![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Happy Kanuma 2023 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు కొటేషన్స్
మీ బంధుమిత్రులకు ఈ కోట్స్‌తో కనుమ శుభాకాంక్షలు చెబితే చాలా సంతోషిస్తారు. ఇంకెందుకు ఆలస్యం అందరి కంటే ముందే.. మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలుచెప్పేయండి మరి.
![Happy Kanuma 2023 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు కొటేషన్స్ Happy Kanuma 2023 Wishes In Telugu: Kanuma 2023 Wishes, Quotes, Greetings and Facebook Instagram twitter WhatsApp Messages In Telugu, know in details Happy Kanuma 2023 Wishes In Telugu: మీ బంధుమిత్రులకు కనుమ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు కొటేషన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/14/2a28141e97c13972391ca4a0f05da95e1673715540328217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Kanuma Wishes in Telugu 2023: సంక్రాంతి పండగలో భాగంగా మూడో రోజు జరుపుకునే వేడుక కనుమ. ఇది రైతులు జరుపుకునే పండగ. పంటలు చేతికి అందించడంలో సహాయపడిన పశు పక్ష్యాదులను ఈ రోజు పూజిస్తారు. పశువులను బావులు లేదా చెరువుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేయించి అందంగా అలంకరించి ఇంటికి తీసుకొచ్చాక పూజిస్తారు. ఈరోజు మొత్తం వాటితో ఎలాంటి పని చేయంచరు..వాటికి నచ్చే ఆహారాన్ని అందించి పూర్తి విశ్రాంతి కల్పిస్తారు. సంక్రాంతి ముగింపు వేడుకగా చెప్పే కనుమ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు చెప్పేందుకు కొటేషన్స్ ఇక్కడ ఇస్తున్నాం...
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ పండుగ శుభాకాంక్షలు
రైతులే రాజుగా రాతలే మార్చే పండుగ
పంట చేలు కోతలతో ఇచ్చే కానుక
మంచి తరుణాలకు కమ్మని వంటలతో కడుపు నింపే కనుమ
ప్రతి ఇంట్లో కలకాలం జరగాలి ఈ వేడుక
కనుమ పండుగ శుభాకాంక్షలు!
Also Read: సంక్రాంతి ఆద్యంతం సందడి చేసే హరిదాసు, బసవన్న సాక్షాత్తూ ఎవరో తెలుసా!
రోకల్లు దంచే ధాన్యాలు, మనసుల్ని నింపే మాన్యాలు
రెక్కల కష్టంలో చేదోడుగా నిలిచిన మన పాడి-పశువులు
మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలి ఇలాంటి వేడుకలు
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు!
కష్టానికి తగిన ప్రతిఫలం కనుమ
శ్రమకోర్చిన పశువులకు ఇచ్చే గౌరవం కనుమ
మనలోని మంచితనాన్ని వెలిగించే దినం కనుమ
అందరం కలిసి కష్టసుఖాలను పంచుకునే పర్వదినం కనుమ
మీకు మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు!
Also Read: కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు కదా నిజమా - చేస్తే ఏమవుతుంది!
ఏడాది పొడవునా తమ కష్టంలో పాలు పంచుకునే
పశువులను రైతన్నలు పూజించే పండుగ కనుమ
తెలుగు ప్రజలందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
వ్యవసాయంలో తమకు
తోడుగా ఉన్న పశువులకు శుభాకాంక్షలు తెలిపే పండుగ
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
మట్టిలో పుట్టిన మేలిమి బంగారం
కష్టం చేతికి అందొచ్చే తరుణం
నేలతల్లి, పాడిపశువులు అందించిన వరప్రసాదం
'కనుమ'లా వడ్డించింది పరమాన్నం
కనుమ పండుగ శుభాకాంక్షలు
ముంగిళ్లలో మెరిసే రంగవల్లులు
తెలుగుదనాన్ని తట్టిలేపే బంగారు తల్లులు
బసవన్నల ఆటపాటలు సంక్రాంతి సరదాలు
ఈ 'కనుమ' మీకు కమ్మని అనభూతులను
అందించాలని కోరుకుంటూ కనుమ శుభాకాంక్షలు
మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్ఞాపకం
బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకుందాం సంబరం
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు
కనుమ రోజు మినుములు ఎందుకు తినాలంటే: కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకనే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి' అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.
కనుమ రోజు కలిసి తినాలి: కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్లు వండటం, బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరిగుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)