Chicken Biryani and roast Free | గుంటూరు ఉచిత చికెన్ మేళాకు భారీగా భోజన ప్రియులు | ABP Desam
తిన్నంత చికెన్ బిర్యానీ ఫ్రీ అని పిలిచారు. చికెన్ రోస్ట్, చికెన్ కర్రీ, ఎగ్స్ ఫ్రీ అంటే ఫ్రీ వచ్చి కుమ్మేయండి అని ఆహ్వానం పలికారు. ఇక అంతే వందల సంఖ్యలో ప్రజలు భారీగా తరలివచ్చారు. అసలు ఓ టైమ్ లో వాళ్లను హ్యాండిల్ చేయటమే కష్టమైపోయింది. బారులు బారులు తీరి క్యూలో నిలబడిన జనాలు చూస్తుంటే అర్థమైపోతుంది అక్కడ ఎంత మంది ఉన్నారో అని. గుంటూరులో పట్టాభిపురం స్వామి థియేటర్ ప్రాంగణంలో జరిగింది ఈ చికెన్ మేళా. బర్డ్ ఫ్లూ కారణంగా ప్రజలు భయపడక్కర్లేదని బాగా ఉడకబెట్టిన చికెన్, ఎగ్స్ తో ఎలాంటి సమస్యలు ఉండవని అవగాహన కల్పించేందుకు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఫ్రీ చికెన్ మేళాను నిర్వహించారు. అయితే ఇలా కార్యక్రమాల ఏర్పాటు తో తొక్కిసలాట లాంటివి జరిగితే పరిస్థితి ఏంటి అని కొంత మంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.





















