛేద‌న‌ను పూర్తి చేసి రికార్డుల‌కెక్కింది. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో 300+ ఛేద‌న‌ను చేసిన ఏకైక జ‌ట్టు ఆసీస్ మాత్ర‌మే కాగా, తాజాగా మ‌రోసారి కంగారూలే ఈ ఘ‌న‌త‌ను సాధించారు. ఇంగ్లీస్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

డకెట్ జోరు..
అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కు బెన్ డ‌కెట్ ఒంటిచేత్తో భారీ స్కోరు అందించాడు. దాదాపు 48 ఓవ‌ర్ల‌పాటు బ్యాటింగ్ చేసి, ప్ర‌త్య‌ర్తి బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోసి బౌండ‌రీలు సాధించాడు. అంత‌కుముందు ఆరంభంలోనే ఫిల్ సాల్ట్ (10), జేమీ స్మిత్ (15) త్వ‌ర‌గా ఔట‌వ‌డంతో ఇంగ్లాండ్ క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో జో రూట్ (68) తో క‌లిసి జ‌ట్టును డ‌కెట్ న‌డిపించాడు. వీరిద్ద‌రూ ఇన్నింగ్స్ ను మంచిగా నిర్మించుకుంటూ ముందుకు న‌డిపించారు. ఈ క్ర‌మంలో మూడో వికెట్ కు 158 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని సాధించారు. ఈ క్ర‌మంలో 49 బంతుల్లో డకెట్ ఫిఫ్టీ పూర్తి చేయ‌గా, రూట్ 56 బంతుల్లో అర్థ సెంచ‌రీ సాధించాడు. ఆ త‌ర్వాత రూట్ వెనుదిరిగినా, డ‌కెట్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ, 95 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. చివ‌ర్లో ఆర్చ‌ర్ (21 నాటౌట్) బ్యాట్ ఝుళిపించ‌డంతో జ‌ట్టు స్కోరు 350+ ప‌రుగుల‌ను దాటింది. బౌల‌ర్ల‌లో ఆడం జంపా, మార్న‌స్ ల‌బుషేన్ కు రెండు, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక వికెట్ ద‌క్కింది. 

ఇంగ్లీస్ దెబ్బ..
ఛేద‌న‌లో ఇంగ్లాడ్ కు జోష్ ఇంగ్లీస్ చుక్క‌లు చూపించాడు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (6), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (5) వికెట్లు తీసిన ఆనందాన్ని ఇంగ్లాండ్ కు ఎక్కువ సేపు మిగిలించ‌లేదు. క్యారీతో క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యాన్ని న‌మోదు చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆ తర్వాత అజేయంగా నిలిచి, జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఇంగ్లీస్-కేరీ జంట‌.. మ‌ధ్య‌లో మంచు కుర‌వ‌డంతో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారిపోవడాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకుంది. వీరిద్ద‌రూ ఏమాత్రం ఒత్తిడి లేకుండా మైదానం నలువైపులా బౌండ‌రీలు బాదుతూ స్కోరు బోర్దును ప‌రుగులెత్తించారు. ఈ క్ర‌మంలో ఐదో వికెట్ కు ఏకంగా 146 ప‌రుగుల భాగ‌స్వ‌ామ్యాన్ని న‌మోదు చేశారు. ఫిప్టీ చేసిన త‌ర్వాత కేరీ వెనుదిరగ‌గా, చివ‌ర్లో మ్యాక్స్ వెల్  (32 నాటౌట్) సాయంతో జ‌ట్టును విజ‌య తీరాల‌కు చేర్చాడు. మ్యాక్స్ వెల్ తో కలిసి అత్యంత వేగంగా 74 పరుగల పార్ట్నర్ షిప్ ను నమోదు చేశాడు.  77 బంతుల్లోనే సెంచ‌రీ చేసి వ‌న్డేల్లో తొలి సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. అంత‌కుముందు ఓపెన‌ర్ మ‌థ్యూ షార్ట్ (63) ఫిఫ్టీతో రాణించాడు. బౌల‌ర్ల‌లో మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చ‌ర్, బ్రైడెన్ కార్స్, ఆదిల్ ర‌షీద్, లియామ్ లివింగ్ స్ట‌న్ కు త‌లో వికెట్ ద‌క్కింది. 

Read Also: ENG vs AUS: ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఉతికారేసిన బెన్ డకెట్ -21 ఏళ్ల రికార్డు బ్రేక్

 

టాప్ హెడ్ లైన్స్

Arshdeep - Samreen Romance:
"మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
IND vs ZIM 3rd T20 Update:  వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
వైభవ్ సూర్యవంశీ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ .. టీమిండియా భారీ స్కోరు, క్లీన్ స్వీప్ దిశగా శ్రేయ‌స్ సేన సూప‌ర్ స్కెచ్!
Kishan Viral Video: ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో
ధోనిని కాపీ కొట్టబోయి బోల్తా ప‌డిన ఇషాన్ కిషన్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన  ఫన్నీ వీడియో

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Upcoming Cars in India: 3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
3 కొత్త కార్లు లాంచ్ చేస్తున్న టయోటా.. హైలైట్‌గా 35 కి.మీ కంటే ఎక్కువ మైలేజ్ కారు!
Embed widget